![former cm vasundara raje gives clarity on her political retirement - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/11/4/vasundra.jpg.webp?itok=B8RA3zlI)
కోట: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్టేట్ మాజీ సీఎం వసుంధర రాజే కీలక ప్రకటన చేశారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని ఇప్పట్లో పాలిటిక్స్‌లో నుంచి తన రిటైర్మెంట్ లేదని క్లారిటీ ఇచ్చారు.
జలావర్ జిల్లాలోని జల్రాపటాన్ నియోజకవర్గం నుంచి వసుంధర శనివారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. పాలిటిక్స్‌లో నుంచి తాను రిటైర్ అవనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు ఈ సందర్భంగా ఆమె తెరదించారు.తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
కాగా, శుక్రవారం జరిగిన ఒక ప్రచార బహిరంగ సభలో వసుంధర చేసిన వ్యాఖ్యలు ఆమె రిటైర్మెంట్‌పై ఊహాగానాలు రావడానికి కారణమయ్యాయి. తన కుమారుడు ఎంపీ దుశ్యంత్ సింగ్ మంచి లీడర్‌గా తయారయ్యాడని, ఇక రిటైర్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందని వసుంధర ఆ మీటింగ్‌లో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment