Calorie
-
లో కేలరీ సోడా కంటే నీళ్లే బెటర్!
సోడాలు, కూల్డ్రింకుల్లో చక్కెర ఎక్కువ ఉంటుంది కాబట్టి.. కేలరీలు తక్కువగా ఉండేవి తాగుదామని అనుకుంటున్నారా? వాటి కంటే మంచినీళ్లు తాగడం ఎంతో మేలు అంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్! ఈ లో కేలరీ సోడాలు, కూల్డ్రింకులపై ఇప్పటివరకు జరిగిన అనేక పరిశోధనలను తాము రెండేళ్ల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, అన్నింటి ద్వారా తెలిసిందేమిటంటే.. ఈ రకమైన పానీయాల వల్ల బరువు పెరగడం పాటు మతిమరుపు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని. అయితే అమెరికాలో ఈ లో కేలరీ పానీయాల వాడకం క్రమేపీ తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని.. 2006లో సగటున 5.6 ఔన్సుల వరకూ తాగుతూంటే 2014 కల్లా ఇది 3.8 ఔన్సులకు తగ్గిందని ఇది మంచి పరిణామమేనని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాచెల్ కె. జాన్సన్ తెలిపారు. ఊబకాయం ఉన్న పిల్లలు, సోడాలు, పానీయాలు నిత్యం తాగేవారు... బరువు నియంత్రించుకునేందుకు లో కేలరీ పానీయాలు కొద్దికాలం పాటు వాడవచ్చు. వాటిని వదిలేయడమే దీర్ఘకాలపు పరిష్కారం. నీళ్లు, కొవ్వులు తక్కువగా ఉండే పాలు తాగడం అన్నిటికంటె ఉత్తమమని సూచిస్తున్నారు. -
ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు
శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా... జస్ట్ అలా కూర్చుని ఉండటం, చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే.. గంటకు... 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు. చాలా స్వల్పమైన శారీరక కదలికలతో... నిలబడి వంటచేయుడమే కాకుండా సింక్లో వంటపాత్రలు కడగటం, ఇస్త్రీ చేయుడం, చాలా మెల్లిగా నడవటం వంటివి చేస్తే... గంటకు... 110 -160 క్యాలరీలు ఖర్చవుతారుు. ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండేవి... కాస్తంత వేగంగా నడవటం, ఊడ్చటం, బట్టలు సర్దడం, పక్కబట్టలు పరవడం వంటివాటికి... గంటకు 120-240 క్యాలరీలు ఖర్చవుతారుు. శారీరక కదలికలు ఎక్కువగా ఉండే పనులు... కారును కడగటం, గోల్ఫ్ ఆడటం, పరిగెత్తినట్టుగా నడవటం, ఓ మోస్తరు వేగంతో సైకిల్ తొక్కడం వంటి వాటికి... గంటకు 250-350 క్యాలరీలు ఖర్చవుతారుు. భారీ శరీర కదలికలు అవసరవుయ్యే పనులు... పరుగెత్తడం, ఈదడం, టెన్నిస్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడటం.... వంటి వాటికి గంటలకు 350- ఆ పైన క్యాలరీలు ఖర్చవుతారుు. -
అలెర్ట్ చేస్తుంది...
కొత్తకొత్తగా... ఫోర్క్స్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి.. చిన్నపిల్లాడి నుంచి అమ్మమ్మల వరకు అందరూ వీటిని రోజూ ఉపయోగిస్తుంటారు. అవునా..? కానీ స్మార్ట్ ఫోర్క్ గురించి మాత్రం విని ఉండరు. ఎందుకంటారా...? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది మామూలు ఫోర్క్ కాదు.. బ్లూటూత్ కనెక్టెడ్ స్మార్ట్ ఫోర్క్. ఇది చాలా తెలివైనది. ఎందుకంటే, ఇది తినే ఆహార పదార్థంలో ఎన్నెన్ని క్యాలరీలున్నాయో మీ ఫోన్లో చూపిస్తుంది. అంతేకాదు, మీరు త్వరత్వరగా తింటున్నారనుకోండి. ఆ ఫోర్క్లో అమర్చిన బల్బ్ వెలుగుతూ, వైబ్రేట్ అవుతూ... నెమ్మదిగా తినమంటూ సున్నితంగా హెచ్చరిస్తుంది. అలా ఈ ఫోర్క్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెమ్మదిగా తినడం ద్వారా మీ స్ట్రెస్ లెవల్స్ కూడా తగ్గుతాయి. అలాగే మీరు ఎక్కువ క్యాలరీలను తీసుకోకుండా చేసి, బరువును అదుపులో ఉంచుతుంది. ఇంతగా మిమ్మల్ని కాపాడే ఈ స్మార్ట్ ఫోర్క్లు మార్కెట్లో వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి.