ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ సీఎండీ, డైరెక్టర్లు
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ చరిత్రలో మరో ముందడుగు పడింది. భారతీయ రైల్వేతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో నిర్మించిన ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్‌లో శనివారం వీల్స్ ఉత్పత్తి ప్రారంభించారు. స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్ తొలి వీల్ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్లాంట్ నిర్మాణానికి రూ.1,680 కోట్లు వ్యయం అయిందన్నారు. ఈ ప్లాంట్ ఏడాదికి లక్ష రైల్ వీల్స్ తయారీ సామర్ధ్యం కలిగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కె.కె. ఘోష్, డైరెక్టర్(కమర్షియల్) డి.కె. మొహంతి, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎ.కె. సక్సేనా, రైల్వే బోర్డు ఈడి లక్ష్మీ రామన్, ఎస్.ఎం.ఎస్. జర్మనీ కంపెనీ సీనియర్ అధికారి కుల్జీ, ఎస్.ఎం.ఎస్ ఇండియా సీనియర్ అధికారి గ్రీనియర్‌తో పాటు స్టీల్‌ప్లాంట్, మెకాన్ సంస్థల ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment