న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా 130 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు మట్టి పాలవుతున్నట్లు ఐరాస అధ్యయనం వెల్లడించింది. దీని విలువ సుమారు రూ. 48 లక్షల కోట్లని అంచనా వేసింది. ఆహార ధాన్యాలను నిల్వ చేసే సామర్థ్యం లేకపోవటం, మనిషి నిర్లక్ష్యం కారణంగా ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాల్లో మూడో వంతు వృథాగా మారుతున్నాయని తెలిపింది. దీనివల్ల వీటి తయారీకి దోహదపడే నీరు, రసాయనాలు, ఇంధనం కూడా వ్యర్థమవుతున్నాయి. ‘ఆహార ధాన్యాల వృథా - సహజ వనరులపై ప్రభావం’ పేరుతో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ తొలిసారిగా వెలువరించిన ఈ అధ్యయనంలో అంతర్జాతీయంగా తిండిని వృథా చేయటం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి పర్యావరణ కోణంలో వివరించారు.
వాతావరణం, నీరు, భూమి వినియోగం, జీవ వైవిధ్యం తదితర అంశాలను ప్రస్తావించారు. మానవ ఆహార చక్రంలోని వివిధ దశల్లో ఆహార పదార్థాల వినియోగంలో జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు రైతులు, మత్స్యకారులు, ఆహార శుద్ధిదారులు, సూపర్‌మార్కెట్లు, ప్రభుత్వాలు, వ్యక్తిగత వినియోగదారులు అంతా కలిసి చర్యలు తీసుకోవాలని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ డెరైక్టర్ జనరల్ జోస్ సూచించారు. ప్రపంచంలో ఒకవైపు 87 కోట్ల మంది తిండి లేక నకనకలాడుతుంటే ఈ స్థాయిలో వృథా సరికాదన్నారు.
మూడో వంతు మట్టిలోకి!
Published Thu, Sep 12 2013 3:38 AM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM
Advertisement