జైపూర్: రాజకీయాల్లో నాయకులు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సి వస్తుందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుధర రాజే అన్నారు. శనివారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
‘‘రాజకీయాల్లో అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. ప్రతి నాయకుడు ఒడిదొడుకులు ఎదుర్కొవల్సిందే. రాజకీయాల్లో మూడు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. పదవి, మత్తు, స్థాయి. పదవి, మత్తు ఎప్పుడు ఉండకూడదు. పార్టీలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటే స్థాయి దానికదే పెరుగుతుంది. రాజకీయలు అంత ఈజీ కాదు. రాజకీయాల్లో ఎన్నోసార్లు ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ పార్టీ కోసం పని చేస్తూనే ఉండాలి. ప్రజలను సమన్వయం చేయటం కూడా అంత సులభం కాదు. మన నినాదం సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్. గతంలో కొంతమంది నాయకులు అభివృద్ది చేయటంలో విఫలం అయ్యారు’’ అని అన్నారు.
ఇక.. ఇటీవల ఆమెను పార్టీలో పక్కకు పెడుతున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత ఏడాది బీజేపీ అధిష్టానం మరోసారి వసుంధర రాజేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు. జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మను బీజేపీ రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 11 స్థానాల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment