ఇసుక టెండర్లు జ్యుడిషియల్‌ ప్రివ్యూ పరిధిలోకి రావు | Sand tenders are not subject to judicial review | Sakshi
Sakshi News home page

ఇసుక టెండర్లు జ్యుడిషియల్‌ ప్రివ్యూ పరిధిలోకి రావు

Published Wed, Oct 11 2023 5:10 AM | Last Updated on Wed, Oct 11 2023 5:10 AM

Sand tenders are not subject to judicial review - Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక టెండర్లు జ్యుడిషియల్‌ ప్రివ్యూ పరిధిలోకి రావని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇసుక టెండర్లపై న్యాయ సమీక్ష ఏదంటూ ఈనాడు పత్రికలో రాసిన కథ­నం పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడుకున్న­దని స్పష్టం చేశారు.  ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ వక్రీకరణ వార్తను ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చే శారు.

ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు సంబంధించిన నిబంధనలు అందరూ తెలు­సు­కునేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో ఉన్నాయని, కనీసం వాటిని పరి శీలించకుండా ఈనాడు కథనాలు రాయడం బాధ్యాతా రాహి­త్యమని పేర్కొన్నారు. ప్రజా­­ధనం దుర్విని­యోగం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జ్యుడి­షియల్‌ ప్రివ్యూ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు.

రూ.100 కోట్లు దాటితేనే..
ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లకుపైగా వ్యయం చేస్తే.. అలాంటి ప్రాజెక్టులకు నిర్వహించే టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఆమో­దం తీసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. తాజాగా గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు. ఆ టెండర్ల ప్రక్రియకు జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఎందుకు కోరలేదంటూ ఈనాడు అవగాహనా రాహిత్యంతో వార్త రాసిందన్నారు. ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేయడం కోసమే ఈ కథనం రాశారని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీని టెండర్ల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేస్తోందని తెలిపారు.

ఇందుకోసం ప్రభుత్వం చేసే  వ్య యం చాలా స్వల్పమని తెలిపారు. ఈ టెండర్లలో ఎంపికైన కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి ఇసుక తవ్వకాలు, విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలి­పారు. ఆ సంస్థ ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తానికి ఇసుకను వినియోగదారులకు విక్రయించి, టెండర్లలో ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తానని కోట్‌ చేసిందో ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని వివరించారు. ఈ ప్రక్రి­­యలో ప్రభుత్వం రూ.100 కోట్ల మేర ఎక్కడ వ్యయం చేస్తోందని ప్రశ్నించారు. అలాంటప్పుడు న్యాయసమీక్షకు పంపలేదని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు.

బీచ్‌ శాండ్‌లో ఏపీఎండీసీ చెల్లింపులు జరుపుతుంది కాబట్టే ప్రివ్యూకి బీచ్‌ శాండ్‌ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఇసుక టెండర్లను పంపలేదంటూ బోడిగుండుకు, మోకాలికి ముడి వేసేలా కథనంలో వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. బీచ్‌ శాండ్‌ ఆపరేషన్స్‌ చేసే కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి ఏపీఎండీసీ రూ.100 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండటం వల్లే ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపామని తెలిపారు. కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని వెల్లడించారు. దీనిని అర్థం చేసుకోకుండా సందేహాలు అంటూ ఈనాడు పత్రిక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement