మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్‌హెచ్ కంపాస్ కంపెనీ ఉచిత రిక్రూటింగ్ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాటరింగ్ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు.
ఉచితంగా వీసా, విమాన టికెట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్ సూపర్‌వైజర్(హాస్పిటాలిటీ క్యాటరింగ్ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్(హాస్టల్ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్ డ్రైవర్(యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి), కిచెన్ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్‌లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్‌లోని జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్‌రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్‌ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment