పామర్రు టీడీపీలో రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం.. | Sand Tenders Issue Between Pamarru TDP Leaders | Sakshi
Sakshi News home page

పామర్రు టీడీపీలో రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం..

Published Sat, Oct 12 2024 12:35 PM | Last Updated on Sat, Oct 12 2024 12:59 PM

Sand Tenders Issue Between Pamarru TDP Leaders

సాక్షి, కృష్ణా: ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్‌లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.

తాజాగా కృష్ణా జిల్లా పామర్రు టీడీపీలో ఇసుక టెండర్ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్‌ కోసం టీడీపీ నేతలు మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెంబర్‌ బెదిరింపు వీడియో ఒకటి కలకలం రేపుతోంది. బెనర్జీ అనే టీడీపీ నేతకు ఇసుక టెండర్ వేయొద్దంటూ ఎమ్మెల్యే వర్గం నేత సురేష్ బెదిరింపులకు పాల్పడినట్లు ఇందులో ఉంది. ఇసుక టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకూడదని సురేష్ హుకుం జారీ చేశారు. ఇసుక టెండర్ వేసిన  బెనర్జీని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించిన వీడియో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement