*అదుపు తప్పిన బస్సు- డ్రైవర్‌కు గాయాలు
లింగంపేట : ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు విరిగి బస్సు అదుపుతప్పింది. ఏపీ25 వి8065 నంబర్‌గల ఆర్టీసీ హైర్(అద్దె) బస్సు కామారెడ్డి నుంచి నిజాంసాగర్ వెళ్తుండగా ముస్తాపూర్ గ్రామ శివారులో ముందు చక్రాల రాడ్ విరిగి గురువారం ఉదయం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాపర్తి సాయిలుకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది డ్రైవర్‌ను వైద్య చికిత్సల నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై పల్లె రాకేశ్, కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ జగదీశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
చక్రాలూడిన ఆర్టీసీ బస్సు
Published Fri, Jan 9 2015 9:37 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement