‘రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు’ | Peddireddy Ramachandra Reddy Talks In Press Meet Over Sand Tender | Sakshi
Sakshi News home page

‘రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు’

Published Thu, Mar 25 2021 12:13 PM | Last Updated on Thu, Mar 25 2021 1:22 PM

Peddireddy Ramachandra Reddy Talks In Press Meet Over Sand Tender - Sakshi

సాక్షి, అమరావతి: రాజకీయ దురుద్దేశంతోనే ఇసుక టెండర్లపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, విచ్చల విడిగా ఇసుకను దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక టెండర్లలో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారానే టెండర్లు పిలిచామన్నారు. రూ.120 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌ చేసిన సంస్థ దివాళా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వినియోగదారులకు సక్రమంగా ఇసుక సరఫరా అందిస్తున్నామని, సొంతంగా వినియోగదారులే ఇసుక తరలించేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. అలాగే ఇసుక అక్రమాలపై ఫిర్యాదులకు కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశాం పెద్దిరెడ్డి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement