Ain Dubai (Dubai Eye) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలు, రికార్డ్-బ్రేకింగ్ ల్యాండ్‌మార్క్ నిర్మాణాలకు పుట్టినిల్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ముఖ్యంగా గ్లామ్-హబ్ దుబాయ్‌పర్యాటకులను ఆకర్షించే అతిపెద్ద ఫెర్రిస్ వీల్ ఐన్ దుబాయ్ (దుబాయ్ఐ) అర్థాంతరంగా నిలిచిపోయింది. దుబాయ్‌లో రెండేళ్ల కిందట (అక్టోబర్ 21, 2021) అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్ వీల్ హఠాత్తుగా ఆగిపోవడం చర్చకు దారితీసింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!)
దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్ షాపింగ్, లగ్జరీ హోటల్స్ తోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గుర్తొస్తాయి. వీటన్నింటికి మించి అట్టహాసంగా ప్రారంభమై పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. ఈ అతిపెద్ద జెయింట్ వీల్ మొరాయిస్తోంది. ప్రస్తుతం ఎల్‌ఈడీ ఫిక్చర్‌లు మాత్రమే పనిచేస్తున్నాయట. ఈ విషయాన్ని అధికారిక వెబ్‌సైట్ స్వయంగా ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఐన్ దుబాయ్ తెరుచుకోదని వెల్లడించింది. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి శరవేగంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. దుబాయ్ ఐని ఎపుడు తిరిగి ప్రారంభించేదీ అధికారికంగా వెల్లడించలేదు. (లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!)
దుబాయ్ పర్యాటక శాఖ ప్రకారం పుట్టినల్లు దుబాయ్ ఐ 250 మీటర్ల (825 అడుగులు) uత్తులో ఉంది. . ప్రపంచంలోనే అతిపెద్దది. లండన్ ఐ కంటే దాదాపు రెండు రెట్లు ఎత్తు. అంతర్జాతీయ కంపెనీల కన్సార్టియం నిర్మించిన దుబాయ్ఐ, బ్లూవాటర్స్‌లో ఉంది. ఈఫిల్ టవర్ కంటేఎక్కువ ఉక్కుతో తయారు చేయబడినజెయింట్ వీల్, నామమాత్రంగానే మిగిలిపోవడం పర్యాటక ప్రియులను నిరాశపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment