
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనతో తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఈనెల 7 వరకు దక్షిణ కొరియాలో పర్యటించనుంది. ఈ బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోగా.. ఆ దేశంలో భారత అధికారులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గోదావరి నది ఒడ్డునున్న కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్, మన్యంకొండ వద్ద తొలిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయని వివరించారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ వాటర్ రివర్ ఫ్రంట్‌ను అధ్యయనం చేస్తున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment