జీ20 సదస్సుకు వచ్చిన ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి మైదాన్ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్ మండపం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ప్రపంచ నేతలందరితో కరచాలనం చేసి, వారిని ఘనంగా స్వాగతించారు. ఈ సమయంలో అందరి చూపు ఒడిశాలోని సూర్య దేవాలయంలో కనిపించే చక్రానికి ప్రతిరూపంగా వేదికపై ఏర్పాటు చేసిన నమూనాపై పడింది. ఇది వేదిక అందాన్ని రెండింతలు చేసింది.
చరిత్రకారుల తెలిపిన వివరాల ప్రకారం కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో నిర్మితమయ్యింది. దీనిని రాజు నరసింహదేవ్-I పాలనలో నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగివుంది. ఈ సూర్య చక్రంలో 24 కమ్మీలు ఉంటాయి. ఈ చక్రం భారతదేశ జాతీయ జెండాలో కూడా కనిపిస్తుంది. ఈ చక్రం భారతదేశ పురాతన విజ్ఞానం, అధునాతన నాగరికత, నిర్మాణ నైపుణ్యానికి చిహ్నంగా నిలుస్తుంది. కోణార్క్ చక్రం పురోగతిని, నిరంతర మార్పును సూచిస్తుందని చెబుతారు.
భారత రూపాయి నోట్లపై కూడా ఈ కోణార్క్ చక్రాన్ని మనం చూడచ్చు. ఒకప్పుడు 20 రూపాయల నోటుపై ఇది కనిపించింది. అలాగే ఆపై 10 రూపాయల నోటుపై కూడా దీనిని ముద్రించారు. కోణార్క్ ఆలయంలోని ఈ చక్రాన్ని ఆధారంగా చేసుకుని సమయాన్ని లెక్కిస్తారని చెబుతారు. చక్రం పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని అంటారు. ఆలయంలోని 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని చెబుతారు. కాగా ఈ ఏడాది ‘వన్ ఎర్త్’ థీమ్‌తో జీ20 సమ్మిట్ మొదటి సెషన్ ప్రారంభమైంది. జీ20 శిఖరాగ్ర సమావేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో జరుగుతుంది.
ఇది కూడా చదవండి: బెర్లిన్‌లో గణేశుని ఆలయం.. దీపావళికి ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment