China engineer built 6 wheeler vehicle using spare parts from garage - Sakshi
Sakshi News home page

చెత్తతో 6 చక్రాల వాహనం.. ‘మెకానికల్‌ గాడిద’ సూపర్‌ సే ఊపర్‌ అంటూ కితాబు!

Published Sat, Aug 12 2023 11:39 AM | Last Updated on Sat, Aug 12 2023 12:23 PM

china engineer built 6 wheeler vehicle using spare parts - Sakshi

సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు యూజర్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. తాజాగా ఒక వ్యక్తి తన గ్యారేజీలోని పనికిరాని వస్తువులతో 6 చక్రాల వాహనాన్ని తయారు చేశాడు. అది నడిచే తీరు ఎంతో వింతగా ఉంది. 

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి చిన్న వాహనంపై కూర్చుని కనిపిస్తున్నాడు. ఆ వాహనాన్ని చూస్తే ఎవరికైనా పిల్లలు ఆడుకునే బొమ్మలా అనిపిస్తుంది. పరిశీలించి చూస్తే.. అది 6 చక్రాల వాహనం అని గమనించవచ్చు. చిన్నగా కనిపించే ఈ వాహనానికి నాలుగు కాళ్లు మాదిరిగా నాలుగు రాడ్లు కనిపిస్తాయి.  మద్యలో రెండు చిన్న, చిన్న టైర్లు కనిపిస్తాయి. ఈ వాహనంపై కూర్చునేందుకు సీటు కూడా ఉంది. చూపరులను ఈ వాహనం ఎంతగానో ఆకర్షిస్తోంది. 

ఈ వీడియోను ట్విట్టర్‌లో @TansuYegen పేరుతో షేర్‌ చేశారు. వీడియోతో పాటు క్యాప్షన్‌గా చైనాకు చెందిన ఒక ఇంజినీరు గ్యారేజీలో పడివున్న సామానులను వినియోగిస్తూ మెకానికల్‌ గాడిదను తయరు చేశాడు అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 57 వేలకుపైగా వ్యూస్‌ దక్కాయి. పలువురు నెటిజన్లు ఈ వాహన తయారీని మెచ్చుకుంటున్నారు. ఒక యూజర్‌ ఈ వాహనం 5 నిముషాల్లో వెళ్లాల్సిన దూరానికి 50 నిముషాలు తీసుకుంటుందని కామెంట్‌ చేశాడు. 
ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్‌!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement