
ప్రకృతి మన తెలుగువాళ్లకు వెయ్యి కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. గుజరాత్‌కి మాత్రం 16 వందల కిలోమీటర్ల తీరాన్నిచ్చింది. ఆ తీరమే ఆ రాష్ట్రానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. ఆ అరేబియా తీరమే విదేశీ వర్తకానికి దారులు వేసింది. ఆ తీరానే శ్రీకృష్ణుడు... మన జాతిపిత గాంధీజీ పుట్టారు. సోమనాథుడు వెలిశాడు... గోరీ మనదేశం మీద దండెత్తాడు. ఆ తీరం పర్యాటకపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ద్వారక నుంచి సోమనాథ్ వరకు ప్రయాణమే ఈ వారం పర్యాటకం.
అదిగో ద్వారక...
బేట్ ద్వారక... ఇది ద్వారక తీరం నుంచి కనిపించే దీవి. సముద్ర తీరాన విహరించడంతోపాటు సముద్రం మధ్యలో పడవలో పయనించడాన్ని కూడా ఆస్వాదించవచ్చు. కృష్ణుడి ద్వారకను చూసి ఆ నేల మీద నడిస్తే కలిగే పులకింతను మాటల్లో చెప్పలేం. పురాణకాలంలో కూడా ప్రజలు ద్వారక ప్రధాన పట్టణం నుంచి బేట్ ద్వారకకు పడవలో ప్రయాణం చేసినట్లు గ్రంథాల్లో ఉంది.
చారిత్రక యుగంలో కూడా ద్వారక గురించి సింధు నాగరకత, హర΄్పా నాగరకత, మౌర్య సామ్రాజ్య రచనల్లో కనిపిస్తుంది. ఈ తీరం నుంచి రోమన్‌తో వర్తక వాణిజ్యాలు జరిగేవి. ఇక్కడి మ్యూజియాలలో ప్రశాంతంగా గడిపే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టూర్ ΄్లాన్ చేసుకోవాలి. ఓఖా– బేట్ ద్వారకలను కలిపే బ్రిడ్జి ‘సుదర్శన సేతు’ మీద ఆగి ఫొటో తీసుకోవడం మరిచిపోవద్దు.
అంబానీ సొంతూరు
చోర్‌వాడ్ బీచ్... ఇది సోమనాథ్‌కు 40కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ బీచ్ క్లీన్‌గా ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడానికి, చక్కటి ఫొటోలు తీసుకోవడానికి బాగుంటుంది. అరేబియా సముద్రం ఈతకు అనువైనదే. కానీ చోర్‌వాడ్ దగ్గర మాత్రం ఈత క్షేమం కాదు. ఇక్కడ బీచ్ విజిట్ పూర్తయిన తర్వాత దీరూబాయ్ అంబానీ ఇంటిని చూడడం మర్చిపోవద్దు. నిజమే... ఇది అంబానీల సొంతూరు.
ఈ ప్రదేశానికి చోర్‌వాడ్ అనే పేరు ఎందుకు వచ్చిందా అనే సందేహం తొలుస్తూనే ఉందా? అరేబియా తీరం నుంచి విదేశీ వ్యాపారం విరివిగా జరిగేది. సముద్రంలో ఓడల్లో సరుకుల రవాణా జరుగుతోందంటే అసంకల్పిత చర్యగా ఆ సరుకును దొంగలించే దొంగలు కూడా సిద్ధమై ΄ోతారు. ఆ సముద్రపు దొంగలు నివాసం ఏర్పరుచుకున్న ప్రదేశం ఇది. దొంగల నివాస ప్రదేశం అనే అర్థంలోనే పేరు స్థిరపడి΄ోయింది.
రుక్మిణి కల్యాణం
మాధవ్‌పూర్ బీచ్... ఇది పోర్‌బందర్ నుంచి వెరావల్‌కు వెళ్లే హైవే మీద ఉంటుంది. సముద్ర తీరాన హైవే ఉంటుంది. కాబట్టి రోడ్డు మీద ప్రయాణిస్తూ అరేబియా సముద్రపు నీటి నీలం గాఢతను చూడవచ్చు. ఆకాశానికి– సముద్రానికి మధ్య రేఖ ఎక్కడో తెలుసుకోవడం ఓ పెద్ద పజిల్. అన్నట్లు ఇక్కడ తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రం ఉంది.
స్థానికులను అడిగితే దారి చూపిస్తారు. పోర్‌బందర్ వరకు కొబ్బరి నీరు దొరకవు. కానీ మాధవ్‌పూర్ నుంచి సముద్ర తీరాన కొబ్బరి బోండాలు కనిపిస్తాయి. సముద్ర తీరాన కామెల్ రైడ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పెద్ద వాళ్లు మొహమాట పడకుండా ఒంటె విహారాన్ని ఆస్వాదించాలి. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు తీసుకుని వెళ్లిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇక్కడ ఓషో ఆశ్రమం కూడా ఉంది.
ఓఖా– మాధీ బీచ్...
ఇది ద్వారక వెళ్లే దారిలో వస్తుంది. హైవే మీద వాహనాన్ని ఆపుకుని దిగి ΄ావు కిలోమీటరు నడిస్తే ΄ాదాలు సముద్రపు నీటిలో ఉంటాయి. ఇక్కడ వర్తక వాణిజ్యాలేవీ జరగవు. కాబట్టి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఇతర ప్రమాదాలు కూడా ఏవీ జరగవు. కాబట్టి సముద్రంలో స్నానం, స్విమ్మింగ్ సరదా తీరుతుంది. ఇక్కడ జనం రద్దీ తక్కువ. కాబట్టి ఏకాంతపు పర్యటనకు ఇది మంచి ప్రదేశం. సూర్యాస్తమయాన్ని వీక్షించడంతో΄ాటు రాత్రి బస ΄్లాన్ చేసుకోవడానికి అనువైన ప్రదేశం.
కృష్ణుడికి బాణం దెబ్బ
వెరావల్ బీచ్... ఇది సోమనాథ్‌కు నాలుగుకిలోమీటర్ల దూరాన ఉంది. ఇది శ్రీకృష్ణుడు ప్రణత్యాగం చేసిన ప్రదేశం. కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో జర అనే వేటగాడు జింక కాలుగా భావించి బాణం వేశాడని, కృష్ణుడు గాయపడి ప్రణత్యాగం చేశాడని చెబుతారు.
ఈ ప్రదేశం భాల్క తీర్థంతో సందర్శన స్థలంగా అభివృద్ధి చెందింది. ఈ సంఘటన క్రీ. పూర్వం 3102, ఫిబ్రవరి 17 లేదా 18వ తేదీగా భావిస్తారు. కృష్ణుడి మరణంతో ద్వాపర యుగం అంతమైందని, మరుక్షణం నుంచి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. వెరావల్ తీరంలో ప్రాచీన కాలం నుంచి వర్తక వాణిజ్యం జరిగేది.
సౌరాష్ట్ర కశ్మీరం
మహువా బీచ్... ప్రశాంతతకు మారు పేరు ఈ ప్రదేశం. ఏడాదంతా చల్లగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే కేరళలో ఉన్నామా అనిపిస్తుంది. కొబ్బరిచెట్లు విస్తారంగా ఉంటాయి. ఈత చెట్లు కూడా. రెండు– మూడు గంటల కోసం వెళ్లడం కంటే రాత్రి బస ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ సముద్ర తీరాన భవానీ మాత ఆలయం ఉండడంతో స్థానికులు భవానీ బీచ్ అంటారు.
మన పర్షియా
ఉద్వాద బీచ్... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ్ర΄ాచీన పర్షియన్ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం.
విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్ మెహ్రామ్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది.
గాంధీజీ పుట్టాడు
చౌపాటీ బీచ్... ఇది పోర్‌బందర్‌లోని అరేబియా తీరం. ΄ోర్‌బందర్ అంటే మన జాతిపిత గాంధీజీ పుట్టిన ఊరు. అంతకంటే ముందు పౌరాణిక కథనాలను చూస్తే ఇది శ్రీకృష్ణుడి స్నేహితుడు సుధాముడు పుట్టిన ప్రదేశం కూడా. గాంధీజీ ఇంటితోపాటు సుధాముడి ఆలయాన్ని కూడా చూడవచ్చు.
