విఫలమైనది విధానకర్తలే | Punjab achieves the highest productivity in foodgrain yields | Sakshi
Sakshi News home page

విఫలమైనది విధానకర్తలే

Published Thu, Jun 1 2017 12:36 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

విఫలమైనది విధానకర్తలే - Sakshi

విఫలమైనది విధానకర్తలే

విశ్లేషణ
ఆహారధాన్యాల దిగుబడిలో పంజాబ్‌ ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకతను సాధించింది. అయినా అక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది విస్మరించి అదే మార్గాన్ని అనుసరించాలనడం విధానపరమైన ఘోర తప్పిదాన్ని సూచిస్తోంది. నేటి మాంద్య పరిస్థి తుల్లో, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే శక్తి వ్యవసాయానికే ఉంది. రేటింగ్‌ సంస్థలు చూపే మార్గాన్ని విడనాడి నూతన ఆర్థిక పంథాను చేపట్టాల్సిందే. వృద్ధికి, సుస్థిరాభివృద్ధికి వ్యవసాయాన్ని ఇరుసుగా చేసే రాజకీయ ధైర్యాన్ని ప్రభుత్వం చూపితేనే అది సాధ్యం.

‘‘భారత వాతావరణ శాఖ ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవు తుందని అంచనా వేసింది. వానలు మంచిగా పడితే, తిరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగి వృద్ధి రేటు పుంజుకుని, 2016–17లో సాధిం చిన 4.4 శాతం వృద్ధిని మించిపోతుందని విశ్వసిస్తున్నాను’’ అంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌ గత మూడేళ్ల వ్యవసాయ రంగ విజయాలను వివరించారు. పుష్కలంగా వానలు పడ్డ ప్రతి వానాకాలం ఆర్థిక వ్యవస్థలో సంతోషం వెల్లివిరిసేలా చేస్తుంది. ఆహార ఉత్పత్తి ఈ ఏడాది సర్వ కాలీన రికార్డు స్థాయిలో 27.4 కోట్ల టన్నులకు చేరిందంటే ఆశ్చర్యమేం లేదు.

2014–15, 2015–16లలో వరుసగా రెండేళ్లు దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొ న్నాక వ్యవసాయ ఉత్పత్తి ఊర్ధ్వముఖంగా పయనించి వ్యవసాయాభివృద్ధి రేటు పెరిగింది. అది, దేశ ఆర్థికవృద్ధి రేటును పెంపొందింపజేస్తుందని భావి స్తున్నారు. అయితే, అంతా మంచిగా ఉన్నదని పించేలా చేసే ఈ గణాంక చిత్త రువుల మాటున... వ్యవసాయరంగం ఘోర దురవస్థలో విలవిలలాడుతుం డటం కొనసాగుతూనే ఉంది. దేశంలో ఎక్కడో ఒక చోట రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారన్న వార్తలు రాకుండా రోజు గడవని దుస్థితి వ్యవసాయరం గంలోని మహా విషాదపు ప్రతిఫలనమే.

మార్కెట్‌ కబంధ హస్తాల్లో రైతు
ఈ వారం వెలువడిన ఒక వార్తా కథనం మధ్యప్రదేశ్‌ రైతుల దయనీయ పరిస్థితిని వెలుగులోకి తెచ్చింది. బంగాళదుంప విరగపండటంతో రైతులు కారు చౌకకు అమ్ముకోలేక పొలాల్లోని పంటనే కాలబెట్టేశారు లేదా పశువులకు మేపారు. ఇండోర్‌లో కేజీ ఉల్లికి 0.50 నుంచి రూ. 3.00 ధర పలుకుతోంది. ఆగ్రహించిన రైతులు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణా టకలో ఉల్లినే కాదు టమాటాలను సైతం ప్రధాన రహదారులపై పారబో శారు. పంట మార్కెట్‌కు ఉధృతంగా వచ్చిన సమయంలో కిలో టమాటాల ధర ఆంధ్రలోని కొన్నిమార్కెట్లలో 30 పైసల నుంచి రూ. 2 వరకు ఉంది.

పప్పుధాన్యాల విషయమే చూడండి. పప్పు ధాన్యాల రిటైలు ధరలు విపరీతంగా పెరిగిన తర్వాత ప్రభుత్వం పప్పు «ధాన్యాల లభ్యతను పెంచ డానికి ద్విముఖ వైఖరిని చేపట్టింది. ఒక వంక, పప్పు ధాన్యాలను పండించి, సేకరించి మనకు పంపేలా మొజాంబిక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరోవంక, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధరపై అద నంగా బోనస్‌ను ప్రకటించింది. కంది సహా పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.2 కోట్ల టన్నులకు పెరిగి, మార్కెట్‌ ధరలు పడిపోయినప్పుడు అది కేవలం తన బఫర్‌ స్టాక్‌ అవసరాలకు సరిపడే వరకే సేకరణ జరిపి, ఆత్యధిక రైతాంగాన్ని మార్కెట్ల క్రూరత్వానికి వదిలేసింది.

ఆహారపరమైన ఈ అధ్వాన నిర్వహణ కొనసాగుతూనే ఉంది. కేవలం టమాటా అతిగా ఉత్పిత్తి కావడంతో ప్రత్యే కించి ఈ ఏడాదే రైతులకు బాగా దురదృష్టకరమైనదిగా పరిణమించిందను కోవడం పొరపాటు.  2016, 2015, 2014లలో కూడా పరిస్థితి ఇదే. అంతకు ముందు మూడేళ్లూ టమాటా రైతులు నష్టపోయారు. పంటలు సమృద్ధిగా పండటం, రైతులు దుఃఖించాల్సి రావడం అనే క్రమం ఎప్పుడూ కొనసాగు తూనే ఉందనీ, ఇది టమాటాకే కాదు, ఉల్లి, బంగాళదుంప, పప్పుధాన్యాలు, కాలిఫ్లవర్, ఆవ, సోయాబీన్, పత్తి, మిరప, ఆముదాలు, చివరికి గోధుమ, వరి విషయంలో సైతం దేశంలోని చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉందని గూగూల్‌లో శోధించి చూస్తే మీకే  విశదమవుతుంది. ఎక్కడా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడమూ కనిపిస్తుంది.  

ఇప్పుడు దీన్ని ఆగస్టు 2015 నాటి స్టాక్‌ మార్కెట్ల పతనంతో పోల్చి చూద్దాం. ఆ పతనం తర్వాత కొన్ని గంటలకే ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మదు పర్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి పత్రికా సమావేశం నిర్వహించారు. ఆ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి కార్యాచరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదే రైతులు అనూహ్యమైన రీతిలో ధరలు పడిపోయిన పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తే, కోట్లాదిగా చిన్న, సన్నకారు రైతుల జీవనాధా రాలే నాశనం అవుతున్నా... ప్రభుత్వం స్టాక్‌మార్కెట్‌లపై చూపిన శ్రద్ధలో ఆవగిం జంతైనా ఎన్నడూ చూపలేదు. మరుసటి రోజునే, వాణిజ్య పరిస్థితిని మెరు గుపరచడానికి దాదాపు 7,000 చిన్నా పెద్ద చర్యలను చేపట్టామని వాణిజ్య మంత్రి చెప్పారు.
ప్రధాన ఆర్థిక సలహాదారు అప్పటికే కార్పొరేట్‌ రంగం మొండి బకాయిలను మాఫీ చేయడం అర్థికంగా అర్థవంతమైన చర్య అన్నారు. వ్యవసాయానికి వస్తే, దాని కోసం చేపట్టిన ప్రభుత్వ రంగ మదు పుల కార్యక్రమాలను వేళ్లమీద లెక్కించవచ్చు. ఐదేళ్లలో రైతుల ఆదాయా లను రెట్టింపు చేయడం, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, ప్రధాన మంత్రి కృషి సింఛాయీ యోజన, ఈ–నేషనల్‌ అగ్రికల్చరల్‌ మార్కెట్‌ (ఈ– నామ్‌), సాయిల్‌ హెల్త్‌ కార్డులు, నీమ్‌ కోటెడ్‌ యూరియా, మోర్‌ క్రాప్‌ çఫర్‌ డ్రాప్‌ వంటివి కొన్నే ఉన్నాయి. ఫెర్టిలైజర్‌ సబ్సిడీని నేరుగా బదలాయిం చడం, మార్కెట్లో జోక్యం చేసుకోవడం వంటి పలు కార్యక్రమాలూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కలిపినా 50కి మించవని పందెం కాయగలను.

