![Mumbai Man Beaten to Death by Friend for Asking Rs 10 for Food - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/11/10-rs.jpg.webp?itok=5E9uC4Aw)
ముంబై: కేవలం రూ.10 అడిగినందుకు ఓ వ్యక్తిని స్నేహితుడే కొట్టిచంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోవైలోని సాయి బన్‌గుర్దా గ్రామానికి చెందిన స్నేహితులు జీవన్ మోరే(35), దినేశ్ లక్ష్మణ్ బుధవారం ఓ షాపులో మద్యం సేవించారు. అనంతరం లక్ష్మణ్ ఓ హోటల్ నుంచి ఇద్దరికీ ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు.
ఆహారం ఖర్చులో కొంత భరించాలనీ, రూ.10 చెల్లించాలని లక్ష్మణ్ మోరేను కోరాడు. ఇద్దరిమధ్య మాటామాటా పెరగటంతో ఆగ్రహానికి లోనైన మోరే..ఓ కర్రతో లక్ష్మణ్‌పై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment