
ఒక్కసారిగా షాక్ అయిన ఎలుగుబంటి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా పులులు అడవిలో పలు జంతువులను వేటాతూ, భయపెడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత పులి అయినా.. ఎదురుపడ్డ జంతువును సరిగా అంచనా వేయకపోతే ఏం చేయాలో తోచదు. అటువంటి పరిస్థితిని ఓ పులి ఎదుర్కొంది. అడవి దారిలో ఉన్న పులి.. వెకన ఓ ఎలుగుబంటి వస్తుంది. పులిని చూడటంతో ఎలుగుబంటి ఒక్కసాగి పులిపైకి లేస్తుంది. ఎలుగుబంటిని చూసిన పులికి ఏం చేయాలో తెలియక.. భయంలో కింద కూర్చుండిపోయింది.
అనంతరం మరోసారి పులిపైకి లేచిన ఎలుగుబంటి తన వెనకువైపునకు తిరిగి చూస్తుంది. వీడియో తీస్తున్న వ్యక్తిని చూసి వెంటనే ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను సందీప్ త్రిపాఠి అనే ఐఏఎఫ్ అధికారి ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను వేలమంది వీక్షించగా.. పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘పులిని బెదిరిస్తూ.. మనిషిని చూసి పరిగెత్తిన ఎలుగుబంటి’ అని ఒకరు... ‘పులికి ధమ్కీ ఇచ్చిన ఎలుగుబంటి మనిషిని చూసి జడుసుకోవడం నిజంగా ట్విస్టే’ అని మరో నెటిజన్ చేసిన కామెంట్లు హైలైట్ అయ్యాయి.
Close encounter!!!
— Sandeep Tripathi, IFS (@sandeepifs) October 14, 2021
A close shave...
For whom...even the tiger seems confused!!!! pic.twitter.com/HD268nTKbQ