
బిచ్చగాళ్లు వాట్సాప్‌లో అడుక్కుంటున్నారు
దుబాయ్: నిన్న మొన్నటి వరకు దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్ల మీద అడుకున్న యాచకులు మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లోనూ అడుక్కుంటున్నారు. జాలి గుణం ఉన్న వారిని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్న వారు కట్టు కథలతో కథనాలను పంపి తమకు తొచినంత దానం చేయమని అభ్యర్థిస్తున్నట్లు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ వెబ్‌సైట్ వెల్లడించింది. దయనీయమైన కథనాలను గుర్తు తెలియని నంబర్ల నుంచి పంపిస్తూ డబ్బులు యాచిస్తున్నట్లు పేర్కొంది. ఎంత తోచితే అంత దానం చేయాలని వేడుకుంటూ ఏకంగా బ్యాంకు అకౌంట్ నంబర్లు కూడా వాట్సాప్‌లకు పంపిస్తున్నారని వెబ్‌సైట్ తెలిపింది. రంజాన్ మాసం కావడంతో దుబాయ్‌లో ఈ మోసాల సంఖ్య మరింత పెరిగిందట.