Recruiting
-
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): రాష్ట్రంలోని వలస కార్మికులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి కల్పించడానికి ఏడీఎన్‌హెచ్ కంపాస్ కంపెనీ ఉచిత రిక్రూటింగ్ ప్రక్రియ చేపట్టింది. తెలంగాణ జిల్లాలకు చెందిన 12 వేలమంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీ మరి కొంతమంది కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్యాటరింగ్ రంగంలో వలస కార్మికులకు ఆరు రకాలైన పనులు కల్పించనున్నారు. ఉచితంగా వీసా, విమాన టికెట్ సౌకర్యాన్ని కంపెనీ కల్పిస్తుంది. క్యాటరింగ్ సూపర్వైజర్(హాస్పిటాలిటీ క్యాటరింగ్ అనుభవం ఉన్నవారికి), టీం లీడర్(హాస్టల్ నిర్వహణ అనుభవం), హెవీ వెహికల్ డ్రైవర్(యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి), కిచెన్ స్టీవార్డ్స్, క్లీనర్స్, వెయిటర్లకు ఉపాధి కల్పించడానికి వీసాలను జారీ చేయనున్నారు. ఈ నెల 9న ముంబైలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మూర్, జగిత్యాల్లోని జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీవారిని కలిసి వివరాలను అందించాలని సంస్థ యజమాని చీటి సతీశ్‌రావు ‘సాక్షి’కి వివరించారు. 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలవారు ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులకు పచ్చ»ొట్టు ఉండకూడదని చెప్పారు. వేతనంతోపాటు ఉచితవసతి, భోజన సదుపాయం కల్పించి ఉపాధి ఇవ్వనున్నారని వెల్లడించారు. ముంబైలో ఇంటర్వ్యూకు వెళ్లేవారి కోసం తక్కువ ఖర్చుతో బస్సు సౌకర్యం కల్పించామన్నారు. -
వలంటీర్ పోస్టులకు అనూహ్య స్పందన
నిరుద్యోగులకు భరోసా ఇవ్వడమే కాకుండా సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకే చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి సంబంధించిన తొలి అడుగుకు అనూహ్య స్పందన లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 వేల వలంటీర్ల పోస్టులకు 39 వేల దరఖాస్తులు వచ్చాయి. గ్రామస్థాయిలో సగటున ప్రతి పోస్టుకు నలుగురు ఆశావహులు బరిలో నిలిచారు. కొన్ని మండలాల్లో వెయ్యికిపైగా దరఖాస్తులు అందాయి. జిల్లావ్యాప్తంగా వలంటీర్ల ఇంటర్వ్యూల ప్రకియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు జిల్లాలోని 20 మండలాలు, నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల్లో ఇంటర్వ్యూల ప్రకియను మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 46 మండలాల్లో ఇంటర్వ్యూలు పూర్తి స్థాయిలో శుక్రవారం ప్రారంభమవుతాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గ్రామ స్థాయిలో గ్రామ వలంటీర్లు, పట్టణంలో పట్టణ వలంటీర్లు, నగరంలో డివిజన్ వలంటీర్ల పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. దరఖాస్తుల స్వీకరణ ప్రకియ ప్రారంభంలో కొంత తక్కువగా దరఖాస్తులు వచ్చినా, చివరి మూడు రోజులు వేల సంఖ్యలో అందాయి. జిల్లాలోని 46 మండలాల్లో 10,936 వలంటీర్ల పోస్టులకు గానూ 39,084 దరఖాస్తులు అందాయి. వీటిలో స్క్రూట్నీ అనంతరం 37,393 మంది అర్హత సాధించారు. వీరందరికీ ఇంటర్వ్యూలకు ఏయో తేదీల్లో హాజరుకావాలనేది మెసేజ్ రూపంలో పంపే ఏర్పాటు చేశారు. జిల్లాలోని 940 పంచాయతీల్లో 10,936 పోస్టులను కుటంబాల ప్రాతిపదికన నిర్ణయించారు. దీనికి అనుగుణంగా గత నెల 24 నుంచి ఈ నెల 8 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రకియను నిర్వహించారు. ఈ క్రమంలో 10వ తేదీన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హత గల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి ఇంటర్వ్యూలను ప్రారంభించారు. రోజుకు సగటున 60 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు వీలుగా కమిటీని నియమించారు. కమిటీకి ఎంపీడీఓ చైర్మన్‌గా, తహసీల్దార్, ఈఓపీఆర్డీలు సభ్యులుగా ఉండి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 900 మంది అభ్యర్థులు దాటిన మండలాల్లో రెండు ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసి రోజూ 120 మందిని ఇంటర్వ్యూ చేసేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ శేషగిరిబాబు అధికారులతో మాట్లాడి మండలాల్లో జరగుతున్న ఇంటర్వ్యూల వివరాలను తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం మొదలుకావాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని మండలాల్లో వెయ్యికిపైగా.. మరోవైపు గ్రామ వలంటీర్ల పోస్టులకు కొన్ని మండలాల్లో వెయ్యికి పైగా దరఖాస్తులు అందాయి. మరికొన్ని మండలాల నుంచి 900కు పైగా దరఖాస్తులు అందాయి. చిల్లకూరు మండలం నుంచి 1288, బుచ్చిరెడ్డిపాళెం మండలం నుంచి 1228, కోట నుంచి 1196, పొదలకూరు మండలం నుంచి 1137 దరఖాస్తులు అందాయి. ఇందుకూరుపేట నుంచి 1064, అల్లూరు నుంచి 1015, కోవూరు నుంచి 1012, గూడూరు నుంచి 990, చిట్టమూరు మండలం నుంచి 970, రాపూరు మండలం నుంచి 933, వెంకటాచలం నుంచి 942, విడవలూరు నుంచి 908 దరఖాస్తులు అందాయి. మిగిలిన మండలాల్లో 400 నుంచి 900 వరకు దరఖాస్తులు అందాయి. పారదర్శకంగానే.. నెల్లూరు(అర్బన్) : గ్రామ వలంటీర్ల పోస్టులకు పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. జడ్పీ ఆవరణలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 10,936 గ్రామ వలంటీర్ల పోస్టులున్నాయన్నారు. వాటికి 39,084 మంది ధరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో 37,393 మంది అర్హత పొందారని తెలిపారు. తొలి రోజు 20 మండలాల్లో మాత్రమే ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయన్నారు. రెండో రోజు శుక్రవారం మిగతా మండలాల్లోఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతి మండలంలో రోజుకి 60 మంది చొప్పున ఇంటర్వ్యూ చేసేందుకు ఒక బోర్డును ఏర్పాటు చేశామన్నారు. ఆబోర్డులో ఎంపిడీవో ఛైర్మన్‌గా తహశీల్దారు, ఈవోపీఆర్డీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. 900 మంది కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన 13 మండలాల్లో రెండో బోర్డును ఏర్పాటు చేశామన్నారు. రెండో బోర్డులో మండల ప్రత్యేకాధికారి ఛైర్మన్‌గా , ఎంఈవో, డిప్యూటి తహశీల్దారు సభ్యులుగా ఇంటర్వూలు కొనసాగుతాయన్నారు. అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ సెల్ పోన్లో ఆర్టీజీఎస్ ద్వారా ఇంటర్వూకి రావాల్సిన రోజు, సమయం మెసేజ్ రూపంలో పంపుతున్నామన్నారు. ఎవరైనా ఇబ్బందులుండి అనుకోని కారణాలు వల్ల ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయిన వారు ఈనెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తెలిపారు. తొలి రోజు 300 మంది హాజరు నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు వలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో 3040 పోస్టులకు గానూ బుధవారం రాత్రికి 4047 దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేషన్ కార్యాలయంలో 10 కమిటీలతో వార్డుల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఒక్కో కమిటీలో ముగ్గురు చొప్పున అధికారులు, ఉద్యోగులు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. గురువారం 300 మంది దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. 310 మందికి ఇంటర్వ్యూలను శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఇంటర్వ్యూలు కొనసాగనున్నాయి. -
ఆర్మీ ‘పండిట్’ నియామకాల్లో అక్రమాలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్మీలో రిలీజియస్ టీచర్స్ (పండిట్) ఉద్యోగాల నియామక ప్రక్రియలో కుంభకోణం జరిగిందని సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఆర్టిలరీ సెంటర్లో జరిగిన ఇంటర్వ్యూకు దేశంలోని అనేక రాష్ట్రాల అభ్యర్థులు హాజరయ్యారు. 2013 నుంచి 2014 మధ్య హైదరాబాద్‌లో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో కుంభకోణం జరిగిందని సీబీఐ పేర్కొంది. కొందరు ఆర్మీ సుబేదార్ అధికారులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలొచ్చాయి. ఆర్మీ సుబేదార్ ఎమ్ఎన్ త్రిపాఠి కుంభకోణం మొత్తానికి సూత్రధారిగా పేర్కొంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఇంటర్వ్యూలో సులభమైన ప్రశ్నలు అడిగేందుకు పలువురు అభ్యర్థుల నుంచి నగదును బినామీల అకౌంట్ల ద్వారా త్రిపాఠి స్వీకరించినట్లు తెలంగాణ, ఏపీ హెడ్‌క్వార్టర్ మేజర్ జనరల్ శ్రీనివాస్‌రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. త్రిపాఠితో పాటు సత్యప్రకాశ్, ఎంకే పాండే, నాయక్ ఆదిత్యనారాయణ్ తివారీ, క్రాఫ్ట్స్‌మెన్ ప్రవీణ్‌కుమార్ సారస్వత్, నాయక్ సుబేదార్ పూజాన్ ద్వివేదీ, లాన్స్‌నాయక్ జితేంద్రకుమార్ యాదవ్, నాయక్ జగదీశ్ నారాయణ్‌పాండే, నాయక్ çసుబేదార్ బాల్ కృష్ణగార్గ్, సిపాయ్ మద్వేంద్ర మిశ్రా, సిపాయ్ రాజేశ్‌కుమార్ గోస్వామి, నాయక్ సుబేదార్ శక్తిధర్‌తివారీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. త్రిపాఠికి బినామీగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంద్రజీత్‌గుప్తా, మితాయిలాల్‌గుప్తా, అమర్‌నాథ్‌గుప్తా, విశ్వజీత్ గుప్తా, మధ్యప్రదేశ్‌కు చెందిన పంకజ్ బిల్తారేపై కూడా కేసులు నమోదయ్యాయి. 12 మంది అభ్యర్థులకు, నిందితులకు మధ్య రూ.42 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు ఆర్మీ అంతర్గత విచారణలో తేలిందని సీబీఐ వెల్లడించింది. -
రాజకీయ జోక్యానికి చెల్లుచీటీ..!
► అంగన్వాడీ ఉద్యోగ నియామకాల్లో పైరవీలకు చెక్ నల్లగొండ: అంగన్వాడీ ఉద్యోగ నియామకాల్లో రాజకీయ జోక్యానికి తెరపడింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎమ్మెల్యేలకు చోటు కల్పించకుండా జిల్లా స్థాయిలో కొత్త కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లా స్థాయి అధికారుల నేతృత్వంలో కొత్త కమిటీ ఏర్పాటు చేయగా.. దీనికి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) వ్యవహరిస్తారు. సభ్యులుగా ఆర్డీఓ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఉంటారు. అంగన్వాడీ ఉద్యోగ నియామకాలకు గతంలో ఏర్పాటు చేసిన కమిటీల్లో ఎమ్మెల్యేలకూ అవకాశం కల్పించారు. వారి కనుసన్నల్లో లేదా ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగాలకు ఇంటర్వూ్యలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల అనుయాయులు, బంధువులకే ఉద్యోగాలు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త కమిటీలో అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వలేదు. ఇంటర్వూ్యలు కూడా లేవు. పదో తరగతి మార్కులకే ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. మార్గదర్శకాలు.. ► వివాహిత మహిళలే అర్హులు.. ► పట్టణం లేదా గ్రామాల్లో అంగన్ వాడీ కేంద్రం పరిధిలో నివాసం ఉంటున్న స్థానిక మహిళలకే అవకాశం. ► ఎస్టీ వాడల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎస్టీలు..ఎస్సీ వాడల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎస్సీలకు మాత్రమే ఉద్యోగాల్లో చోటుకల్పిస్తారు. ► ► అభ్యర్థుల ఎంపికకు వంద మార్కులు కేటాయించారు. పదో తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన వారికి 80 మార్కులు, అనాథలకు పది, వితంతువులు, దివ్యాంగులకు ఐదు మార్కుల చొప్పు న కేటాయించారు. కేంద్రాల హేతుబద్ధీకరణ తర్వాతే.. అంగన్ వాడీ కేంద్రాల హేతుబద్ధీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబ ంధించి గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిం చాలని సూచించింది. మాతాశిశు మరణాలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరో గ్యలక్ష్మి పథకం లబ్ధిదారుల సంఖ్య నమోదుతోపాటు సంబంధిత కేంద్రంలో గర్భిణులు, బాలింతల నమోదు సం ఖ్యను పరిగణనలోకి తీసుకుంటున్నా రు. అలా నమోదు చేసిన మూడు మాసాల్లో సగటున గర్భిణి, బాలింతల సంఖ్య కనీసం ఐదుగురు లేకుం డా తక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ఉన్న కేంద్రాలను సమీప అంగన్వాడీ కేం ద్రాల్లో విలీనం చేస్తారు. ఈ విధంగా గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 26 కేంద్రాలను గుర్తించినా విలీనం చేయలేదు. వీటితోపాటు తాజాగా మళ్లీ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టాలి. ఎదురుచూపులు.. ఉద్యోగాల భర్తీలో రాజకీయ జోక్యంతో రెండేళ్లుగా ఎలాంటి నియామకాలు చేయలేదు. 2015లో చివరిసారిగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేశారు. అప్పటినుంచి అంగన్వాడీ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 195 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 52, మినీల్లో 56 టీచర్, 87 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త కమిటీ ఏర్పాటు నేపథ్యంలో త్వరలో నియామకాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
3వేల ఇంజనీర్ కొలువులు
బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ, ఆటో విడిభాగాలు తయారు చేసే కంపెనీ దేశంలో భారీ ఎత్తున ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ సంవత్సరం లో 3,000 మంది ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో చాలా వేగంగా తాము అభివృద్ధి చెందుతున్నామని ఈ క్రమంలోనే ఈ నియామకాలని బోష్ గ్రూప్ ఇండియా, అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ స్టీఫెన్ బెర్న్స్ చెప్పారు. అడుగొడిలో కొత్తగా ప్రారంభించిన రెండు భవనాల్లో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ , బోష్ గృహోపకరణాలు కేంద్రంలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు అవసరమని తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలో తమ విస్తరణ ప్లాంట్ లోని మొదటి భాగాన్ని ప్రారంభించిన సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. రాష్ట్ర మధ్య భారీ పరిశ్రమల శాఖా మంత్రి ఆర్ .వి. దేశ పాండే, రవాణామంత్రి రామలింగారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి దశ విస్తరణలో భాగంగా రూ .350 కోట్ల పెట్టుబడులతో 2014 టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొంది. రెండవ దశలో 2016 సంవత్సరానికి గాను మరో రూ. 1,170 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు బోష్ ఆసియా- పసిఫిక్ అధికారి పీటర్ టైరోలర్ తెలిపారు. అడుగోడి ,బెంగళూరు, కోయంబత్తూరులలో తమ కు 14 వేల మంది రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సిబ్బంది వున్నట్టు చెప్పారు. జర్మనీ తరువాత తమకు భారతే అతిపెద్ద అభివృద్ధి సంస్థ అని బోష్ పేర్కొంది. జీఎస్టీ బిల్లు బిల్లు వల్ల భవిష్యత్తుల్లో కచ్చితంగా మేలు జరుగుతుందన్న బెర్న్స్ అమలుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. . డీజిల్ వ్యవహారంలో ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభం క్రమంలో తాము కూడా అప్రతమత్తంగా ,ఆశావాదంతో కొనసాగుతున్నామన్నారు. -
హమ్మయ్య.. పోస్టింగ్ ఇచ్చేశారు..
ఎట్టకేలకు కారుణ్య నియామకాలు అభ్యర్థులకు పోస్టింగ్‌లు హన్మకొండ : ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో అధికారులు ఎట్టకేలకు కారుణ్య నియామకాల ప్రకియ పూర్తి చేశారు. నెలలకొద్ది ఎ దురు చూస్తున్న అభ్యర్థులకు మంగళవా రం పోస్టింగ్‌లు ఇచ్చారు. 2006 నుంచి వ రంగల్ రీజియన్ పరిధిలో సుమారు 45 కు టుంబాలు కారుణ్య నియామకాలకై ఎదురు చూస్తున్నా యి. ఇందులో 37 కుటుం బాల నుంచి 37 మంది అభ్యర్థులను కా రుణ్య నియామకాల కింద కండక్టర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వారికి నైపుణ్య పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కూడా వారంతా పాసయ్యా రు. దీనికితోడు వారి అర్హత సర్టిఫికేట్లు సంబంధి త బోర్డులకు పంపించి వెరిఫికేషన్ చేయించారు. ఇక్కడి వరకు సవ్యంగానే జరిగినా ఆ తర్వాత వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆర్టీసీ రీజినల్ ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. అభ్యర్థులు ఎదుర్కొంటు న్న ఇబ్బందులపై ఈ నెల 18న ‘కారుణ్య నియామకాలపై వివక్ష’ అనే శీర్షికతో సాక్షిలో కథ నం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్ యాజమాన్యం, అధికారులకు అభ్యర్థుల కు పోస్టింగ్‌లు ఇచ్చారు. 37 మంది అభ్యర్థులకు కారుణ్య నియామకాల కింద పో స్టింగ్‌లు ఇచ్చి డిపోలు కేటాయించారు. ఇందులో 32 మందికి భూపాలపల్లి డిపో లో పోస్టింగ్ ఇవ్వగా, హన్మకొండ డిపోకు ముగ్గురు, పరకాల, నర్సంపేట డిపోకు ఒక్కొక్కరి చొప్పున కండక్టర్లుగా పోస్టింగ్ లు ఇచ్చారు. భూపాలపల్లి డిపోకు కె.రమేశ్‌కుమార్, ఎండి మజారుద్దీన్, పి.రాఘవేందర్, టి.దయాకర్, సి.హెచ్.అమృతరావు, ఎస్.కె.అమ్జద్ పాషా, ఆర్.వీరేష్, పి.శ్రీనివాస్, డి.సంతోష్, ఆజీజ్ షాదాబ్, పి.అరుణ్‌కుమార్, ఎస్.రమేష్, ఆర్.కిరణ్‌కుమార్, డి.ప్రవీణ్, సి.హెచ్.ఎస్.కుమార్, జె.అనిల్, ఎం. విజయ్‌కుమార్, బి.కిషన్‌కుమార్, జి.నరేష్,ఎ.సురేష్, ఎస్.కె.ఫయాజ్, టి.వినీల్‌కుమార్, ఎస్.కె.షబ్బీర్, కె.శేఖర్‌బాబు, బి.రాజేష్, బి.ప్రశాంత్, జి.పవన్‌కుమార్, ఎన్.శ్రీను ఎస్.కె.ఖలీల్ పాషా, బి.శ్రీధర్, ఇ.శంకర్, ఎం.రవికుమార్‌ను కేటాయించారు. హన్మకొండ డిపోకు కె.సుష్మ, వి.సరిత, జి.జము న, నర్సంపేట డిపోకు జి.నాగమణి, పరకాలకు పి.నవీనకు పోస్టింగ్‌లు ఇచ్చారు.