Dubai set to become the World's Tallest Residential Building - Sakshi
Sakshi News home page

దుబాయ్‌ మరో ఘనత.. ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనం.. టాప్‌ టు బాటమ్‌ ఎన్నో ప్రత్యేకతలు!

Published Wed, Nov 23 2022 4:52 PM | Last Updated on Wed, Nov 23 2022 6:15 PM

Dubai Set To Get World Tallest Residential Building - Sakshi

దుబాయ్‌: ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్‌ అయిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌.. మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనానికి దుబాయ్‌ వేదిక కాబోతోంది. దుబాయ్‌ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్‌ బే’లో వంద ఫ్లోర్లతో నిర్మించిన ఈ హైపర్‌టవర్‌ గిన్నిస్‌ రికార్డు ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది. 

అంతకు ముందు ఈ రికార్డు న్యూయార్క్‌ నగరం(అమెరికా) మాన్‌హట్టన్‌ 57వ స్ట్రీట్‌లోని సెంట్రల్‌ పార్క్‌ టవర్‌ పేరిట ఉంది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్‌ ఉన్నాయి. ఇక.. ఎత్తు 472 మీటర్ల రికార్డును సైతం దుబాయ్‌ హైపర్‌టవర్‌ అధిగమించనుంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది.


సెంట్రల్‌ పార్క్‌ టవర్‌

దుబాయ్‌లో ఈ హైపర్‌టవర్‌ను ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నట్లు నిర్మాణ కంపెనీలు మంగళవారం ప్రకటించాయి. ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్‌ కంపెనీ ‘జాకోబ్‌ అండ్‌ కో’ సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మించాయి. దీంతో.. ఈ భవనానికి బుర్జ్‌ బింఘట్టి జాకోబ్‌ అండ్‌ కో రెసిడెన్సీగా నామకరణం చేశారు. 

అగ్రభాగాలు.. డైమండ్‌ ఆకారంలో ఉండడం ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత కాగా, రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ ఆకాశ హర్మ్యం. పూర్తిగా డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌ రూంలతో పాటు ప్రత్యేకమైన సదుపాయాలెన్నింటినో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. చివరి ఐదు ఫ్లోర్‌లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ భవనం ప్రారంభ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఇదీ చదవండి: మొట్టమొదటి ఆకాశ హార్మ్యం ఏది? ఎవరు కట్టారో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement