వీడియో: రష్యాపై విరుచుకుపడుతున్న ఉక్రెయిన్‌.. 9/11 తరహాలో దాడులు | Ukrainian Drone Crashes 38 Storey Residential Russias Tallest Building, Watch Shocking Video Inside | Sakshi
Sakshi News home page

Russia Vs Ukraine War: రష్యాపై విరుచుకుపడుతున్న ఉక్రెయిన్‌.. 9/11 తరహాలో దాడులు

Published Mon, Aug 26 2024 12:28 PM | Last Updated on Mon, Aug 26 2024 1:27 PM

Drone Crashes Into Russias Tallest Building

రష్యా- ఉ​​క్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రష్యాలోని సరాటోవ్‌లోని 38 అంతస్తుల అత్యంత ఎత్తయిన భవనం  వోల్గా స్కైపైకి ఉక్రెయిన్‌ డ్రోన్ దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవనంలోని పలు అపార్ట్‌మెంట్లు  దెబ్బతిన్నాయి. వోల్గా స్కై కాంప్లెక్స్ ఎత్తు 128.6 మీటర్లు. ఈ ప్రాంతంలో ఇదే అత్యంత ఎత్తయిన భవనం. డ్రోన్ శిథిలాలు భవనంపై చెల్లాచెదురుగా పడివున్నాయని అధికారులు చెబుతున్నారు.
 

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో డ్రోన్ స్ట్రైక్‌ కారణంగా వాటి శిథిలాలు కింద చెల్లాచెదురుగా పడ్డాయని ప్రాంతీయ గవర్నర్ రోమన్ బుసార్గిన్ తెలిపారు. ఈ తాజా దాడి రష్యాలో భద్రతాపరమైన ఆందోళనలను లేవనెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్‌ అయిన వీడియోలు డ్రోన్‌ దాడి కారణంగా ఎంత నష్టం వాటిల్లిందనేది చూపిస్తున్నాయి.  2001, సెప్టెంబరు 11న యునైటెడ్ స్టేట్స్‌లోని ట్విన్‌ టవర్స్‌పై అల్-ఖైదా వైమానిక దాడులు జరిపింది. వాటిని 9/11 దాడులుగా పేర్కొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement