సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇసుక టెండర్ల దాఖలులో కూటమి నేతలు కొట్లాటకు దిగారు. జిల్లాలో రెండు ఇసుక క్వారీలకు టెండర్లు వేయగా, రంగంలోకి దిగిన బీటెక్ రవి అనుచరులు హల్‌చల్ చేశారు. ఇద్దరు మీడియా ప్రతినిధులను బీటెక్ అనుచరులు నిర్భంధించారు.
సిద్ధవటం మండలం మూలపల్లి ఇసుక క్వారీ విషయంలో బీటెక్ రవి, జనసేన నేతల మధ్య వార్ జరుగుతోంది. ఎవర్నీ టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ జనసేన నేత అతికారి కృష్ణ హల్‌చల్ చేశారు. పోలీసులపై జనసేన నేతలు దౌర్జన్యానికి దిగారు. చక్రాయపేట మండలం గండికొవ్వూరు ఇసుక రీచ్ టెండర్లలతో బీటెక్ రవి, కడప టీడీపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది.
దీంతో మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసులపైకి జనసేన నేతలు తిరగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో టెండర్ల స్వీకరణను అధికారులు నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment