
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్–28 సదస్సు గురువారం ప్రారంభమైంది. 12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు.