దుబాయ్: మతం కన్నా మానవత్వం గొప్పదని నిరూపించింది ఓ సౌదీ మహిళ. ప్రమాదవశాత్తు రెండు ట్రక్కులు ఢీకొని మంటలు చేలరేగిన ఘటనలో ఆ మహిళా మత కట్టుబాట్లను పక్కన పెట్టి సమయ స్పూర్తిని ప్రదర్శించి ట్రక్కు డ్రైవర్‌ని రక్షించింది. జవహార్ సైఫ్ అల్ కుమాతీ అనే ముస్లిం మహిళ ఆసుపత్రిలో ఉన్న తన స్నేహితురాలిని కలిసి మరో స్నేహితురాలితో కారులో తిరిగి వస్తుండగా యునైటెడ్ అరబ్ ఎమెరేట్స్‌లోని రాస్ అల్-ఖైమాహ్ నగరంలో రెండు ట్రక్కులు ఢీకొని మంటలు చేలరేగిన ప్రమాదం కంటపడింది.
మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ హర్‌క్రిత్ సింగ్ కాపాండండి అంటూ చేసిన ఆర్తనాదాలు విన్న జవహార్ తన స్నేహితురాలి బుర్ఖా విప్పించి ఆమెను కారులోనే ఉండమని సూచించింది. ఆ బుర్ఖాతో ఆ డ్రైవర్ ఒంటిపై ఉన్న మంటలను ఆర్పి అతని ప్రాణాలు రక్షించింది. ఈ చర్యతో ఆమె మతం కన్నా మానవత్వమే గొప్ప అని చాటిచెప్పింది. ఇక ట్రక్కు డ్రైవర్లు ఇద్దరు 50 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముస్లిం మహిళలు బయటకి వెళ్లినపుడు బుర్ఖా ధరించాలనే నిబంధన ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment