sand tenders
-
పామర్రు టీడీపీలో రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం..
సాక్షి, కృష్ణా: ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్‌లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.తాజాగా కృష్ణా జిల్లా పామర్రు టీడీపీలో ఇసుక టెండర్ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్ కోసం టీడీపీ నేతలు మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెంబర్ బెదిరింపు వీడియో ఒకటి కలకలం రేపుతోంది. బెనర్జీ అనే టీడీపీ నేతకు ఇసుక టెండర్ వేయొద్దంటూ ఎమ్మెల్యే వర్గం నేత సురేష్ బెదిరింపులకు పాల్పడినట్లు ఇందులో ఉంది. ఇసుక టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకూడదని సురేష్ హుకుం జారీ చేశారు. ఇసుక టెండర్ వేసిన బెనర్జీని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించిన వీడియో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. -
ఇసుక టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ పరిధిలోకి రావు
సాక్షి, అమరావతి: ఇసుక టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ పరిధిలోకి రావని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇసుక టెండర్లపై న్యాయ సమీక్ష ఏదంటూ ఈనాడు పత్రికలో రాసిన కథనం పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడుకున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ వక్రీకరణ వార్తను ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చే శారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూకు సంబంధించిన నిబంధనలు అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్లో ఉన్నాయని, కనీసం వాటిని పరి శీలించకుండా ఈనాడు కథనాలు రాయడం బాధ్యాతా రాహిత్యమని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. రూ.100 కోట్లు దాటితేనే.. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లకుపైగా వ్యయం చేస్తే.. అలాంటి ప్రాజెక్టులకు నిర్వహించే టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఆమోదం తీసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. తాజాగా గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఆ టెండర్ల ప్రక్రియకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు కోరలేదంటూ ఈనాడు అవగాహనా రాహిత్యంతో వార్త రాసిందన్నారు. ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేయడం కోసమే ఈ కథనం రాశారని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం కాంట్రాక్టింగ్ ఏజెన్సీని టెండర్ల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చేసే వ్య యం చాలా స్వల్పమని తెలిపారు. ఈ టెండర్లలో ఎంపికైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఇసుక తవ్వకాలు, విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. ఆ సంస్థ ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తానికి ఇసుకను వినియోగదారులకు విక్రయించి, టెండర్లలో ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తానని కోట్ చేసిందో ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని వివరించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం రూ.100 కోట్ల మేర ఎక్కడ వ్యయం చేస్తోందని ప్రశ్నించారు. అలాంటప్పుడు న్యాయసమీక్షకు పంపలేదని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. బీచ్ శాండ్‌లో ఏపీఎండీసీ చెల్లింపులు జరుపుతుంది కాబట్టే ప్రివ్యూకి బీచ్ శాండ్ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఇసుక టెండర్లను పంపలేదంటూ బోడిగుండుకు, మోకాలికి ముడి వేసేలా కథనంలో వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. బీచ్ శాండ్ ఆపరేషన్స్ చేసే కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఏపీఎండీసీ రూ.100 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండటం వల్లే ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపామని తెలిపారు. కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని వెల్లడించారు. దీనిని అర్థం చేసుకోకుండా సందేహాలు అంటూ ఈనాడు పత్రిక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. -
‘రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు’
సాక్షి, అమరావతి: రాజకీయ దురుద్దేశంతోనే ఇసుక టెండర్లపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, విచ్చల విడిగా ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక టెండర్లలో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారానే టెండర్లు పిలిచామన్నారు. రూ.120 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ చేసిన సంస్థ దివాళా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వినియోగదారులకు సక్రమంగా ఇసుక సరఫరా అందిస్తున్నామని, సొంతంగా వినియోగదారులే ఇసుక తరలించేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే ఇసుక అక్రమాలపై ఫిర్యాదులకు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం పెద్దిరెడ్డి వివరించారు. -
ఇసుక టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకం
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఎంఎస్టీసీ ద్వారా అత్యంత పారదర్శకంగా, పటిష్ట నిబంధనలతో టెండర్లు నిర్వహించి ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించామని రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఎటువంటి లొసుగులు లేకుండా ఉండాలనే టెండర్ల ప్రక్రియలో అపార అనుభవం ఉన్న ఎంఎస్‌టీసీకి ఆ బాధ్యత అప్పగించామని, ఆ సంస్థ కొన్ని వందల టెండర్ల ప్రక్రియ నిర్వహించిందని తెలిపారు. అయినా కొంతమంది ఆరోపణలు చేస్తుండటం బాధాకరమన్నారు. రూ.950 కోట్ల ఇసుక కాంట్రాక్టులో రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందనడం సరికాదన్నారు. ఈ మేరకు సచివాలయంలో సోమవారం ద్వివేది మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 7 కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరిపాం.. ఇసుక తవ్వకాలు, నిల్వ, విక్రయాలు నిర్వహించే సంస్థలను ఎంపిక చేయడానికి ఏడు సంస్థలతో సంప్రదింపులు జరిపి ఎంఎస్టీసీతో భూగర్భ గనుల శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. దరఖాస్తు చేసుకున్న కంపెనీల సాంకేతిక సమర్థతలను పరిశీలించాక ఎంఎస్టీసీ ఆర్థిక బిడ్లను ఆహ్వానించింది. పోటీలో ఎక్కువమంది పాల్గొనేందుకు వీలుగా టెండర్ల స్వీకరణకు గడువు తేదీని పెంచింది. దీనిపై అన్ని ప్రముఖ దినపత్రికల్లో విస్తృతంగా ప్రకటనలు కూడా ఇచ్చింది. బిడ్ల దాఖలులో భయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకు ఆన్లైన్ పద్ధతిలో టెండర్లు స్వీకరించింది. అత్యంత పారదర్శకంగా జయ్‌ప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌ను ఎంపిక చేసింది. ఎప్పుడూ లేని విధంగా కాంట్రాక్ట్ సంస్థ నుంచి రూ.120 కోట్ల బ్యాంకు గ్యారెంటీని కూడా స్వీకరించాం. ఈ సంస్థ ప్రతి 15 రోజులకు ఒకసారి, ముందుగానే తర్వాత 15 రోజులకు డబ్బును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గతేడాది ఇసుక తవ్వకాలు సుమారు 1.6 కోట్ల మెట్రిక్ టన్నులు కాగా తాజాగా ఏడాదికి 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు, సరఫరాను కనీస లక్ష్యంగా నిర్దేశించాం. దీనివల్ల కొరత లేకుండా ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సర్వర్లు మొరాయించడం, నెట్వర్క్ సమస్యలు, కృత్రిమ కొరతను సృష్టించడం, మధ్యవర్తుల ప్రమేయం వంటి అక్రమాలకు చెక్ పడుతుంది. మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు తాజా ఇసుక విధానం ప్రకారం.. మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లిస్తే చాలు.. ఎంత కావాలంటే అంత ఇసుకను తీసుకెళ్లొచ్చు. 175 నియోజకవర్గాలవారీగా రవాణా ఖర్చులతో కలిపి ప్రభుత్వం ధరలు ప్రకటిస్తుంది. ఈ ధరల కంటే అధిక ధరకు ఎవరైనా విక్రయిస్తే 14500కు ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటికే ఇసుక అక్రమాలను నివారించడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది. ఇసుక రీచ్ వద్ద మెట్రిక్ టన్నుకు రూ.475 చెల్లించగానే అందులో రూ.375 నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. మిగిలిన రూ.100 నిర్వహణా ఖర్చులు కింద కాంట్రాక్టర్‌కు వెళతాయి. టన్నుకు రూ.475 చొప్పున మొత్తం 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక విలువ రూ.950 కోట్లు. ఇందులో కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సింది రూ.765 కోట్లు కాగా, మిగిలిన సొమ్ము యంత్రాలు, పరికరాలు, పంపిణీ, నిర్వహణా ఖర్చుల కింద కాంట్రాక్టు సంస్థకు వెళ్తుంది. ప్రజలకు మేలు చేయడానికే కొత్త ఇసుక విధానం నదుల పక్కనే ఉన్న గ్రామాల్లోనివారు సొంత అవసరాల కోసం ఎడ్ల బళ్ల ద్వారా ఉచితంగా ఇసుకను తెచ్చుకోవచ్చు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణాలకు, ఆర్ అండ్ ఆర్ కాలనీలకు రాయితీపై సరఫరా ఉంటుంది. గతంలో మాదిరిగా ఉచితమని చెప్పి రూ.వందల కోట్లు దోపిడీ చేసే అవకాశం లేకుండా ప్రజలకు మేలు చేయడానికే కొత్త ఇసుక విధానానికి రూపకల్పన చేశాం. కాంట్రాక్టు పొందిన సంస్థ నిబంధనల విషయంలో విఫలమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
ఇసుక టెండర్లు రద్దు
♦ ధరావతు సొమ్ము వాపసు ♦ సీనరేజీ వసూలుకు స్వస్తి ♦ భూగర్భ గనుల శాఖ అధికారుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అన్నివర్గాల ప్రజలకు ఇళ్లు, ఇతర నిర్మాణ పనులకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం తాజాగా నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇసుక రేవులకు నిర్వహించిన టెండర్లు అన్నీ రద్దు కానున్నాయి. టెండర్లలో పాల్గొన్నవారు చెల్లించిన ధరావతు మొత్తాన్ని సర్కారు వారికి వెనక్కు ఇవ్వనుంది. ఇప్పటివరకూ రకరకాల కారణాలవల్ల వేలం నిర్వహించని రేవులకూ ఇక టెండర్లు ఉండవు. ఈ మేరకు భూగర్భ గనులశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వేలం జరగని రేవులకు జారీచేసిన టెండర్ ప్రకటనల్ని రద్దు చేయాలంటూ జేసీల నేతృత్వంలోని జిల్లాల ఇసుక కమిటీలకు ఉత్తర్వులివ్వనున్నారు. టెండర్లు పూర్తయిన రేవులకు కూడా వాటిని రద్దుచేసి ధరావతు మొత్తాన్ని వాపసివ్వనున్నారు. నిర్మాణ పనులకు వినియోగించే ఇసుకకు సీనరేజి ఫీజు, ఇతర పన్నుల్నీ రద్దు చేయాలని గనులశాఖ నిర్ణయించింది. -
8న ఇసుక రీచ్‌లకు టెండర్ల నోటిఫికేషన్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక పాలసీపై సబ్‌కమిటీ మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. విశాఖ కలెక్టరేట్లో సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వెల్లడించారు. 1.5 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలంలో ఉంచనున్నట్టు, క్యూబిక్ మీటర్ ధరను రూ.500 గా నిర్ణయించామన్నారు. ఈ నెల 8న ఇసుక రీచ్‌లకు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. వేలంతోపాటు, టెండర్లను కూడా ఆహ్వానిస్తామని, ఎక్కువ ధర వేసిన వారికే ఖరారు చేస్తామని యనమల చెప్పారు. చిన్న చిన్న వాగుల నుంచి రైతులు ఎడ్లబండ్లపై ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చునన్నారు. అలాగే, రిటైల్ రంగంపై విధానాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. విశాఖలో 10 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్, సన్‌రైజ్ ఆఫ్ ఏపీ ఇండస్ట్రియల్ సదస్సుల్లో 250 ఎంవోయూలు జరగనున్నట్లు యనమల తెలిపారు.