రుణ మాఫీ కార్పొరేట్ల హక్కు!  
దాదాపు రూ. 4 లక్షల కోట్ల కార్పొరేట్‌ మొండి బకాయిలను మాఫీ చేయను న్నట్టు ఇండియా స్పెండ్‌ సమాచారం. పైగా రిజర్వు బ్యాంకు ఈ కార్పొరేట్‌ రుణ గ్రస్తులలోని ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల పేర్లను సైతం వెల్లడించే ప్రసక్తే లేదని చెబుతోంది. కేవలం 6,857 కంపెనీలే రూ. 94,649 కోట్లను ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నట్టు అంచనా. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 92 లక్షల రైతులకు మేలు చేసే రూ. 36,359 కోట్ల వ్యవసాయ రుణ మాఫీకి తాము అనుకూలం కాదని ఆర్‌బీఐ ప్రకటించింది. రైతులు బకాయిలను చెల్లించలేక పోయినప్పుడే ఆర్‌బీఐకి నిజాయితీ గుర్తుకువస్తుంది. కార్పొరేట్ల మొండి బకా యిల రద్దును మాత్రం వాటి విశేష హక్కుగా భావిస్తుంది.

గత ఐదు నెలలుగా రైతు ఆదాయాలను ఐదేళ్లలో రెట్టింపు చేయడం గురించిన చర్చ రెట్టింపు అయిందే తప్ప.. రైతులందరినీ సంక్షోభంలోంచి బయట పడేయడానికి కేంద్రీకరించి చేసిన కృషి మాత్రం కానరాదు. జైట్లీ మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఎక్కడా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చేసిందేమీ లేదు. ఏటికేడాది లోలోతులకు మునిగిపోతున్న రైతుకు సంక్షోభం నుంచి కొంత ఊపిరి సలిపేలా ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఎప్పుడూ చెబుతున్నాను. ఎన్నికలకు ముందు ప్రధాని వాగ్దానం చేసిన ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభాన్ని నెరవేర్చడం తక్షణ అవసరం. కానీ ప్రభుత్వమే అది సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది.

కార్పొరేట్‌ వ్యవసాయానికి ప్రోత్సాహం
రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి ఉన్న జీవనాధార రైతులు మొత్తం రైతాం గంలో 83 శాతంగా ఉన్నారు. ప్రభుత్వం వారికి మేలు చేయడం వైదొలగుతూ కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ–నామ్‌ కార్యక్రమం 585 నియంత్రిత మార్కెట్లను హోల్‌సేల్‌ మార్కెట్లతో అనుసంధానించడాన్ని ప్రతి పాదించింది. కానీ అది వాస్తవంలో కమోడిటీ ట్రేడింగ్‌లో భాగం. కాంట్రాక్టు సాగుపై నమూనా చట్టాన్ని ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ చేశారు. భూమిని లీజుకు ఇవ్వడానికి, భూముల సేకరణకు తగిన చట్టపరమైన ఏర్పాట్లు ఇప్ప టికే జరుగుతున్నాయి. నేడు వ్యవసాయంపై ఆధారపడి ఉన్న 58 శాతం జనాభాను 2022 నాటికి 38 శాతానికి తగ్గించాలని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కౌన్సిల్‌ లక్ష్యంగా పెట్టుగకుంది.

అంటే కార్పొరేట్‌ వ్యవసాయం ప్రవే శిస్తోందనేది సుస్పష్టమే. గత మూడేళ్లలో సగటున ఏడాదికి 2.13 లక్షల ఉద్యో గాలను మాత్రమే సృష్టించామని ఇండియా స్పెండ్‌ వెల్లడించింది. అయినా వ్యవసాయం నుంచి భారీ ఎత్తున రైతాంగాన్ని పట్టణ నిరుద్యోగ  శ్రేణులలోకి ¯ð ట్టడంలో ఆర్థికంగా అర్థవంతమైనది ఏమీ కనిపించదు. ఏ ప్రభుత్వానికైనా మూడేళ్లంటే మొత్తంగా పరిస్థితిని సమీక్షించుకుని, సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ లక్ష్యంగా విధానపరమైన దిద్దుబాట్లకు పూనుకోవాల్సిన సమయం. రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తిని వ్యవసాయరంగ పరిస్థితి అంతా సజావుగా ఉందనడానికి సూచికగా తీసుకోవడాన్ని ముందుగా విడనాడాలి. వ్యవసాయ వృద్ధి రేట్ల వ్యామోహాన్ని వదిలి వ్యవసాయ ఆదాయాలలో గణనీయమైన పెరుగుదలతో రైతు సంక్షేమంపై దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయం ఇది.

దేశంలోని 17 రాష్ట్రాలలోని రైతాంగ కుటుంబాల అంటే దాదాపు సగం దేశం సగటు వార్షిక ఆదాయం రూ. 20,000 మాత్రమేనని 2016 ఆర్థిక సర్వే సుస్పష్టంగా పేర్కొంది. ఆర్థికంగా ఎదుగుతున్న సగటు పట్టణ పౌరుల వార్షిక మొబైల్‌ బిల్లు కంటే కూడా అది తక్కువ. దురదృష్టవశాత్తూ నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయం నేటి సంక్షోభానికి కారణమైన విధానాలనే సూచిస్తు న్నాయి. పంట ఉత్పాదకత పెంచి ,ఉత్పత్తి వ్యయాలను తగ్గించి వ్యవసాయ ఉత్పత్తుల ధరలను మార్కెట్లనే నిర్ణయించనివ్వడం అనేది వ్యవసాయాన్ని లోతైన ఊబి లోకి నెట్టేసిన తప్పుడు విధాన నిర్ణయంలో భాగం. అది ఎరు వులు, క్రిమి సంహారక మందులు తదితర ఉత్పత్తి అవసరాల సరఫరాదా రులకు స్థిరంగా దోహదపడేది.

నీతి ఆయోగ్‌ కోరుకుంటున్న అభిలషణీయ సామర్థ్యపు స్థాయిని పంజాబ్‌ ఇప్పటికే అందుకుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 98 శాతం సాగునీటి సదుపాయంతో ఆ రాష్ట్రం ఆహారధాన్యాల దిగుబడిలో ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకతను సాధించింది. అయినా పంజాబ్‌ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందో అంతు బట్టదు. పంజాబ్‌లోని ఈ ఘోర వైఫల్యాన్ని విస్మరించి ఇతర రాష్ట్రాలన్నీ అదే మార్గాన్ని అనుసరించాలనడం మన విధాన నిర్ణయంలో ఏదో ఘోర తప్పిదం జరిగిందని స్పష్టం చేస్తోంది. విఫలమైనది రైతులు కాదు. ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతలే రైతులను విఫలం చేశారు. నేటి మాంద్య పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనాన్ని ఇవ్వగల శక్తి వ్యవసాయానికే ఉంది.

ప్రభుత్వం క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు చూపే మార్గాన్ని విడనాడితేనే నూతన ఆర్థిక పథాన్ని పునర్నిర్వచించుకోవడం సాధ్యం. వ్యవసాయాన్ని వృద్ధికి, సుస్థిరాభివృద్ధికి ఇరుసుగా చేయడానికి తగిన రాజకీయ ధైర్యాన్ని ప్రభుత్వం ప్రోది చేసుకోగలిగితేనే అది జరుగుతుంది. ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి రైతు కుటుంబానికి నెలకు రూ. 18,000 ఆదాయ ప్యాకేజీకి హామీనిచ్చే రైతు ఆదాయ కమిషన్‌ ఏర్పాటుకు సమయం ఆస న్నమైంది. ఈ కనీస ఆదాయ ప్యాకేజీని పొలం ఉత్పత్తి, భౌగోళిక స్థానాలతో ముడిపెట్టాల్సి ఉంటుంది. అదే సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ నిజం.

దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు  
hunger55@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement