
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు యూఏఈ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూఏఈ లోని వైఎస్సార్సీపీ ఎన్నారై సలహాదారులు ప్రసన్న సోమిరెడ్డి, సమన్వయకర్త అక్రమ్ భాషా ఆధ్వర్యంలో పార్టీశ్రేణులను కలిశారు. రాబోయే ఎన్నికలను సమాయత్తపరిచే విధంగా దిశానిర్దేశం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. 'చంద్రబాబు అవినీతి కేసు విషయంలో చట్టం, న్యాయం తమ పని చేసుకొని వెళ్తున్నాయని, అన్నిసార్లు అబద్దాలను తమ పచ్చమీడియా ద్వారా ప్రచారం చేయలేరు.
సోషల్ మీడియా ముసుగులో పచ్చమీడియా ఏకపక్ష వార్తలను ప్రజలను నమ్మడం లేదని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ విఫలం అవడంతోనే నిరూపితం అయింది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ నివాస చౌదరి, ఫహీం, శ్యామ్ సురేంద్ర రెడ్డి, తరపట్ల మోహన్ రావు, బ్రహ్మానంద రెడ్డి, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment