అలెర్ట్ చేస్తుంది...
కొత్తకొత్తగా...
ఫోర్క్స్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి.. చిన్నపిల్లాడి నుంచి అమ్మమ్మల వరకు అందరూ వీటిని రోజూ ఉపయోగిస్తుంటారు. అవునా..? కానీ స్మార్ట్ ఫోర్క్ గురించి మాత్రం విని ఉండరు. ఎందుకంటారా...? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది మామూలు ఫోర్క్ కాదు.. బ్లూటూత్ కనెక్టెడ్ స్మార్ట్ ఫోర్క్. ఇది చాలా తెలివైనది. ఎందుకంటే, ఇది తినే ఆహార పదార్థంలో ఎన్నెన్ని క్యాలరీలున్నాయో మీ ఫోన్లో చూపిస్తుంది. అంతేకాదు, మీరు త్వరత్వరగా తింటున్నారనుకోండి. ఆ ఫోర్క్‌లో అమర్చిన బల్బ్ వెలుగుతూ, వైబ్రేట్ అవుతూ...
నెమ్మదిగా తినమంటూ సున్నితంగా హెచ్చరిస్తుంది. అలా ఈ ఫోర్క్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెమ్మదిగా తినడం ద్వారా మీ స్ట్రెస్ లెవల్స్ కూడా తగ్గుతాయి. అలాగే మీరు ఎక్కువ క్యాలరీలను తీసుకోకుండా చేసి, బరువును అదుపులో ఉంచుతుంది. ఇంతగా మిమ్మల్ని కాపాడే ఈ స్మార్ట్ ఫోర్క్‌లు మార్కెట్‌లో వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి.