లోక్‌సభలో ఆహారభద్రత బిల్లును ప్రవేశపెట్టడంపై అన్నా డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఢిల్లీ: లోక్‌సభలో ఆహారభద్రత బిల్లును ప్రవేశపెట్టడంపై అన్నా డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆహార భద్రత బిల్లును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాకే లోక్‌సభలో ప్రవేశపెట్టాలని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడుతుందన్న విషయాన్ని గుర్తు చేసింది. ఆహర భద్రతకు తాము పెద్ద పీట వేస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
రైతుల ప్రయోజనాలు కాపాడతామని కేంద్రం భరోసా ఇస్తే ఆహార భద్రత బిల్లుకు మద్దత్విడానికి తాము సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ గత రెండు రోజుల క్రితం పేర్కొన్న విషయం తెలిసిందే. ఆహార బిల్లు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, అవసరమని భావిస్తే పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా ఓటేస్తామని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు. బిల్లు పేరుతో ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు అమ్మేస్తారన్నారు.