Ramayapatnam
-
తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు
సాగరమంటేనే జలనిధి...అపార మత్స్య సంపదకు పెన్నిధి... సాగర తీరాన వెలసిన రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సుసంపన్నతను సమకూర్చాయి..మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచాయి...వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాయి..పరిశ్రమల స్థాపనకు పునాదులు వేశాయి...ఆయా రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలను మార్చేశాయి...ఈ ఆలోచనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నాన్ని పాలనారాజధానిగా చేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రేరేపించింది...ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పడానికి విశాఖపట్నంలోని పోర్టు ఒక్కటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో కనిపిస్తోంది... దేశంలోనే సుదీర్ఘ తీరమున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు చాలా అవకాశమున్నా ...పాలించడం చేతకాని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల వాటి ఏర్పాటు సాధ్యం కాలేదు...సీఎంగా జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈ రోజు నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు్ల రాష్ట్రానికి అపార సంపదనివ్వబోతున్నాయి...మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచబోతున్నాయి...మరెన్నో పరిశ్రమల స్థాపనకు ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వేదికలు కాబోతున్నాయి... రాష్ట్ర పురోగమనానికి ఇలాంటి ఆలోచన ఉన్న నేతలు ఉంటేనే నలుచెరగులా ప్రగతి లంగరు వేస్తుంది... సీఎం జగన్ రూపంలో రాష్ట్రానికి బంగరు భవిష్యత్తు అద్దుకుంటోంది. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి పది ఫిషింగ్ హార్బర్లు...రాష్ట్రంలోని మత్స్యకారుల సుదీర్ఘ కల సాకారమవుతోంది. ఇంతకాలం వలస కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు అధునాతన మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మత్స్యకారులకు ప్రయోజనం కలి్పంచే విధంగా పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేవన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ మత్స్యకారులు వాపోయారు. తాను ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించే విధంగా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హమీ మేరకు రూ.3,66.07 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్లను, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేశాన్ని సుసంపన్నం చేయడంలో జలధి ప్రాధాన్యం ఎనలేనిదని చైనా, సింగపూర్ వంటి దేశాలు ఏనాడో గుర్తించాయి. ఈ సత్యాన్ని గుర్తించే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అత్యంత రద్డీ ఉండే ఓడరేవుగా సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా , టాప్ 15 పోర్టుల్లో 8కి పైగా పోర్టులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబైలు మెట్రోపాలిటన్ నగరాలుగా మారడంలో పోర్టులు కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలుగా సృష్టించుకునే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. 2019లో ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం ప్రచారం కోసం టెంకాయలు కొట్టి చేతులు దులిపేసుకున్నాడాయన. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు... ప్రతీ 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లు, ఫిష్‌ల్యాండ్ సెంటర్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. వీటికోసం సుమారు రూ.25,000 కోట్ల వ్యయం చేస్తుండటం అద్భుతం. రూ.3,736.14 కోట్ల వ్యయంతో రామాయపట్నం, రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం, రూ.4,361.91 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, పీపీపీ విధానంలో కాకినాడ సెజ్‌లో గేట్‌వే పోర్టును రూ.2,123.43 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేంద్ర కస్టమ్స్ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలి నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ, రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం... వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది. 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగిందిపోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు... పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని వేశారు.ఈ క్రమంలో తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా, దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరులో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిషింగ్ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్ యూనిట్లు... ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రగతి ఫలితంగా ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోర్టుల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించనుండటంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. రామాయపట్నం సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు.... రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ ఉపకరణాల తయారీ యూనిట్ తొలి దశ పనులను పూర్తి చేసుకుని ఈ మధ్యే ఉత్పత్తిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫిషింగ్ హార్బరు లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలబెట్టుకోవచ్చు. –పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నంనిన్నటిదాకా కూలీలం... ఇకపై యజమానులవుతాం.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూ రు, ప్రకాశం జిల్లా తీరప్రాంత మత్స్యకారులు ఇన్నాళ్లూ చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలి్పంచింది. ఫిషింగ్ హార్బరు, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా జువ్వలదిన్నె హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) మినీపోర్టు స్థాయిలో నిర్మాణం ఇప్పటి వరకు బోట్లు నిలపడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల ఆపేలా నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు...ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్స్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. –ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ రామాయపట్నం► ప్రాజెక్టు వ్యయంరూ.3,736.14 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 34.04 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం138.54 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీపనులు ప్రారంభించిన తేదీ జూన్ 24, 2022 కార్యకలాపాల ప్రారంభం జనవరి, 2024 మచిలీపట్నం ►ప్రాజెక్టు వ్యయం రూ.5,156 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 35 ఎంఎంటీపీఏ►పూర్తిస్థాయి సామర్థ్యం 116 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 21, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 మూలపేట ►ప్రాజెక్టు వ్యయం : రూ.4,361.91 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం23.50 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం: 83.30 టన్నులు ► తొలి దశలో బెర్తులు: నాలుగు రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం1,20,000డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 18, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 కాకినాడ గేట్ వే►ప్రాజెక్టు వ్యయం : రూ.2,123.43 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం16 ఎంఎంటీపీఏ► తొలి దశలో బెర్తులు: నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి క్రాఫ్ట్ బెర్త్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 1,20,000 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ నవంబర్ 20, 2021 కార్యకలాపాల ప్రారంభం నవంబర్, 2024 -
రామాయపట్నం చెంత 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు
-
పోర్టుల చుట్టూ పారిశ్రామిక ప్రగతి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని వెలకట్టలేని సంపదగా భావిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి అనుకూలతగా మార్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు ఆ పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని వెదచల్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న పోర్టుల పక్కన పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయడంపై దృష్టిసారించింది. ముందుగా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసి కొత్త సంవత్సరంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో పోర్టు అందుబాటులోకి రానుండటంతో రామాయపట్నం పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కును ఏపీమారిటైమ్ బోర్డు అభివృద్ధి చేస్తోంది. పోర్టు ఆథారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టిసారించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియ మొదలు పెట్టినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు ఎండీ, సీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరు గ్రామంలో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది. జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ ఈ ఏడాది చివరినాటికి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టీపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, ఒక మల్టీపర్పస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది. పోర్టు పక్కనే కార్గో ఎయిర్ పోర్ట్ కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆథారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టిసారించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో కార్గో ఆధారిత ఎయిర్‌పోర్టు నిర్మాణంపైన కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన దగదర్తి స్థానంలో కార్గో ఆధారిత విమానాశ్రయాన్ని రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెట్టు వద్ద అభివృద్ధి చేయనున్నారు. జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16కి తూర్పువైపు పోర్టు ఉంటే, పడమర వైపు ఎయిర్‌పోర్టు ఉండే విధంగా డిజైన్ చేశారు. -
పోర్టుల అభివృద్ధికి రూ.395 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోర్టుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే పోర్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.395 కోట్లు కేటాయించింది. వీటి ద్వారా ప్రస్తుత పోర్టుల హ్యాండిలింగ్ సామర్థ్యాన్ని 110 టన్నులకు చేర్చడంతో పాటు పోర్టుల నిర్వహణ సామర్థ్యాన్ని 62 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కాకినాడ పోర్టులో రూ.43 కోట్లతో మౌలిక వసతులు పెంచడంతో పాటు సాగరమాల ప్రాజెక్టు కింద కాకినాడ యాంకరేజ్ పోర్టు సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నారు. కొత్త లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, భారీ నౌకలు సులభంగా వచ్చేందుకు డ్రెడ్జింగ్, కాంక్రీటు రోడ్డులు తదితర పనులు చేపట్టనున్నారు. అలాగే కొత్తగా నిర్మించే మచిలీపట్నం పోర్టులో రూ.150 కోట్లతో రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతులతో పాటు 250 ఎకరాలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భావనపాడు పోర్టు వద్ద 200 ఎకరాల భూ సేకరణకు రూ.100 కోట్లు, రామాయపట్నం వద్ద భూసేకరణకు రూ.100 కోట్లను కేటాయించింది. రుణ సమీకరణతో హార్బర్లు, పోర్టులు.. అంతేకాకుండా ఏపీ మారిటైమ్ బోర్డు రుణ సమీకరణ ద్వారా ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల నిర్మాణం చేపట్టనుంది. ఇందుకోసం తొలి దశలో రూ.1,500 కోట్ల రుణం తీసుకోనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ తెలిపారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు టెండర్లు గెలుచుకున్న సంస్థ త్వరలోనే పనులు ప్రారంభించనుందని చెప్పారు. సాంకేతికంగా ఒకటి రెండు అనుమతులు రావాల్సి ఉన్నాయని, ఆగస్టు నుంచి పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. బందరు పోర్టుకు టెండర్లు పిలిచామని, వచ్చే నెల 5న ఈ ప్రక్రియ పూర్తయితే.. వేగంగా పనులు మొదలుపెట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి నాబార్డు రుణం రాగానే పనులు మొదలు పెడతామన్నారు. -
జ్యుడీషియల్ ప్రివ్యూకు రామాయపట్నం టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు టెండర్‌ను మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. రూ.2,169.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఓడరేవు పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను పిలిచేందుకు న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టు (ఈపీసీ) విధానంలో నిర్మించే ఈ ఓడరేవు కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు(ఆర్ఎఫ్క్యూ) పిలవాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. 5.05 కిలోమీటర్ల బ్యాక్ వాటర్‌తోపాటు 3 అధునాతన బెర్తుల నిర్మాణం కోసం టెండర్లకు పిలవనుంది. 15.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి లోతు తవ్వేలా ప్రణాళికలు రూపొందించింది. రామాయపట్నం పోర్టును తొలిదశలో మొత్తం 900 మీటర్ల పొడవు, 34.5 మీటర్ల లోతు ఉండే విధంగా మూడు బెర్తులతో నిర్మించనున్నారు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలతో కూడిన టెండర్లను ఏపీ మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. (రామాయపట్నానికి గ్లోబల్ టెండర్లు) -
రామాయపట్నానికి గ్లోబల్ టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం కోసం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. రూ.2,169.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఓడరేవు పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను పిలిచేందుకు న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టు (ఈపీసీ) విధానంలో నిర్మించే ఈ ఓడరేవు కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు(ఆర్ఎఫ్క్యూ) పిలవాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. తొలిదశలో 3 బెర్తులతో.. ► రామాయపట్నం పోర్టును తొలిదశలో మొత్తం 900 మీటర్ల పొడవు, 34.5 మీటర్ల లోతు ఉండే విధంగా మూడు బెర్తులతో నిర్మించనున్నారు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. పరిశ్రమలు, మౌలిక వసతులు, ఓడరేవుల నిర్మాణంలో ఏడేళ్ల అనుభవం ఉండటంతోపాటు కనీసం రూ.1,080 కోట్ల విలువైన పనులు చేసిన సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కలిగినవిగా నిర్ణయించారు. గత మూడేళ్లలో కంపెనీ టర్నోవర్ రూ. 651 కోట్లు ఉండాలి. ► రెండు మూడు కంపెనీలు కలిపి భాగస్వామ్యంతో బిడ్ దాఖలు చేస్తే ఆర్థిక అర్హతలను కలిపి పరిగణిస్తారు. ప్రాజెక్టు విలువలో ఒక శాతం ఎర్నెస్ట్‌మనీ డిపాజిట్ (ఈఎండీ) కింద రూ.21.70 కోట్లు ముందుగా డిపాజిట్ చేయాలి. డిసెంబర్లో నిర్మాణ పనులు.. ► రామాయపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం లాండ్ లార్డ్ విధానంలో సొంతంగా నిర్మించనుంది. ఈ పోర్టు నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు నిధులు సమకూర్చి అనంతరం బెర్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు లీజుపై ఇస్తుంది. ► రివర్స్ టెండరింగ్ విధానంలో చేపట్టే ఈ బిడ్లకు జ్యుడిషియల్ ప్రివ్యూ అనుమతి రాగానే ఈ నెలలోనే అంతర్జాతీయ టెండర్లు పిలిచేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. టెండర్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. -
‘వాన్‌పిక్ భూములను రైతులకు అప్పగించాలి’
ఒంగోలు: వాన్‌పిక్ భూముల్లో పరిశ్రమలు స్థాపించకపోతే తిరిగి రైతులకు అప్పగించాలని సీపీఐ నేత కె. నారాయణ కోరారు. రామాయపట్నం ఓడరేవు సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు ఓడరేవును నిర్మించాలని దీక్షకు దిగారు. ఈ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నారాయణ మాట్లాడుతూ.. అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రకాశం జిల్లాలో నిర్మించవద్దని అన్నారు. రామాయపట్నం ఓడరేవు ఏర్పాటుకు అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో ఓడరేవు నిర్మించడం వల్ల లక్షలాది మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న అందరూ రాజకీయాలకు అతీతంగా పోర్టు కోసం ఉద్యమించాలని కోరారు. జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు. నోట్ల రద్దుతో అల్లకల్లోలం సృష్టించిన ప్రధాన మంత్రి మోదీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌లపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. -
రేపటి నుంచి హెల్మెట్ తప్పనిసరి
ఒంగోలు: రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్రవాహన చోదకులు ఈ నెల 12వ తేదీ నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు స్పష్టం చేశారు. తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోటారు వాహనాల ప్రమాదాల్లో ప్రాణనష్ట నివారణ కోసం ఈ నెల 1 నుంచి తప్పరిసరిగా హెల్మెట్ ధరించాలని ఆదేశించామన్నారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించి వచ్చే ఏడాది జనవరి 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేసేందుకు నిర్ణయం తీసుకోగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12 నుంచే హెల్మెట్ తప్పనిసరి చేసినట్లు వివరించారు. అందువల్ల ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. త్వరలో రామాయపట్నం పోర్టు పనులు..: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో మరమ్మతులకు గురైన తుపాను షెల్టర్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో బాగుచేస్తామన్నారు. వెంటనే అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. తుపాను నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి నష్టం చోటుచేసుకోలేదన్నారు. -
రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలి
ఒంగోలు కలెక్టరేట్ : ఉలవపాడు మండలం రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో నినదించాయి. ప్రకాశం జిల్లాకు మంజూరైన ఓడరేవును పొరుగు జిల్లావాసులు తన్నుకుపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించాయి. రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్దఎత్తున ఒత్తిళ్లు తీసుకురావాలని నిర్ణయించాయి. ప్రభుత్వాలు స్పందించకుంటే ఆగస్టు 15 నుంచి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించాయి. రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక రంగాభవన్‌లో రాజకీయ పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధి చుండూరి రంగారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటుచేస్తే ప్రకాశం జిల్లా ప్రగతికే కాకుండా నవ్యాంధ్ర నిర్మాణానికి అద్భుతమైన అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రామాయపట్నంలో ఓడరేవు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ప్రతినిధి చుండూరి రంగారావు అన్నారు. రామాయపట్నం ఓడరేవు కోసం పాలకులకు ముందుగా విజ్ఞాపన పత్రాలు ఇస్తామని, వారు స్పందించకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. రామాయపట్నంలోనే ఓడరేవు ఏర్పాటు చేయాలని ఎంతమందికి విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదని ఆచార్య ఎన్జీ రంగా కిసాన్ సంస్థ కార్యదర్శి చుంచు శేషయ్య గుర్తు చేశారు. టెక్నికల్ కమిటీ రామాయపట్నం పోర్టుకు అనుకూలమని తేల్చిందని చెప్పారు. రామాయపట్నంకు ముందుగా మంజూరైన ఓడరేవును దుగరాజుపట్నంకు తరలించడంపై హైకోర్టులో పిల్ వేసినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ వెల్లడించారు. రామాయపట్నం పోర్టును తరలించేందుకు కేంద్ర స్థాయిలో జరిగిన అక్రమాలపై సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
సముద్రం కూడా కొన్ని కథలు వింది...
ఇటీవల రామాయపట్నంలో జరిగిన రెండు రోజుల కథా సమావేశాల్లో రాయడం, నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకోవడం, నడవాల్సిన దారిని అంచనా కట్టడం ప్రధానంగా జరిగిన పని. రైటర్స్ వాక్.... రచయితలు తమలో తాము చర్చించుకోవడం కాకుండా పాఠకులలో కూడా కదలిక తీసుకు రావడానికి ‘పుస్తకాలు చదవండీ’ అంటూ ఈసారి ‘రైటర్స్ వాక్’ నిర్వహించారు. కావలిలో దీనికి వచ్చిన స్పందన అనూహ్యం. ఈసారి చాలామంది కొత్తవాళ్లు. అపర్ణ తోట, రమా సుందరి, కుమార్ కూనపరాజు, అరిపిరాల సత్యప్రసాద్, మహి బెజవాడ, అమర్ అహ్మద్... కొత్తగా రాస్తున్న వీళ్లంతా రెండు రోజుల పాటు సీనియర్ కథకులతో కలసి సమయం గడపడానికి, గత పద్నాలుగేళ్లుగా ప్రతి ఏటా జరుగుతున్న సమావేశాల వరుసలో భాగంగా, కావలి సమీపాన ఉన్న రామాయపట్నం బీచ్ బంగ్లాకు చేరుకున్నారు. ఫిబ్రవరి 15, 16- శని, ఆదివారాలు రాష్ట్రం నలుమూలల నుంచి ఇంకా ఇతర రచయితలు... ముక్తవరం పార్థసారథి, అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, డా.వి.చంద్రశేఖరరావు, కాట్రగడ్డ దయానంద్, వి.ప్రతిమ, దాసరి అమరేంద్ర, దగ్గుమాటి పద్మాకర్, లెనిన్ ధనిశెట్టి, గోపరాజు నారాయణరావు, అక్కిరాజు భట్టిప్రోలు, టైటానిక్ సురేష్, పూడూరి రాజిరెడ్డి, జి.ఉమామహేశ్వర్, వేంపల్లి షరీఫ్ , విమల, ఆర్టిస్టులు అక్బర్, అన్వర్... విమర్శకుడు అనంత్... కథా ప్రయాణంలో తమ సాధకబాధకాలు పంచుకోవడానికి వచ్చారు. రాయడం, నడిచి వచ్చిన దారిని బేరీజు వేసుకోవడం, నడవాల్సిన దారిని అంచనా కట్టడం ఈసారి ప్రధానంగా జరిగిన పని. కంటికి కనబడుతున్న సంక్షోభాలు చేతికి లేదా ఊహకు అంది కథగా మారడంలో వస్తున్న వైఫల్యాల గురించి, విరామాల గురించి ఎక్కువ చర్చ జరిగింది. ఒకవైపు మారిన సమాజపు ఫలాలు పొందుతూ మరోవైపు పాత సమాజపు విలువలను ఆశించడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని ఈ రెంటికీ మధ్య సమన్వయాన్ని పాఠకులకు ఇచ్చే కథలు రావలసిన అవసరం ఉందని అల్లం రాజయ్య అన్నారు. యథావిధిగా అందరూ కలిసి తెలుగు కథలు ఇంగ్లిష్‌లో, ఇతర భాషల్లో అనువాదం కాకపోవడం గురించి ఆ దారిలో ఉన్న అతి పెద్ద ఎడం గురించి ఈసురోమన్నారు. కథలకు బొమ్మలు వేసే- అక్బర్, అన్వర్లతో రచయితల ముఖాముఖి ఈ ఇరువర్గాల మధ్య ఉన్న భారీ దూరాన్ని స్పష్టం చేసి ఆర్టిస్టులూ రచయితలూ తరచూ మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని తెలియపర్చింది. పత్రికల్లో కథల ఎంపిక ఎలా జరుగుతుందో సీనియర్ జర్నలిస్టులు కూడా అయిన వేంపల్లి షరీఫ్, పూడూరి రాజిరెడ్డిలు రచయితలకు తెలియచేస్తే రచయితల కంప్లయింట్లు ఓ మోస్తారు లేచాయి. పత్రికల్లో ఉన్న స్పేస్ తగ్గిపోతున్నందువల్ల ఇక మీదట బ్లాగ్‌లలో వెబ్సైట్లలో వస్తున్న కథలను కూడా ప్రమాణికమైనవిగా ఆ సంవత్సరం అచ్చయిన కథలుగా సంకలనకర్తలు, విమర్శకులు గుర్తించాలని సూచన. మూసకట్టు చూపు, పడికట్టు రచన కాకుండా వర్తమానంలో రచయితలు మిస్సవుతున్న కోణాల్ని అనంత్ వివరించే ప్రయత్నం చేశారు. కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కూడా ఎందుకు కాసిన్ని పనికొచ్చే పనులు చేయకూడదు? ఈ రచయితల సమూహం తరఫున ఇంగ్లిష్‌లో హిందీలో ఒక పాతిక కథలను అనువాదం చేసి తెద్దాం అని రాజయ్య సూచించారు. ఇంతవరకూ ఇలాంటి రూపం తీసుకొని ఈ సమావేశాల వల్ల ఇకముందు ఇటువంటి పని జరిగే అవకాశం ఉంది. అందుకు వేదిక సిద్ధమవుతూ ఉండటం ఒక మంచి పరిణామం. ఇంకా కొత్తవాళ్ల సందేహాలు, పాతవాళ్ల సలహాలు, చర్చలు, ఖండనలు మండనలు చాలా ఉన్నాయి. కాని ఈ వేడి కంటే కూడా దీన్ని చల్లబరచే సాయంత్రపు సముద్ర గాలి, నిర్జన ఏకాంత పరిసరాలు, తీరంలో ఎంట్ర కాయల అడ్డదిడ్డ నడక, ఇసుకలో తడి పాదముద్రలు, దగ్గరకు పిలిచి ముఖాన్ని గట్టిగా చరిచే కెరటపు నురగ, అర్ధరాత్రి వెన్నెల్లో జలధి నిశ్శబ్దం, వేకువలో కడలి అంచున ప్రశాంతత వీటి రుచి ఏం చెప్పమంటారు? కథ, కడలి కలిసి రచయితల రోజువారి రొటీన్ రోతని క్షాళనం చేసిన రెండు రోజులు అవి. అద్భుతం. టైటానిక్ సురేష్, అమరేంద్ర, అక్కిరాజుల నిర్వాహణా మహిమ. సరే. అంతా అయ్యిందా? లేచి వస్తుంటే రాబోయే సమావేశాలకు కొల్లేరు నుంచి పిలుపు. అక్టోబర్లోనట. కథతో పాటు పూటకు ముప్పయ్యారు రకాలు రెడీ చేస్తారట. ఇది బాగుంది. ఎంతైనా ఇప్పటి నుంచే ఏం బ్యాగు సర్దుకుంటాం?