‘వాన్‌పిక్ భూములను రైతులకు అప్పగించాలి’
Published Thu, Dec 1 2016 2:33 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM
ఒంగోలు: వాన్‌పిక్ భూముల్లో పరిశ్రమలు స్థాపించకపోతే తిరిగి రైతులకు అప్పగించాలని సీపీఐ నేత కె. నారాయణ కోరారు. రామాయపట్నం ఓడరేవు సాధన సమితి ఆధ్వర్యంలో నాయకులు ఓడరేవును నిర్మించాలని దీక్షకు దిగారు. ఈ దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చిన నారాయణ మాట్లాడుతూ.. అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రకాశం జిల్లాలో నిర్మించవద్దని అన్నారు. రామాయపట్నం ఓడరేవు ఏర్పాటుకు అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తామని అన్నారు.
ఈ ప్రాంతంలో ఓడరేవు నిర్మించడం వల్ల లక్షలాది మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. జిల్లాలో ఉన్న అందరూ రాజకీయాలకు అతీతంగా పోర్టు కోసం ఉద్యమించాలని కోరారు. జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు. నోట్ల రద్దుతో అల్లకల్లోలం సృష్టించిన ప్రధాన మంత్రి మోదీ, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌లపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు.
Advertisement
Advertisement