
యాక్సిడెంట్‌కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కానీ కొన్ని వీడియోల్లో సదరు వ్యక్తులు బతకరు అనిపించేంత దారుణమైన ప్రమాదం జరుగుతుంది. అయినప్పటికీ చాలా మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటనలు ఎన్నో చూశాం. ఐతే ఈ ఘటన మాత్రం అందుకు విరుద్ధం. ఎందుకంటే ఇక్కడొక చిన్నారిపై నుంచి కారు వెళ్లిపోయింది. ఐతే ఆమెకి ఒంటిపై ఒక్క గాయం కూడ కాలేదు. పైగా ఆ చిన్నారి సైలెంట్‌గా తనకు తానుగా లేచి వెళ్లిపోయింది.
అసలేం జరిగిందంటే...ఒక చిన్నారి తన చిన్న సైకిల్‌తో రోడ్డుపై వెళ్తోంది. ఇంతలో అటుగా వస్తున్న ఒక కారు ఆ చిన్నారిని ఢీ కొడుతుంది. దీంతో ఆ చిన్నారి కారు కింద పడిపోతుంది. అంతేగాదు కారు ముందు చక్రం ఆ చిన్నారి పై నుంచి వెళ్లిపోతుంది. ఐతే అనుహ్యంగా ఆమెకు ఎలాంటి గాయం కాలేదు. పైగా ఆ చిన్నారి తనకు తాను లేచి భయంతో ఏడుస్తూ వెళ్లిపోతుంది. మిరాకిల్ అంటే ఇది కదా!. బతకాలని రాసిపెట్టి ఉంటే ఎలాగైనా బతికేస్తాం కాబోలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.
जाको राखे सईंया मार सके ना कोय।
— Dipanshu Kabra (@ipskabra) October 21, 2022
यकीन करना मुश्किल है कि बच्ची ऐसे हादसे मे बच गयी.
अभिभावक और वाहन चालाक दोनों ने घोर लापरवाही बरती जिसका नतीजा बच्ची के लिए प्राणघातक हो सकता था... pic.twitter.com/ng5gLZ8b2s
(చదవండి: అరే ఏం యాక్ట్ చేశాయి మేకలు....అందర్నీ బకరాలు చేశాయిగా!)