ఆహరభద్రత బిల్లు చారిత్రాత్మకం: సోనియా | Food Bill is historic says Sonia | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 26 2013 4:24 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM

ఆహారభద్రత బిల్లు ద్వారా దేశప్రజలందరికీ ఆహారం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ వెల్లడించారు. సోమవారం ఆహారభద్రత బిల్లును ప్రభుత్వ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సోనియాగాంధీ ప్రసంగిస్తూ... దేశంలో పౌష్టికాహార లోపం ఏ చిన్నారిలోనూ ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. రైతులు, వ్యవసాయదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఆ చట్టానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. వనరుల సద్వినియోగంతో ఆహారభద్రత చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకుందని సోనియా ఈ సందర్భంగా గుర్తు చేశారు. సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా ఆధార్ కార్డు ఆడ్డుకుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది చరిత్రాత్మకమైన ముందడుగు అని సోనియా పేర్కొన్నారు. ఆహారభద్రత బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సలహాలను తీసుకుని ఉండాల్సిందని సమాజవాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే ఆ బిల్లును ఏలా ముందుకు ఏలా తీసుకెళ్తారని ములాయం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement