కారు కొన్న ప్రతి ఒక్కరినీ వేధించే ప్రధాన సమస్య పార్కింగ్. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ హ్యుందాయ్ పరిష్కారం కనుగొంది. పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం ఈ-కార్నర్ మాడ్యూల్ 90 డిగ్రీల రొటేటింగ్ వీల్ అనే ఒక వ్యవస్థను అభివృద్ది చేసింది. ఈ 90 డిగ్రీల రొటేటింగ్ వీల్ ద్వారా ఇక నుంచి రెండు వాహనాల మధ్య సులభంగా పార్క్ చేయవచ్చు. హ్యుందాయ్ మోబిస్ ఈ-కార్నర్ మాడ్యూల్ కారులో ఎలక్ట్రిక్ మోటార్, బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్, స్టీరింగ్ అన్నీ ఒకే బ్లాక్ లో ఉంటాయి. ప్రతి చక్రం వద్ద ఉండే స్టీరింగ్, బ్రేకింగ్, సస్పెన్షన్, స్టీరింగ్ వ్యవస్థ గల ఎలక్ట్రిక్ కార్నర్ మాడ్యూల్ నమూనాను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.
ఈ కార్నర్ మాడ్యూల్ మొదట లాస్ వెగాస్ లోని సీఈఎస్ 2018లో ఒక కాన్సెప్ట్ సిస్టమ్ గా ఆవిష్కరించారు. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. గత మూడు ఏళ్లుగా కార్నర్ మాడ్యూల్ యూనిట్ సాంకేతికపరిజ్ఞానాన్ని నియంత్రించే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్(ఈసీయు)ను అభివృద్ధి చేసింది. సంప్రదాయ వాహనాలు సుమారు 30 డిగ్రీల వరకు మాత్రమే తిరుగుతాయి. అందుకే సాధారణంగా డ్రైవర్లు ఇరుకైన సందుల్లో కారును పార్క్ చేయలేరు. కొన్ని సార్లు కారును బయటకి తీయడం కష్టం అవుతుంది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ సాంకేతికపరిజ్ఞానాన్ని హ్యుందాయ్ అభివృద్ది చేస్తుంది. ఈ టెక్నాలజీని 2023 నాటికి అందరికీ తేవాలని కంపెనీ యోచిస్తుంది.
(చదవండి: భారతీయ రైల్వేతో జట్టుకట్టిన ట్రూకాలర్..! ఎందుకంటే?)
Comments
Please login to add a commentAdd a comment