సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు టెండర్‌ను మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. రూ.2,169.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఓడరేవు పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను పిలిచేందుకు న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కాంట్రాక్టు (ఈపీసీ) విధానంలో నిర్మించే ఈ ఓడరేవు కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు(ఆర్‌ఎఫ్‌క్యూ) పిలవాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది.
5.05 కిలోమీటర్ల బ్యాక్ వాటర్‌తోపాటు 3 అధునాతన బెర్తుల నిర్మాణం కోసం టెండర్లకు పిలవనుంది. 15.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి లోతు తవ్వేలా ప్రణాళికలు రూపొందించింది. రామాయపట్నం పోర్టును తొలిదశలో మొత్తం 900 మీటర్ల పొడవు, 34.5 మీటర్ల లోతు ఉండే విధంగా మూడు బెర్తులతో నిర్మించనున్నారు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలతో కూడిన టెండర్లను ఏపీ మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. (రామాయపట్నానికి గ్లోబల్ టెండర్లు)
Comments
Please login to add a commentAdd a comment