చిన్నారికి వీల్‌చైర్‌ వితరణ | wheel chair donation | Sakshi
Sakshi News home page

చిన్నారికి వీల్‌చైర్‌ వితరణ

Published Thu, Sep 29 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

చిన్నారికి వీల్‌చైర్‌ వితరణ

చిన్నారికి వీల్‌చైర్‌ వితరణ

  • ‘సాక్షి’కి స్పందన
  • హసన్‌బాద(రామచంద్రపురం రూరల్‌):
    ‘సాక్షి’లో ఈ నెల 28వ తేదీన ప్రచురితమైన ’పాపం ఇక్కట్లే’ కథనానికి స్పందించిన దయార్ద్ర హృదయులు  అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి జ్యోత్సS్న వీల్‌చైర్‌ అందజేశారు. ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తను వాట్స్‌ప్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్లు కురుపూడి రమేష్, కనికెళ్ల కనకరత్నం, కురుపూడి రమణ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళిపాలానికి చెందిన శ్రీ గురుదేవ చారిటబుల్‌ ట్రస్టుకు పంపించారు. దానికి స్పందించిన ట్రస్ట్‌ అధినేత రాపతి జగదీష్‌ బాబు తమ ప్రతినిధి ఓరుగంటి సుబ్రహ్మణ్యం ద్వారా రూ. 5 వేలు విలువ చేసే వీల్‌ చైర్‌తో పాటు, రూ. 2 వేల నగదు గురువారం హసన్‌బాదలో పాప ఇంటివద్ద అందజేశారు. జ్యోత్సS్న వైద్య ఖర్చులకోసం నెలనెలా కొంత నగదు ట్రస్టు తరఫున అందజేస్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట కురుపూడి రమేష్, కనికెళ్ల కనకరత్నం, కురుపూడి రమణ ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement