wheel
-
అద్భుతం.. ఆ బ్యాలెన్స్
-
G20 Summit: ‘కోణార్క్ చక్రం’ ప్రాధాన్యత ఇదే..
జీ20 సదస్సుకు వచ్చిన ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి మైదాన్ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్ మండపం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ప్రపంచ నేతలందరితో కరచాలనం చేసి, వారిని ఘనంగా స్వాగతించారు. ఈ సమయంలో అందరి చూపు ఒడిశాలోని సూర్య దేవాలయంలో కనిపించే చక్రానికి ప్రతిరూపంగా వేదికపై ఏర్పాటు చేసిన నమూనాపై పడింది. ఇది వేదిక అందాన్ని రెండింతలు చేసింది. చరిత్రకారుల తెలిపిన వివరాల ప్రకారం కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో నిర్మితమయ్యింది. దీనిని రాజు నరసింహదేవ్-I పాలనలో నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగివుంది. ఈ సూర్య చక్రంలో 24 కమ్మీలు ఉంటాయి. ఈ చక్రం భారతదేశ జాతీయ జెండాలో కూడా కనిపిస్తుంది. ఈ చక్రం భారతదేశ పురాతన విజ్ఞానం, అధునాతన నాగరికత, నిర్మాణ నైపుణ్యానికి చిహ్నంగా నిలుస్తుంది. కోణార్క్ చక్రం పురోగతిని, నిరంతర మార్పును సూచిస్తుందని చెబుతారు. భారత రూపాయి నోట్లపై కూడా ఈ కోణార్క్ చక్రాన్ని మనం చూడచ్చు. ఒకప్పుడు 20 రూపాయల నోటుపై ఇది కనిపించింది. అలాగే ఆపై 10 రూపాయల నోటుపై కూడా దీనిని ముద్రించారు. కోణార్క్ ఆలయంలోని ఈ చక్రాన్ని ఆధారంగా చేసుకుని సమయాన్ని లెక్కిస్తారని చెబుతారు. చక్రం పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని అంటారు. ఆలయంలోని 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని చెబుతారు. కాగా ఈ ఏడాది ‘వన్ ఎర్త్’ థీమ్‌తో జీ20 సమ్మిట్ మొదటి సెషన్ ప్రారంభమైంది. జీ20 శిఖరాగ్ర సమావేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో జరుగుతుంది. ఇది కూడా చదవండి: బెర్లిన్‌లో గణేశుని ఆలయం.. దీపావళికి ప్రారంభం -
బైకుకు ట్రాక్టర్ టైర్
-
చెత్తతో 6 చక్రాల వాహనం.. ‘మెకానికల్ గాడిద’ సూపర్ సే ఊపర్ అంటూ కితాబు!
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు యూజర్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. తాజాగా ఒక వ్యక్తి తన గ్యారేజీలోని పనికిరాని వస్తువులతో 6 చక్రాల వాహనాన్ని తయారు చేశాడు. అది నడిచే తీరు ఎంతో వింతగా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి చిన్న వాహనంపై కూర్చుని కనిపిస్తున్నాడు. ఆ వాహనాన్ని చూస్తే ఎవరికైనా పిల్లలు ఆడుకునే బొమ్మలా అనిపిస్తుంది. పరిశీలించి చూస్తే.. అది 6 చక్రాల వాహనం అని గమనించవచ్చు. చిన్నగా కనిపించే ఈ వాహనానికి నాలుగు కాళ్లు మాదిరిగా నాలుగు రాడ్లు కనిపిస్తాయి. మద్యలో రెండు చిన్న, చిన్న టైర్లు కనిపిస్తాయి. ఈ వాహనంపై కూర్చునేందుకు సీటు కూడా ఉంది. చూపరులను ఈ వాహనం ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్లో @TansuYegen పేరుతో షేర్ చేశారు. వీడియోతో పాటు క్యాప్షన్‌గా చైనాకు చెందిన ఒక ఇంజినీరు గ్యారేజీలో పడివున్న సామానులను వినియోగిస్తూ మెకానికల్ గాడిదను తయరు చేశాడు అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 57 వేలకుపైగా వ్యూస్ దక్కాయి. పలువురు నెటిజన్లు ఈ వాహన తయారీని మెచ్చుకుంటున్నారు. ఒక యూజర్ ఈ వాహనం 5 నిముషాల్లో వెళ్లాల్సిన దూరానికి 50 నిముషాలు తీసుకుంటుందని కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! 🇨🇳 In China, an engineer built and rode a mechanical donkey using spare parts from their garage. 🛠️🐴🚀 pic.twitter.com/8vZmTBL342 — Tansu YEĞEN (@TansuYegen) August 11, 2023 -
అయ్యయ్యో..దుబాయ్ అతిపెద్ద జెయింట్ వీల్ ఆగిపోయింది
Ain Dubai (Dubai Eye) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాలు, రికార్డ్-బ్రేకింగ్ ల్యాండ్‌మార్క్ నిర్మాణాలకు పుట్టినిల్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ముఖ్యంగా గ్లామ్-హబ్ దుబాయ్పర్యాటకులను ఆకర్షించే అతిపెద్ద ఫెర్రిస్ వీల్ ఐన్ దుబాయ్ (దుబాయ్ఐ) అర్థాంతరంగా నిలిచిపోయింది. దుబాయ్‌లో రెండేళ్ల కిందట (అక్టోబర్ 21, 2021) అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద జెయింట్ వీల్ హఠాత్తుగా ఆగిపోవడం చర్చకు దారితీసింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) దుబాయ్ అంటే ఆకాశహర్మ్యాలు, షాపింగ్ మాల్స్ షాపింగ్, లగ్జరీ హోటల్స్ తోపాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా గుర్తొస్తాయి. వీటన్నింటికి మించి అట్టహాసంగా ప్రారంభమై పర్యాటకులను విశేషంగా ఆకర్షించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. ఈ అతిపెద్ద జెయింట్ వీల్ మొరాయిస్తోంది. ప్రస్తుతం ఎల్ఈడీ ఫిక్చర్లు మాత్రమే పనిచేస్తున్నాయట. ఈ విషయాన్ని అధికారిక వెబ్సైట్ స్వయంగా ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఐన్ దుబాయ్ తెరుచుకోదని వెల్లడించింది. గత కొద్ది నెలలుగా జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి శరవేగంగా పనిచేస్తున్నామని ప్రకటించింది. దుబాయ్ ఐని ఎపుడు తిరిగి ప్రారంభించేదీ అధికారికంగా వెల్లడించలేదు. (లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!) దుబాయ్ పర్యాటక శాఖ ప్రకారం పుట్టినల్లు దుబాయ్ ఐ 250 మీటర్ల (825 అడుగులు) uత్తులో ఉంది. . ప్రపంచంలోనే అతిపెద్దది. లండన్ ఐ కంటే దాదాపు రెండు రెట్లు ఎత్తు. అంతర్జాతీయ కంపెనీల కన్సార్టియం నిర్మించిన దుబాయ్ఐ, బ్లూవాటర్స్లో ఉంది. ఈఫిల్ టవర్ కంటేఎక్కువ ఉక్కుతో తయారు చేయబడినజెయింట్ వీల్, నామమాత్రంగానే మిగిలిపోవడం పర్యాటక ప్రియులను నిరాశపరుస్తోంది. -
చైన్ లాగకుంటే పరిస్థితి ఏంటి!.. విరిగిన చక్రంతో 10 కి.మీ. ప్రయాణించిన రైలు!
భోపాల్: బిహార్‌లో ఓ ప్రయాణికుల రైలుకు భారీ ప్రమాదం తప్పింది. ముజఫర్‌పూర్‌లో ముంబయి వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ చక్రం విరిగి 10 కిలోమీటర్ల వరకు ప్రయాణించడమే అందుకు కారణం. ఆదివారం అర్థరాత్రి భగవాన్‌పూర్ రైలు వద్ద ముజఫర్‌పూర్-హాజీపూర్ రైలు సెక్షన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. కాస్త దూరం ప్రయాణించి తర్వాత ప్యాసింజర్లకు S-11 కోచ్‌లో పెద్ద శబ్దాలు వినిపించాయి. భారీ ప్రమాదం తప్పింది అయితే, వేగంగా వెళుతున్న రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పటికీ సమస్యను గుర్తించే ప్రయత్నాలు జరగలేదని సమాచారం. రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరగా.. ఆ శబ్ధంలో ఏ మార్పు రాకపోవడంతో ప్రయాణికులకు ఆనుమానం వచ్చి చైన్ లాగేసి రైలును ఆపేశారు. తక్షణమే ట్రైన్లో ఏదో సమస్య ఉందని రైల్వే ఉద్యోగులతో పాటు రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది జరిపిన తనిఖీలో, S-11 కోచ్ చక్రం విరిగిందని కనుగొన్నారు. దీని తర్వాత రైల్వే ఇంజనీర్లు, ఉద్యోగులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలుకు మరమ్మతులు చేయగా, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ‘పవన్ ఎక్స్‌ప్రెస్ చక్రం విరిగిపోయిందని మాకు సమాచారం అందింది. వెంటనే మా బృందం అక్కడికి చేరుకొని మరమ్మతులు నిర్వహించింది’ అని రైల్వే అధికారి వీరేంద్ర కుమార్ వెల్లడించారు. కాగా జూన్ 2న బాలాసోర్ రైలు ప్రమాదంలో 290 మందికి పైగా మరణించిన 1,000 మందికి పైగా గాయపడిన ఘటన మరవకముందే ఇది చోటు చేసుకోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. చదవండి: ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..! -
షాకింగ్ ఘటన: విమాన చక్రంలో మనిషి మృతదేహం
గాంబియా నుంచి బ్రిటన్‌కు వెళ్లిన జెట్ విమానంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం వీల్ బేలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. టీయూఐ ఎయిర్వేస్ నడుపుతున్న జెట్ విమానంలో గుర్తు తెలియని ఒక నల్లజాతీయుడు మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. డిసెంబర్5, 2022న గాంబియా రాజధాని బంజుల్ నుంచి లండన్‌లోని గాట్విక్ మిమానాశ్రయానికి విమానం బయలుదేరింది. సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడే ఈ దిగ్బ్రాంతికర ఘటనను గుర్తించారు అధికారులు. ఈ మేరకు బ్రిటన్ మెట్రో పోలీసులు గాంబియా ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఒక అపరిచిత వ్యక్తి విమానం వీల్ బేలో మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. ఈ మృతదేహాన్ని విమానం నుంచి తొలగించి వర్థింగ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాంబియన్ అధికారులు బ్రిటన్ పోలీసులకు సహకరించడమే కాకుండా మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యూకే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు. 2019లో ఆమ్స్టర్డామ్లోని పోలీసులు కెన్యా నుండి వచ్చిన కార్గో విమానం ముక్కు చక్రంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మరణించాడు. (చదవండి: కారుతో ఢీకొట్టి చంపినందుకు.. రూ 90 లక్షలు జరిమానా) -
మిరాకిల్ అంటే ఇదే... మీద నుంచి కారు వెళ్లిపోయినా..
యాక్సిడెంట్‌కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కానీ కొన్ని వీడియోల్లో సదరు వ్యక్తులు బతకరు అనిపించేంత దారుణమైన ప్రమాదం జరుగుతుంది. అయినప్పటికీ చాలా మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటనలు ఎన్నో చూశాం. ఐతే ఈ ఘటన మాత్రం అందుకు విరుద్ధం. ఎందుకంటే ఇక్కడొక చిన్నారిపై నుంచి కారు వెళ్లిపోయింది. ఐతే ఆమెకి ఒంటిపై ఒక్క గాయం కూడ కాలేదు. పైగా ఆ చిన్నారి సైలెంట్‌గా తనకు తానుగా లేచి వెళ్లిపోయింది. అసలేం జరిగిందంటే...ఒక చిన్నారి తన చిన్న సైకిల్‌తో రోడ్డుపై వెళ్తోంది. ఇంతలో అటుగా వస్తున్న ఒక కారు ఆ చిన్నారిని ఢీ కొడుతుంది. దీంతో ఆ చిన్నారి కారు కింద పడిపోతుంది. అంతేగాదు కారు ముందు చక్రం ఆ చిన్నారి పై నుంచి వెళ్లిపోతుంది. ఐతే అనుహ్యంగా ఆమెకు ఎలాంటి గాయం కాలేదు. పైగా ఆ చిన్నారి తనకు తాను లేచి భయంతో ఏడుస్తూ వెళ్లిపోతుంది. మిరాకిల్ అంటే ఇది కదా!. బతకాలని రాసిపెట్టి ఉంటే ఎలాగైనా బతికేస్తాం కాబోలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. जाको राखे सईंया मार सके ना कोय। यकीन करना मुश्किल है कि बच्ची ऐसे हादसे मे बच गयी. अभिभावक और वाहन चालाक दोनों ने घोर लापरवाही बरती जिसका नतीजा बच्ची के लिए प्राणघातक हो सकता था... pic.twitter.com/ng5gLZ8b2s — Dipanshu Kabra (@ipskabra) October 21, 2022 (చదవండి: అరే ఏం యాక్ట్ చేశాయి మేకలు....అందర్నీ బకరాలు చేశాయిగా!) -
‘వందే భారత్’కు ఏమైంది?.. వరుసగా మూడో రోజూ..!
లక్నో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు రోజుల్లో ముంబయి-గాంధీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోయింది. తాజాగా మరో వందే భారత్ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడి మొరాయించింది. శనివారం న్యూఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన ఎక్స్‌ప్రెస్ రైలులో ట్రాక్షన్ మోటార్ జామ్ అయి మధ్యలోనే ఆగిపోయింది. ‘వారణాసి వందే భారత్(ట్రైన్ నంబర్ 22436) కోచ్ సీ8లోని ట్రాక్షన్ మోటార్ వీల్ బేరింగ్ విఫలమైంది. దీంతో ధన్‌కౌర్, వెయిర్ స్టేషన్ల మధ్య నిలిచిపోయింది. ఈ లోపాన్ని గుర్తించి వెంటనే రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు క్షేత్రస్థాయి అధికారులు. దీంతో రైల్లోనే ఉన్నసాంకేతిక సిబ్బంది తనిఖీ చేసి.. ఎక్స్‌ప్రెస్ రైలును నియంత్రిత వేగంతో 20కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ 5 గంటల పాటు మరమ్మతులు చేసినా ఫలితం లభించలేదు. దీంతో అందులోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానానికి చేర్చాం. సమస్య తలెత్తిన బోగీని నిర్వహణ డిపోకి తీసుకెళ్లి తనిఖీ చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. ’ అని రైల్వే శాఖ వెల్లడించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుంచి శతాబ్ది ట్రైన్‌లోకి మారుతున్న ప్రయాణికులు మరోవైపు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదాలను ఎదుర్కోవడం వరుసగా ఇది మూడో రోజు. గత గురువారం ముంబయి- గాంధీనగర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు.. అహ్మదాబాద్ సమీపంలోని వట్వా రైల్వేస్టేష వద్ద గేదెలను ఢీ కొట్టింది. దీంతో రైలు ముందు భాగం ఊడిపోయింది. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధీనగర్ నుంచి ముంబయికి బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆనంద్ స్టేషను సమీపంలో ఆవును ఢీకొట్టింది. మళ్లీ ముందుభాగం నొక్కుకుపోయి రైలు పది నిమిషాలు ఆగింది. ఇదీ చదవండి: వందే భారత్ రైలు ఘటన.. గేదెల యజమానులపై కేసు -
వీల్ క్లాంప్లు మళ్లీ వచ్చాయ్.. ఇష్టారాజ్యంగా పార్కింగ్ కుదరదు
బంజారాహిల్స్(హైదరాబాద్): ఏడేళ్ల క్రితం ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే పోలీసులు వాటి చక్రాలకు వీల్ క్లాంప్లు వేసి జరిమానాలు విధించేవారు. ఈ విధానంపై వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు ఈ విధానం నుంచి వైదొలిగారు. తాజాగా వారం రోజులుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల వాహనాలు పార్కింగ్ చేస్తే ఆ వాహనాలకు వీల్ క్లాంప్ వేయడంతో పాటు సదరు వాహనంపై జరిమానా స్టిక్కర్‌ను, ఆ ఏరియాలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారుల నంబర్ వేస్తారు. తగిన జరిమానా చెల్లించిన తర్వాత వాహనాన్ని విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు. కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలతో.. రోడ్ల పక్కన, షాపుల వద్ద, సినిమా హాళ్ల వద్ద, ఆస్పత్రులు, పార్కులు, నివాసా లు అనే తేడా లేకుండా అక్రమ పార్కింగ్‌లతో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యమవుతున్నాయి. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపూ ద్విచక్ర వాహనదారుల నుంచే పెండింగ్ జరిమానాలు వసూలు చేస్తూ కార్లను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక నుంచి వీల్‌క్లాంప్ వేసిన కార్ల నుంచి కూడా పెండింగ్ జరిమానాలు వసూలు చేసేందుకు పోలీసులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. నాలుగు రోజులుగా ఈ విధానాన్ని అమలు చేస్తూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల వద్ద ఆందోళన... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ ప్రాంతాలు ప్రధాన ఆస్పత్రులకు నెలవుగా ఉంటాయి. వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఆస్పత్రులకు వస్తుంటారు. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో, సోమాజిగూడ యశోద, బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి పెద్ద ఎత్తున రోగులు వివిధ గ్రామాల నుంచి వస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకొని ఆస్పత్రికి వచ్చిన వారు ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక రోడ్లపక్కన ఖాళీగా ఉన్న స్థలాల్లో పార్కింగ్ చేస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు నిలుపుతున్న వారిని ఈ తరహా జరిమానాలు, క్లాంప్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగుల కోరుతున్నారు. ఎందుకంటే ఏ ఆస్పత్రికి కూడా సరిపడా పార్కింగ్ సదుపాయాలు లేవు. (క్లిక్: అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు) నిత్యం 15 వరకు కేసులు.. అక్రమంగా పార్కింగ్ చేసిన ప్రాంతాలకు ట్రాఫిక్ పోలీసులు వెళ్లి ఆ కార్లకు వీల్ క్లాంప్లు వేస్తూ ఓ స్టిక్కర్ అంటించి దాని మీద సంబంధిత అధికారి ఫోన్ నంబర్ రాస్తున్నారు. పార్కింగ్ చేసిన వాహనదారు ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే ఎస్ఐ వెళ్లి వీల్ క్లాంప్ తొలగించి రూ. 600 జరిమానా విధించి పెండింగ్ జరిమానాలు కూడా క్లియర్ చేస్తారు. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు 15 వరకు కేసులు నమోదు చేస్తున్నాం. – జ్ఞానేందర్‌రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, పంజగుట్ట -
కారు పార్కింగ్ కష్టాలకు చెక్.. హ్యుందాయ్ సరికొత్త ఆవిష్కరణ
కారు కొన్న ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన సమస్య పార్కింగ్. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ హ్యుందాయ్ పరిష్కారం కనుగొంది. పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం ఈ-కార్నర్ మాడ్యూల్ 90 డిగ్రీల రొటేటింగ్ వీల్ అనే ఒక వ్యవస్థను అభివృద్ది చేసింది. ఈ 90 డిగ్రీల రొటేటింగ్ వీల్ ద్వారా ఇక నుంచి రెండు వాహనాల మధ్య సులభంగా పార్క్ చేయవచ్చు. హ్యుందాయ్ మోబిస్ ఈ-కార్నర్ మాడ్యూల్ కారులో ఎలక్ట్రిక్ మోటార్, బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్, స్టీరింగ్ అన్నీ ఒకే బ్లాక్ లో ఉంటాయి. ప్రతి చక్రం వద్ద ఉండే స్టీరింగ్, బ్రేకింగ్, సస్పెన్షన్, స్టీరింగ్ వ్యవస్థ గల ఎలక్ట్రిక్ కార్నర్ మాడ్యూల్ నమూనాను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఈ కార్నర్ మాడ్యూల్ మొదట లాస్ వెగాస్ లోని సీఈఎస్ 2018లో ఒక కాన్సెప్ట్ సిస్టమ్ గా ఆవిష్కరించారు. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. గత మూడు ఏళ్లుగా కార్నర్ మాడ్యూల్ యూనిట్ సాంకేతికపరిజ్ఞానాన్ని నియంత్రించే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్(ఈసీయు)ను అభివృద్ధి చేసింది. సంప్రదాయ వాహనాలు సుమారు 30 డిగ్రీల వరకు మాత్రమే తిరుగుతాయి. అందుకే సాధారణంగా డ్రైవర్లు ఇరుకైన సందుల్లో కారును పార్క్ చేయలేరు. కొన్ని సార్లు కారును బయటకి తీయడం కష్టం అవుతుంది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ సాంకేతికపరిజ్ఞానాన్ని హ్యుందాయ్ అభివృద్ది చేస్తుంది. ఈ టెక్నాలజీని 2023 నాటికి అందరికీ తేవాలని కంపెనీ యోచిస్తుంది. (చదవండి: భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే?) -
రైల్ వీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలో మరో ముందడుగు పడింది. భారతీయ రైల్వేతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో నిర్మించిన ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌లో శనివారం వీల్స్ ఉత్పత్తి ప్రారంభించారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్ తొలి వీల్ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ.1,680 కోట్లు వ్యయం అయిందన్నారు. ఈ ప్లాంట్ ఏడాదికి లక్ష రైల్ వీల్స్ తయారీ సామర్ధ్యం కలిగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కె.కె. ఘోష్, డైరెక్టర్(కమర్షియల్) డి.కె. మొహంతి, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎ.కె. సక్సేనా, రైల్వే బోర్డు ఈడి లక్ష్మీ రామన్, ఎస్.ఎం.ఎస్. జర్మనీ కంపెనీ సీనియర్ అధికారి కుల్జీ, ఎస్.ఎం.ఎస్ ఇండియా సీనియర్ అధికారి గ్రీనియర్తో పాటు స్టీల్‌ప్లాంట్, మెకాన్ సంస్థల ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
విశాఖపట్నం∙, భీమునిపట్నం: బే వాచ్ పార్కు నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పదకొండేళ్లకే బాలుడికి నూరేళ్లు నిండిపోవడంతో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అనుమతి లేకుండా గైరావీల్ ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షణ లేకుండా బే వాచ్ పార్కు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కె.నగరపాలెం పంచాయతీ చిన మంగమారిపేటకు చెందిన మైలిపల్లి శివదేవాస్(11) రమాద్రి వద్ద ఒక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి మైలిపల్లి శ్రీనివాస్ కూలి పనులు చేస్తుండగా తల్లి దేవి భీమిలి బీచ్ రోడ్డులోని తొట్లకొండ ఎదరుగా ఉన్న బే వాచ్ పార్కులో పని చేస్తుంది. బుధవారం స్కూల్‌కి సెలవు కావడంతో తల్లితో కలిసి శివదేవాస్ పార్కుకు వెళ్లాడు. అక్కడ విద్యుత్‌తో తిరిగే గైరా వీల్ ఉంది. అందులో పిల్లలు కూర్చుంటే కిందకు మీదకు తిరుగుతుంది. బాలుడి తల్లి పనిలో ఉండగా శివదేవాస్ దానిపైకి ఎక్కి తిరగడానికి ప్రయత్నించాడు. దీంతో అదుపు తప్పి కింద పడిపోవడంతో దాని రాడ్డుకు తల బలంగా తగలడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి తల్లి దేవి తల్లడిల్లిపోయి కన్నీరుమున్నీరైంది. ఈమెకు ఇద్దరు కుమారులు కాగా చనిపోయిన బాలుడు పెద్ద కొడుకు. చిన్నవాడు జగన్ మూడో తరగతి చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే... ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉన్న బే వాచ్ పార్కులో గైరా వీల్ నిర్వహించడానికి అనుమతి ఉండాలి. అలాగే దీన్ని తిప్పడానికి అనుభవం ఉన్న ఆపరేటర్ ఉండాలి. అయితే దీనికి అనుమతిగానీ ఆపరేటర్‌గానీ లేరని తెలిసింది. ముఖ్యంగా దీని వద్దకు పిల్లలు వెళ్లకుండా తప్పనిసరిగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే శివదేవాస్ దానిపైకి ఎక్కినా ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాలుడు చనిపోయినా నిర్వహకులు పెద్దగా స్పందించ లేదు. వారి తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. -
చిన్నారికి వీల్‌చైర్ వితరణ
‘సాక్షి’కి స్పందన హసన్‌బాద(రామచంద్రపురం రూరల్): ‘సాక్షి’లో ఈ నెల 28వ తేదీన ప్రచురితమైన ’పాపం ఇక్కట్లే’ కథనానికి స్పందించిన దయార్ద్ర హృదయులు అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి జ్యోత్సS్న వీల్‌చైర్ అందజేశారు. ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తను వాట్స్ప్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు కురుపూడి రమేష్, కనికెళ్ల కనకరత్నం, కురుపూడి రమణ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళిపాలానికి చెందిన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్టుకు పంపించారు. దానికి స్పందించిన ట్రస్ట్ అధినేత రాపతి జగదీష్ బాబు తమ ప్రతినిధి ఓరుగంటి సుబ్రహ్మణ్యం ద్వారా రూ. 5 వేలు విలువ చేసే వీల్ చైర్‌తో పాటు, రూ. 2 వేల నగదు గురువారం హసన్‌బాదలో పాప ఇంటివద్ద అందజేశారు. జ్యోత్సS్న వైద్య ఖర్చులకోసం నెలనెలా కొంత నగదు ట్రస్టు తరఫున అందజేస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట కురుపూడి రమేష్, కనికెళ్ల కనకరత్నం, కురుపూడి రమణ ఉన్నారు. -
దయ చూపని ఢిల్లీ ప్రభుత్వం!
న్యూఢిల్లీః సహాయం అడిగితే చీదరింపులు ఎదురయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి 'వీల్స్' అరిగేలా తిరిగినా ఉపయోగం లేకపోయింది. చివరికి సీఎంనే కలసి తన గోడు వెళ్ళబోసుకుందామనుకున్న వికలాంగ వ్యక్తికి... అక్కడా కనికరం కలుగలేదు. తన వీల్ ఛైర్ విరిగిపోయిందని, కొత్త ఛైర్ కొనిమ్మని ఢిల్లీ పెద్దల కాళ్ళా వేళ్ళా పడినా పట్టించుకున్నవారే లేకపోయారు. దేశ రాజధాని నగరంలో ఓ వికలాంగ వ్యక్తికి ఎదురైన ఛీత్కారాలు సాధారణ ప్రజలకు, చూపరులకు ఆందోళన కలిగించాయి. కొత్త వీల్ ఛైర్ కోసం ఆరు నెలలపాటు ఎక్కిన గుమ్మం ఎక్కకుండా తిరిగినా అధికారుల మనసు కరుగలేదు. రెండుకాళ్ళూ లేక వీల్ ఛైరే ఆధారంగా బతుకుతున్న రాజా.. తకు కొత్త వీల్ ఛైర్ కావాలంటూ సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నో అర్జీలు పెట్టుకున్నాడు. అయతే ప్రభుత్వంనుంచి ఎటువంటి సమాధానం దొరకలేదు. చివరికి పెద్ద బాస్ (సీఎం కేజ్రీవాల్) నే కలసి తన బాధను వివరిద్దామనుకున్నాడు. అక్కడకూడా తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న రాజా.. చివరికి చేసేది లేక వెనుదిరిగాడు. అనంతరం రాజా కష్టాలను విన్న ఓ మనసున్న మారాజు అతడికి వీల్ ఛైర్ ను బహూకరించాడు. ఢిల్లీ పౌరుడు, ఫిల్మ్ మేకర్.. గౌరవ్ ఆగ్రే బహూకరించిన ఛైర్ తో అతని కళ్ళలో చూసిన ఆనందాన్ని వర్ణిస్తూ అతడి ఫొటోలను గౌరవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. -
చక్రాలూడిన ఆర్టీసీ బస్సు
*అదుపు తప్పిన బస్సు- డ్రైవర్‌కు గాయాలు లింగంపేట : ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు విరిగి బస్సు అదుపుతప్పింది. ఏపీ25 వి8065 నంబర్‌గల ఆర్టీసీ హైర్(అద్దె) బస్సు కామారెడ్డి నుంచి నిజాంసాగర్ వెళ్తుండగా ముస్తాపూర్ గ్రామ శివారులో ముందు చక్రాల రాడ్ విరిగి గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాపర్తి సాయిలుకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది డ్రైవర్‌ను వైద్య చికిత్సల నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై పల్లె రాకేశ్, కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ జగదీశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.