retirements
-
అంగన్వాడీల రిటైర్మెంట్లు షురూ!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పదవీ విరమణ ప్రక్రియకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రంగం సిద్ధం చేసింది. కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవడం.. మరోవైపు వయోపరిమితి సడలింపు తర్వాత ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల ప్రక్రియ షురూ కావడంతో అంగన్వాడీల రిటైర్మెంట్ల పర్వానికి తెరలేచింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమాచార సేకరణను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చేపట్టింది. ఉద్యోగంలో చేరిన తేదీ మొదలు, జిల్లా, ప్రాజెక్టు వివరాలు, వారి పుట్టిన తేదీ, వయసు తదితర వివరాలను నిరీ్ణత ప్రొఫార్మాలో క్షేత్రస్థాయిలో జిల్లా సంక్షేమాధికారి(డీడబ్ల్యూఓ), శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి(సీడీపీఓ)ల నుంచి తెప్పించుకుంది. గత నెలాఖరు నుంచే రిటైర్మెంట్లు ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి మూడేళ్ల పెంపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదవీ విరమణలు మార్చి నెల నుంచే మొదలయ్యాయి. అయితే నూతన వార్షిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావడంతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మాత్రం ఏప్రిల్ నెలాఖరు నుంచి రిటైర్మెంట్లు అమలు చేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏప్రిల్ నెలతో 65 సంవత్సరాలు పూర్తయిన టీచర్లు, హెల్పర్ల వివరాలను ఆ శాఖ సేకరించింది. 65ఏళ్లు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్యాకేజీ రూపంలో ప్రభుత్వం అందించనుంది. అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్ టీచర్, అంగన్వాడీ హెల్పర్‌కు రిటైర్మెంట్ ప్యాకేజీ కింద రూ.50వేలు అందించనుంది. రిటైర్మెంట్ సమయం నుంచి వారికి ఆసరా పింఛన్ ఇచ్చేలా ప్యాకేజీలో ఉంది. ఏడాది చివరికల్లా 5వేల మంది... రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్చర్లు దాదాపు 50వేల మంది పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు పదవీ విరమణకు సంబంధించి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించే అంశం లేదు. తాజాగా ప్యాకేజీని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి పదవీ విరమణ ప్రక్రియను చేపడుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5వేల మంది టీచర్లు, హెల్పర్లు రిటైర్మెంట్ కానున్నట్లు సమాచారం. రిటైర్మెంట్ ప్యాకేజీ సమ్మతంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ల రిటైర్మెంట్ ప్యాకేజీ ఏమాత్రం న్యాయసమ్మతంగా లేదు. టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలని గత ప్రభుత్వం ఎదుట డిమాండ్ పెట్టాం. కానీ అందులో సగానికి తగ్గించి ప్యాకేజీ అంటూ చెప్పడం అన్యాయం. ప్రభుత్వం ఇచ్చే రిటైర్మెంట్ ప్యాకేజీ వారి జీవితానికి ఏమాత్రం సరిపోదు. డిమాండ్ల సాధన కోసం మళ్లీ న్యాయపోరాటం చేస్తాం. – టేకుమల్ల సమ్మయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు -
సర్కారుపై ‘విరమణ’ భారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లతో ఆర్థిక శాఖలో ఆందోళన మొదలైంది. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు ఇవ్వాల్సిన తక్షణ బెనిఫిట్లను చెల్లించేందుకు ఏటా రూ.3,500 వేలకోట్ల భారం పడనుంది ఈ మేరకు నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. 2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల (క్లాస్–4 ఉద్యోగులు మినహా) రిటైర్మెంట్లు జరగలేదు. తిరిగి ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7,995 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నట్టు సమాచారం. వీరికి ప్రభుత్వం చెల్లించాల్సిన తక్షణ బెనిఫిట్ల కింద రూ.3,200 కోట్ల వరకు అవసరమని ఆర్థిక శాఖ అంచనా. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల మెడికల్ బిల్లుల చెల్లింపు కూడా కష్టమవుతుండటం, ఇక నుంచి ఏటా రిటైర్మెంట్ల భారం మరింత పెరగనుండటం ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. సరాసరి రూ.40 వేల మూల వేతనం ఈ ఏడాది రిటైర్మెంట్లను పరిశీలిస్తే 1,419 మంది గెజిటెడ్ స్థాయి, 5,360 మంది నాన్ గెజిటెడ్ స్థాయి, 1,216 మంది క్లాస్–4 ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. నాన్ గెజిటెడ్ వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రిటైరయ్యే వారి సగటు మూల వేతనం రూ.40వేల వరకు ఉంటుందని అంచనా. దీనికి హెచ్ఆర్ఏ, సీసీఏ, డీఏలు కలిపితే ఈ మొత్తం రూ.60 వేల వరకు ఉంటుంది. రిటైరయ్యే ప్రతి ఉద్యోగికి లీవ్ శాలరీల కింద 10 నెలల వేతనాన్ని.. అంటే రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికితోడు గ్రాట్యుటీ కింద రూ.12 లక్షలు, కమిటేషన్ కింద రూ.20 లక్షలు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలి. అంటే సగటున ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి రూ.38లక్షల నుంచి రూ.40 లక్షల వరకు తక్షణ బెనిఫిట్లను వారి హక్కుగా ఇవ్వాలి. ఈ ఏడాది రిటైరయ్యే 7,995 మందికి ఈ బెనిఫిట్లను చెల్లించాలంటే రూ.3 వేల కోట్లకుపైగా అవసరం. ఇక 2025లో 9,630 మంది, 2026లో 9,719 మంది, 2027లో 9,443 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని లెక్కలు చెప్తున్నాయి. అంటే వారికి తక్షణ బెనిఫిట్ల కింద సగటున ఏటా రూ.3,500 కోట్ల వరకు చెల్లించాలి. దీనితో ఖజానాపై భారం పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితేమిటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్‌లకు కూడా చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరిలో చెల్లించాల్సిన నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఐదో డీఏ (జూలై, 2024) కూడా ముందుకు వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో.. ఈ నాలుగు డీఏల చెల్లింపును సర్కారు వాయిదా వేస్తూ వస్తోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా (జీఎల్ఐ) కింద జమ చేసుకున్న నిధులను కూడా వాడుకోవాల్సి వచ్చిందని ఆర్థికశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు రిటైరైన ఉద్యోగులకు వారి జీఎల్ఐతోపాటు జీపీఎఫ్‌పై వడ్డీ చెల్లించాలని.. ఇవన్నీ కలిపితే చాలా భారం పడుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచి అప్పటికి ఈ భారం నుంచి గట్టెక్కిందని.. ఇప్పుడు చెల్లించక తప్పదని తెలిపారు. ఈ చెల్లింపుల కోసం నెలకు రూ.250 కోట్లదాకా అవసరమన్నారు. ఎప్పటికప్పుడే బెనిఫిట్లు చెల్లించాలి: ఉద్యోగ సంఘాలు రిటైర్మెంట్లతో సర్కారుపై భారమన్న ప్రచారంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఉద్యోగి రిటైరవడానికి మూడు నెలల ముందే బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఉద్యోగుల హక్కు కింద ప్రభుత్వం వాటిని ఎప్పటికప్పుడే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పదవీ విరమణ వయసును మరోసారి పెంచడం వంటి ఆలోచనలు చేయవద్దని కోరుతున్నాయి. -
పాలిటిక్స్ నుంచి వసుంధర రిటైర్మెంట్..! క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం
కోట: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్టేట్ మాజీ సీఎం వసుంధర రాజే కీలక ప్రకటన చేశారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని ఇప్పట్లో పాలిటిక్స్‌లో నుంచి తన రిటైర్మెంట్ లేదని క్లారిటీ ఇచ్చారు. జలావర్ జిల్లాలోని జల్రాపటాన్ నియోజకవర్గం నుంచి వసుంధర శనివారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. పాలిటిక్స్‌లో నుంచి తాను రిటైర్ అవనున్నట్లు వస్తున్న ఊహాగానాలకు ఈ సందర్భంగా ఆమె తెరదించారు.తానెక్కడికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం జరిగిన ఒక ప్రచార బహిరంగ సభలో వసుంధర చేసిన వ్యాఖ్యలు ఆమె రిటైర్మెంట్పై ఊహాగానాలు రావడానికి కారణమయ్యాయి. తన కుమారుడు ఎంపీ దుశ్యంత్ సింగ్ మంచి లీడర్‌గా తయారయ్యాడని, ఇక రిటైర్ అవ్వాల్సిన టైమ్ వచ్చిందని వసుంధర ఆ మీటింగ్‌లో అన్నారు. -
సుప్రీంకోర్టులో త్వరలో... ఖాళీల సంక్షోభం!
న్యూఢిల్లీ: పెండింగ్ కేసుల భారానికి తోడు న్యాయమూర్తుల కొరత రూపంలో కొత్త సంవత్సరంలో సుప్రీంకోర్టు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొనేలా కన్పిస్తోంది. ఈ ఏడాది 9 మంది న్యాయమూర్తులు రిటైర్ కానున్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీకాలం జనవరి 4న, జస్టిస్ ఎంఆర్ షా మేలో, జస్టిస్ కేఎం జోసెఫ్, అజయ్ రస్తోగీ, వి.రామసుబ్రమణియం జూన్‌లో, జస్టిస్ కృష్ణ మురారి జూలైలో, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ అక్టోబర్‌లో, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పదవీకాలం డిసెంబర్లో ముగియనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆరు ఖాళీలున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థపై న్యాయ వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఈ ఖాళీలన్నింటినీ సకాలంలో భర్తీ చేయడం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌కు సవాలు కానుంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులుండాలి. ప్రస్తుతం 28 మంది ఉన్నారు. కొలీజియం గత భేటీలో ఐదుగురి పేర్లను సిఫార్సు చేసింది. వీటిలో కొన్నింటిని కేంద్ర న్యాయ శాఖ త్వరలో ఆమోదించవచ్చని సమాచారం. -
రిటైర్మెంట్లకు సెటిల్మెంట్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత ఆర్టీసీ లో మళ్లీ ఉద్యోగుల పదవీ విరమణలు మొదలు కాబోతున్నాయి. డిసెంబర్లో 130 మంది, మార్చి నాటికి మరో 500 మంది రిటైర్ కానున్నారు. 2023 మార్చి నాటికి మరో 2 వేల మంది పదవీవిరమణ పొందనున్నారు. జీతాల భారంతో ఇబ్బంది పడు తున్న సంస్థకు ఈ విరమణలు ఊరటనివ్వబోతు న్నాయి. ప్రస్తుతం మొత్తం వ్యయంలో జీతాల వాటా ఏకంగా 53 శాతం ఉండటంతో ఆర్టీసీ ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా పదవీ విరమణలు లేకపోవటంతో జీతాల చెల్లింపు పెద్ద సమస్యగా మారింది. ఎట్టకేలకు రిటైర్మెంట్లు ప్రారంభం కానుండటంతో క్రమంగా జీతాల బరు వు తగ్గనుంది. రిటైర్మెంట్ సమయంలో ఉద్యో గుల జీతాలు గరిష్ట స్థాయిలో ఉంటాయనేది తెలిసిన విషయమే. కొత్త నియామకాలు కూడా ఉండబో వని ఇప్పటికే ఆర్టీసీ తేల్చి చెప్పినందున భవిష్యత్తు లో జీతాల పద్దు చిక్కిపోవటమే కానీ, పెరగడం ఉండదు. ఒకవేళ వేతన సవరణ చేస్తే మాత్రం భా రం పడుతోంది. కానీ, సిబ్బంది సంఖ్య తగ్గనున్నందున పెంపు భారం కొంత తక్కువే ఉండనుంది. 2019 చివర్లో బ్రేక్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 2019లో ఆర్టీసీ రెండేళ్లు పెంచింది. పదవీ విరమణ ప్రయోజనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవటంతో, కొంతకాలం కొనసాగించేందుకు రిటైర్మెంటు వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిందనేది సంస్థ ఉద్యోగుల మాట. ఏదిఏమైనా ఆర్టీసీ నిర్ణయంతో 2019 చివరి నుంచి రిటైర్మెంట్లు ఆగిపోయాయి. ఇప్పుడు రెండేళ్లు గడవటంతో ఈ డిసెంబర్ నుంచి మళ్లీ పదవీ విరమణలు మొదలు కాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచాలన్న ఇటీవలి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీలో కూడా అమలు చేసే ప్రతిపాదన సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. అదలా ఉండగానే ఇప్పు డు రిటైర్మెంట్లు ప్రారంభం కాబోతున్నాయి. అదనపు సిబ్బంది సమస్య పరిష్కారం గతసమ్మె తర్వాత ఆర్టీసీలో వేయికిపైగా బస్సులను తొలగించారు. 1,500 అద్దె బస్సులను కొత్తగా తీసుకున్నారు. వెరసి ఆర్టీసీలో దాదా పు మూడున్నర వేలమంది సిబ్బంది మిగిలిపోయా రు. డిసెంబర్ నుంచి పదవీ విరమణలు మొదలు కానుండటంతో అదనపు సిబ్బంది సమస్య కూడా తగ్గుతూ రానుంది. 2023 మార్చి నాటికి మొత్తం 2,630 మంది పదవీ విరమణ పొందనుండటం, ఇతర అవసరాలు కొన్ని పెరగనుండటంతో ఈ సమస్య సమసిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. సెటిల్మెంట్లకు నిధులెలా? రిటైర్ అయిన ఉద్యోగులకు సగటున రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు సగటున రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చెల్లించాలి. ఆర్టీసీకి ఇదే సమస్యగా మారింది. డిసెంబర్ నుంచి చెల్లింపులు చేయాల్సి ఉన్నందున డబ్బుల కోసం వెతుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్టీసీ రోజువారీ టికెట్ ఆదాయం కొంత పెరిగినా.. అది డీజిల్ ఖర్చులకు కూడా సరిపోని పరిస్థితి. అలాగని ప్రభుత్వం సాయం చేసే పరిస్థితి కూడా దాదాపుగా లేదు. ఇక బ్యాంకుల నుంచి రుణం పొందటమే మొదటి ఉపాయంగా ఉంది. గత బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1,500 కోట్లు కేటాయించింది. ఇవి గ్రాంటు కానందున ప్రభుత్వ పూచీకత్తుతో రుణంగా పొందాలి. ఇలా ఇప్పటికే రూ.వేయి కోట్లు తీసుకుంది. మిగతా రూ.500 కోట్లను కూడా అలాగే తీసుకోవాలి. ఇప్పుడు రిటైర్మెంట్ సెటిల్మెంట్లు ఆ రూ.500 కోట్లపైనే ఆధారపడాలి. లేదంటే ఆస్తులను తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలి. కాదంటే అవే భూములను లీజుకు ఇవ్వటమో, అమ్మేయటమో చేయటం ద్వారా నిధులు సమకూర్చుకోవాలి. -
సిన్సియర్ సిటిజన్స్
శేషజీవితాన్ని హాయిగా గడపాలనుకునే వారికి.. పదవీ విరవుణ ఓ వరం ! బ్యాలెన్స్ లైఫ్‌ను ఎలా నెట్టుకురావాలో అని టెన్షన్ పడే వారికి రిటైర్మెంట్ ఒక శాపం ! కానీ ఈ పెద్దోళ్లకు మాత్రం రిటైర్మెంట్ ఒక బాధ్యత.. సమాజానికి సాయం చేసే తీరిక ఇలా దొరకడం ఓ అదృష్టంగా భావిస్తున్నారు. వీళ్ల కాలక్షేపం కూడా లోకాభిరామమే. కాకపోతే అది కాస్త సందడిగా, డిఫరెంట్‌గా, రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది. సరదా సరదా ముచ్చట్లకు ఎంత టైం కేటాయిస్తారో.. సంఘానికీ అంతే సమయం ఇస్తారు. వానప్రస్థాశ్రమంలో రామా కృష్ణా అనుకోవాల్సిన ఈ పెద్దోళ్లు.. సమాజ హితం కోసం నడుం బిగించారు. జీవితానుభవాలే పెట్టుబడిగా.. ఈ సీనియర్లు తమ పెద్దరికాన్ని కాపాడుకుంటున్నారు. - భువనేశ్వరి ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్.. కమలానగర్ సీనియర్ సిటిజన్ క్లబ్లో పొద్దున పదింటికల్లా సందడి మొదలవుతుంది. ఒకరు మనవడ్ని స్కూల్లో దింపి, ఇంకొకరు మనవరాలిని కాలేజీలో దింపి.. ఒక్కొక్కరుగా ఈ క్లబ్లో వాలిపోతుంటారు. రాగానే న్యూస్‌పేపర్లు ముందేసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. సినివూల నుంచి రాజకీయూల వరకు.. సరదాగా ముచ్చటించుకుంటారు. ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్‌తో రీఫ్రెష్ అవుతారు. ఇలా నాలుగైదు గంటలు టైంపాస్ చేసి ఇళ్లకు చేరుకుంటారు. మళ్లీ సాయంత్రం.. కాలేజీలు మూసే సవుయూనికి రోడ్డెక్కుతారు. ఈ సమయంలో వీరికేం పని అనుకుంటున్నారా..? ఈ సీనియర్ల అసలు ట్రీట్మెంట్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. దారితప్పితే కౌన్సెలింగ్ ఈ సీనియుర్ సిటిజన్స్‌లో ఓ బృందం.. ఓ కాలేజీ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన బస్టాప్‌లో కూర్చున్నారు. అటుగా వెళ్తున్న ఇద్దరమ్మాయిలను.. వెనుక నుంచి ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అవుతున్నారు. అంతటితో ఆగకుండా ఏదో కామెంట్ చేశారు. అప్పటికే బస్టాప్‌లో ఉన్న ఈ పెద్దోళ్లకు సీన్ అర్థమైంది. వారిని ఆపి విషయుం ఏంటని ఆరా తీశారు. ఆ నలుగురిలో ఓ అబ్బాయి.. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలాగా అంటూ వారిని సీనియుర్స్ క్లబ్‌కు తీసుకెళ్లారు. నిజమైన ప్రేమ గురించి.. ఒకరి తర్వాత ఒకరు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే అమ్మాయిలు థ్యాంక్స్ చెబితే.. అబ్బాయిలు తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘మా క్లబ్ స్థాపించి రెండేళ్లవుతుంది. ఎందరికో ఉపయోగపడే పనులు చేయగలిగాం’ అని అంటారు క్లబ్ ప్రెసిడెంట్ పెద్ది నర్సింహ. తోటివారికి తోడుగా ఓ నెల కిందట తమకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధ జంట ఈ క్లబ్ తలుపు తట్టారు. సవుస్యను సున్నితంగా పరిష్కరించి వారి కళ్లలో ఆనందం నింపారు ఈ క్లబ్ సభ్యులు. ‘మా కళ్లముందే అల్లంవెల్లుల్లి అమ్ముకుని కష్టపడి రెండు వందల గజాల ఇంటి స్థలం కొనుక్కున్నాడు. కొడుక్కి ఉద్యోగం వచ్చాక అతని పేరిట లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కొడుకు పెళ్లయ్యూక.. ఈ ఇంటితో మీకు సంబంధం లేదంటూ ఆ కొడుకు కన్నవారిని బయుటకు నెట్టేశాడు. మా క్లబ్ సభ్యుల్లో ఓ నలుగురు ఆ కొడుకు, కోడలికి నచ్చజెప్పాం. నాలుగైదు కౌన్సెలింగ్‌ల తర్వాత దిగొచ్చారు. ఆ పెద్దవునుషులకు ఇంటి మీద ప్రత్యేకంగా ఓ రూమ్ కూడా కట్టిచ్చారు. ఆయునే కాదు.. ఇలాంటి సవుస్యలు ఎవరికున్నా వాటి పరిష్కారానికి మేమందరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం..’ అని క్లబ్ సెక్రటరీ శత్రుఘ్నచారి వివరించారు. మేం ముసలివాళ్లమేంటి..? అరవై ఏళ్లు పైబడిన ఆ పెద్దోళ్లు.. కాలక్షేపంతో పాటు సవూజం గురించి ఆలోచిస్తున్నారు. ‘ఇన్నాళ్లు ఇల్లు, పిల్లలు, ఉద్యోగం అంటూ చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకోకుండానే గడిపేశాం. ఇప్పుడు మా పిల్లలకు మా ఆసరా అక్కర్లేదు, ఉద్యోగానికి ఓ నమస్కారం పెట్టేశాం. మాకున్న ఓపిక, తెలివితేటలు, అనుభవం.. తోటివారికి ఉపయోగపడాలన్నదే వూ ఉద్దేశం’ అని చెబుతారు ఆ సీనియుర్ సిటిజన్స్. ‘వయుసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో ఒక్కో పార్ట్ రిపేర్కొస్తుంటుంది. వచ్చిన రోగాలకు భయుపడి ఇంట్లో కూర్చుంటే జబ్బులు తగ్గుతాయూ? ఈ క్లబ్ మా మనసును సేదతీరుస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే మేవుూ పిల్లలమైపోతాం. ఇండోర్ గేమ్స్‌తో అదరగొడతాం. నేను ముసలాడ్ని ఏంటి అనుకునేవారంతా అవుట్‌డోర్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. వూ వునవలు, వునవరాళ్లు కూడా మాతో జాయిన్ అవుతుంటారు’ అని క్లబ్ విశేషాలు పంచుకున్నారు జేజే రెడ్డి. సమాజం కోసం ఉదయం నుంచి ఎన్ని రకాల పనులు చేసినా.. అప్పుడప్పుడూ కాలేజీలకు వెళ్లి వురీ కౌన్సెలింగ్‌లు ఇస్తుంటారు. రోడ్లపై దవుు్మలాగుతున్న కాలేజీ కుర్రాళ్లకు క్లాసులిస్తారు, కౌన్సెలింగ్ చేస్తారు. సాయుంత్రం కాగానే అవ్మూరుులకు రక్షణగా రోడ్లపై గస్తీ కాస్తారు. ‘వూ పిల్లలు కాలేజీకి వెళ్లిన సవుయుంలో మేం చేయులేని పనులు ఇప్పుడు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇవన్నీ చేస్తున్న టైంలో మేం హీరోలుగా ఫీలవుతాం’ అంటూ తమ హీరోయిజాన్ని చాటుకున్నారు చంద్రశేఖర్‌రావు. ఇప్పటివరకూ మేం బతికింది మాకోసం, మా కుటుంబం కోసం. ఇక నుంచి సవూజం కోసం బతకాలనుకుంటున్నాం అంటున్న ఈ సిన్సియుర్ సిటిజన్స్‌ను వునం కూడా అభినందిద్దాం. మాతో పంచుకోండి రిటైర్మెంట్ లైఫ్ సేవాభావంతో వెళ్లదీస్తున్న సీనియుర్ సిటిజన్స్ మీరైతే.. మీ జీవితం పదివుందిలో స్ఫూర్తి నింపాలి. చుట్టూ ఉన్న సవూజం కోసం మీరు పడే తపన వురికొందరికి వూర్గనిర్దేశం చేయూలనుకుంటున్నారా.. అరుుతే మీ సావూజిక బాధ్యతను ‘సిటీప్లస్’తో పంచుకోండి. మీరు చేస్తున్న కార్యక్రవూల వివరాలు sakshicityplus@gmail.com కు పంపండి.