ఈ ఆలయంలో అటుకులను ప్రసాదంగా ఇస్తారు. పోర్‌బందర్ జిల్లాకేంద్రమే, కానీ పట్టణంలో పెద్ద హడావుడి ఉండదు. తీర ప్రాంతం మాత్రం అభివృద్ధికి చిరునామాగా కనిపిస్తుంది. పోర్టు ఉండడంతో దాని అనుబంధ పరిశ్రమలు కూడా ఉంటాయి. ఖండాంతరాల నుంచి వచ్చిన ఫ్లెమింగోలు కూడా వేసవిలో ఇక్కడ సేదదీరుతుంటాయి. వాటి కోలాహలాన్ని కూడా ఆస్వాదించవచ్చు.
జ్ఞాపకాలు దండి
దండి సత్యాగ్రహం గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. గాంధీజీ 1930లో ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టింది ఇక్కడి నుంచే. అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండుగా బయలుదేరి ఈ ప్రదేశంలో సముద్రపు నీటిని సేకరించి మరిగించి ఉప్పు తయారు చేశాడు.
ఆ సంఘటనకు చిహ్నంగా ఇక్కడ గాంధీజీ ఉప్పు రాశి పోస్తున్న విగ్రహం ఉంటుంది. ఈ తీరంలో విహరించడంతో΄ాటు దండి సత్యాగ్రహం సమయంలో గాంధీజీ బస చేసిన సైఫీ బంగ్లాను కూడా చూసి ఒక ఫొటో తీసుకోవచ్చు.
గాయపడిన ఆలయం
సోమనాథ్ బీచ్... ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ ప్రదేశం విదేశీ దాడులకు ముఖద్వారం అని చెప్పవచ్చు. మహమ్మద్ గోరీ అనేకసార్లు మనదేశం మీద దాడులు చేశాడు. అరేబియా సముద్రం మీద వచ్చి ఈ తీరం నుంచే భారత భూభాగంలోకి అడుగుపెట్టేవాడు. ఆలయ సంపద దోపిడీతోపాటు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం వంటివన్నీ చరిత్రపుటల్లో దాక్కున్నాయి.
ఈ ఆలయం ఎన్నిసార్లు పునర్నిర్మాణం చేసుకుందో తెలియాలంటే చరిత్ర పుస్తకాలు చదవాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్న మారు– గుర్జర శైలి నిర్మాణం నిర్మాణం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీజీ అనుమతితో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయత్నం. అందుకే ఆయన గౌరవార్థం ఆలయ ప్రాంగణంలో వల్లభాయ్ పటేల్ విగ్రçహాన్ని ప్రతిష్ఠించారు.
అరేబియా సముద్రం చిరు అలలతో మంద్రమైన సవ్వడితో ఆలరిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం కొంత అలజడిగా ఉంటుంది. అలలు వేగంగా వచ్చి ఆలయ గోడలను తాకుతుంటాయి.
మన పర్షియా
ఉద్వాద బీచ్... ఇది భారత భూభాగమే కానీ ఇక్కడ పర్యటిస్తుంటే పర్షియా సామ్రాజ్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనదేశంలో జొరాస్ట్రియన్ మత వికాసానికి నిదర్శనం. ఇక్కడి ఇళ్లన్నీ ప్రాచీన పర్షియన్ నిర్మాణశైలిలో ఉంటాయి. మరమత్తులు చేసేటప్పుడు వాటి నిర్మాణ ప్రత్యేకతను కోల్పోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఆలయం కూడా ప్రపంచంలో ఉన్న ఎనిమిది ప్రముఖ జొరాస్ట్రియా ఆలయాల్లో ఒకటి. ఆలయాల్లో అగ్నిమంట చల్లారనివ్వకుండా కాపాడుకోవడం వారి క్రతువుల్లో ప్రధానం. విజయాగ్ని ఆరని ఆలయాల జాబితాలో ఇక్కడ ఉన్న ఆటాశ్ మెహ్రామ్ కూడా ఒకటిగా చెప్పుకుంటారు. ప్రాచీన వారసత్వాన్ని పరిరక్షించుకోవడంలో వారు చూపిస్తున్న శ్రద్ధ కనిపిస్తుంది. అందుకే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది.
(చదవండి: యమ రిచ్ దొంగ..! మూడు ఫ్లాట్లు భార్యకు, గర్ల్‌ఫ్రెండ్‌కు..!)
Comments
Please login to add a commentAdd a comment