ఖతర్‌లో భారతీయుల వెతలు | Indian workers Problems in Qatar | Sakshi
Sakshi News home page

ఖతర్‌లో భారతీయుల వెతలు

Published Fri, Jul 21 2017 12:41 AM | Last Updated on Mon, Aug 20 2018 3:56 PM

ఖతర్‌లో భారతీయుల వెతలు - Sakshi

ఖతర్‌లో భారతీయుల వెతలు

ఖతర్‌తో ఇతర అరబ్‌ దేశాలు సంబంధాలు తెంచుకున్న ఫలితంగా అక్కడి నిర్మాణ రంగం కుదేలవ తోంది. ఫలితంగా ఆ రంగంలో ఉపాధి పొందుతున్న భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. పనిలేక... మరోచోట పనిచేయడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖతర్‌లో ఉండలేక, స్వదేశానికి తిరిగి రాలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2022 సాకర్‌ వరల్డ్‌కప్‌కు ఖతర్‌ ఆతిథ్యమిస్తోంది. అందుకోసం స్టేడియాల నిర్మాణంతో పాటు భారీగా మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆంక్షలు అమల్లోకి వచ్చి నెలన్నర రోజులు దాటడంతో నిర్మాణ రంగానికి అవసరమైన మెటీరియల్‌ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

సామగ్రి అందు బాటులో లేక నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సుమారు 20 లక్షల మంది విదేశీ కార్మికులుంటే వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు. ఖతర్‌ జనాభాలో 90% మంది విదేశీ కార్మికులే. నిర్మాణాలు నిలిచిపోవడంతో కంపెనీలు కార్మికుల్ని దీర్ఘకాలిక సెలవులపై ఇంటికి పంపేస్తున్నాయి. సాధారణంగా ఏడాదికి ఒక నెల సెలవు ఇచ్చే కంపెనీలు ఇప్పుడు ఐదునెలలు సెలవులు ప్రకటించాయి. కంపెనీ స్పాన్సర్డ్‌ వీసాలపై ఖతర్‌కు విదేశీ కార్మికులు వెళుతుంటారు. ఆ కంపెనీ పని కల్పిస్తే సరి. లేదంటే మరోచోట పనిచేయడానికి వారికి ఆస్కారం ఉండదు.

దీంతో అక్కడ పనిలేక స్వదేశానికి తిరిగి వెళ్తే మళ్లీ రావడం ఆర్థికభారం కావడంతో ఖతర్‌ లోని విదేశీ కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయా రు. ఇప్పటికే మూడు లక్షల మంది కార్మికులు ఖతర్‌ను వదిలివెళ్లినట్లు అంచనా. నిర్మాణాలు నిలిచిపో తుండటం తో విదేశీ కార్మికుల ఖతర్‌ కల చెదిరిపోతోంది. అలాగే ఖతర్‌ యజమానులు కొందరు సౌదీ అరేబియా లో తమ ఫామ్‌హౌస్‌లలో పనిచేయడానికి, పశువుల కాపరులుగా భారతీయ కార్మికుల్ని నియమిం చుకున్నా రు.

 ఖతర్‌ వీసాలపై వీరిని తీసుకొచ్చి తాత్కాలిక అనుమతులతో సౌదీలో పనిలో పెట్టుకున్నారు. ఖతర్‌ దేశస్తులు వెంటనే సౌదీని వదిలివెళ్లాల్సిందిగా ఆదేశించ డంతో యజమాను లు వెళ్లిపోయారు. రోడ్డుమార్గాన్ని మూసివేసినందువల్ల వారి వద్ద పనిచేస్తున్న భారతీయ కార్మికులు దోహాకు వెళ్లడానికి సౌదీ అనుమతించడం లేదు. దాంతో వీరంతా ఆహారం, డబ్బు లేక రోడ్డునపడ్డారు. వీరిని ఇప్పుడు చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న వారిగా పరిగణిస్తారు.

ఖతర్‌లో 6.5 లక్షల మంది భారతీయులు
ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపి స్తూ ఖతర్‌తో అన్నిరకాల సంబంధాల్ని తెంచు కుంటున్నట్లు సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, బహ్రయిన్, ఈజిప్టు జూన్‌ 5న ప్రకటించాయి. ఖతర్‌కు ఉన్న ఏకైక రోడ్డు మార్గాన్ని సౌదీ అరేబియా మూసివేసింది. పోర్టుల్లో ఖతర్‌కు వెళుతున్న నౌకలకు ప్రవేశాన్ని నిరాకరించాయి. విమానాలను రద్దు చేశాయి. తీవ్రవాద సంస్థలకు సాయం చేయకూడదని, అల్‌ జజీరా టీవీ ఛానల్‌ను మూసివేయాలని.. కొన్ని డిమాండ్లు పెట్టాయి.

 వీటికి ఖతర్‌ సమ్మతించడం లేదు. కువైట్‌ మధ్యవర్తిత్వం కూడా ఫలించలేదు. ఆర్థికంగా బలమైన దేశం కావడంతో ఖతర్‌ ఈ ఆంక్షల్ని తట్టుకొని.. ఇరాన్, టర్కీల నుంచి ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని తెచ్చుకుంటోంది. ఖతర్‌లో 6.5 లక్షల మంది భారతీయ కార్మికులు ఉండగా.. వీరు ఏటా రూ. 27 వేల కోట్లు భారత్‌కు పంపుతున్నారు. నిర్మాణ రంగం కుదేలవడంతో భారతీయ కార్మికులకు పనిలేకుండా పోతోంది. గతంలో చేసిన పనికి వేతనాలు అందక వీరిలో చాలామంది ఇబ్బందిపడుతున్నారు.  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement