
అబుదాబి: అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)... ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నీలో భారత్‌ను 2–0 తేడాతో ఓడించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా రెండు జట్ల మధ్య గురువారం ఇక్కడ జరిగిన పోరులో ఆతిథ్య యూఏఈ తరఫున ఖల్ఫాన్ ముబారక్ (41వ నిమిషం), అలీ మబ్కోత్ (88వ నిమిషం) గోల్స్ చేశారు. ఆటగాళ్లు పాస్‌లను చక్కగా అందుకోవడంతో బంతి ఎక్కువ శాతం ఆ జట్టు ఆధీనంలోనే ఉంది. సునీల్ ఛెత్రి నేతృత్వంలోని భారత జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడుల్లో ఫర్వాలేకున్నా... ఫౌల్స్ ఎక్కువగా చేసింది. పాస్‌లలోనూ వెనుకబడ్డారు. తొలి భాగం, రెండో భాగం చివర్లో ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌ను కనీసం ‘డ్రా’ చేసుకున్నా భారత్ నాకౌట్ చేరేది. ప్రస్తుతం 3 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో భారత్... సోమవారం జరిగే చివరి మ్యాచ్‌లో బహ్రెయిన్‌ను ఎదుర్కొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment