
ప్రతీకాత్మక చిత్రం
అబుదాబి : దుబాయ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఓ మహిళ తీవ్రంగా గాయపడగా. నాలుగేళ్ల చిన్నారి అక్కడిక్కడే తనువు చాలించింది. ఈ విషాద ఘటన దుబాయ్‌కు 35 కి.మీ దూరంలో ఉన్న జెబెల్ అలీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు...యూఏఈలోని ఓ పాఠశాలలో చదువుతున్న తన కూతురుని తీసుకు రావడానికి మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో.. కారులో అధిక వేగంతో దుసుకొస్తున్న ఓ ఆఫ్రికన్ మహిళ వీరిని ఢీకొట్టింది. తన వాహనాన్ని రివర్స్ చేసే క్రమంలో ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరు కిందపడిపోగా..పక్కనే ఆగి ఉన్న కారుకు, ఎదురుగా వస్తున్న మరో కారుకు మధ్యలో పడి నుజ్జునుజ్జు అయ్యారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మరణించగా, తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న మరో మూడు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి.
మరోవైపు షార్జాలోని మువీలా ప్రాంతంలో కొడుకు చేతిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ మృతి చెందారు. వివరాలు..17 ఏళ్ల బాలుడు కారును పార్క్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బ్రేక్ అనుకొని యాక్సిలేటర్‌ను లాగడంతో సమీపంలో ఉన్న తల్లిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రికి చేర్చగా మార్గ మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే మైనర్ వ్యక్తికి ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడని, డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment