జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం
అనంతపురం అర్బన్ : నిబంధనలు పాటించకుండా మందులు, ఆహార ఉత్పత్తులు, విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి, తూనికలు, కొలతల శాఖ అధికారులు, డీఎస్‌ఓతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ వారంలో పది దుకాణాల్లో దాడులు నిర్వహించామని జేసీకి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
సెక్షన్ 65-17 కింద నిబంధలను అతిక్రమించిన 42 దుకాణాలపై దాడులు చేసి 19 దుకాణాలపై క్రమ శిక్షణ చర్య సిఫారసు చేశామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి మాట్లాడుతూ ఆరు మ్యాగీ, రెండు బిస్కెట్, రెండు సుఫైన్ శ్యాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించామన్నారు. రిలయన్స్, మోర్ తదితర మార్కెట్‌లను తనిఖీ చేసి నమూనాలను సేకరించి హైదరాబాద్‌కు పంపామని వివరించారు. తూనిక లు కొలతలకు సంబంధించి ఈ వారంలో 26 కేసులు నమోదు చేశామని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఎనిమిది ఎరువుల దుకాణాలపై దాడులు చేసి రూ.1.10 లక్షల రుసుం వసూలు చేశామన్నారు. మూడు హార్డ్ వేర్ దుకాణాలపై దాడి చేసి రూ.17 వేలు జరి మానా వసూలు చేశామన్నారు. సిలిల్ సప్లైస్‌కి సంబంధించి నార్పల, తాడిపత్రిలో రెండు రైసు మిల్లులను సీజ్ చేశామని డీఎస్‌ఓ తెలిపారు. ఏడు డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేశామన్నారు. సమావేశానికి హాజరు కాని ఇద్దరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్‌మెట్రాలజీకి షోకాజ్ నోటీసులు జారీ చేశామని జేసీ తెలిపారు.
15లోగా సరుకులు తీసుకోవాలి
జిల్లాలో ఈ-పాస్ చౌకదుకాణాల ద్వారా ఈ నెల 15లోగా తీసుకోవాలని సరుకులు తీసుకోవాలని వినియోగదారులకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు.
నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు
Published Sun, Jun 14 2015 2:10 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM
Advertisement
Advertisement