జైపూర్: పెద్దపులి అంటే అడవిలో పలు జంతువులు భయంతో పరుగులు తీస్తాయి. కొన్ని జంతువులు పులి విసిరే పంజాలకు ప్రాణాలు కోల్పోయి వాటికి ఆహారంగా మారుతాయి. పులులు సైతం తనకు ఎవరైనా భయపడాల్సిందే! అని గాంభీరంగా జంతువులపై దాడి చేస్తుంటాయి. అయితే పులి పంజాకు భయపడక కొన్ని జంతువులు వాటిని ప్రతిఘటిస్తే.. పులి సైతం పరుగులు తీయక తప్పదు. అయితే అచ్చం అటువంటి ఓ ఘటన రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుంది.
చదవండి: Anand Mahindra: ‘ఇదొక భావోద్వేగం’ ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్ల కామెంట్స్
ఆకలితో ఉన్న ఓ పెద్దపులి వెనక నుంచి పంజా విసిరి ఓ ఎలుగుబంటిని చంపి తినాలనుకుంది. అయితే చడీ చప్పుడు కాకుండా పులి.. ఎలుగుబంటి వద్దకు వెళ్లి పంజా విసిరి దానిపై పడుతుంది. అయితే అంతే వేగంగా పులి దాడిని పసిగట్టిన ఎలుగుబంటి ఒక్కసారిగా వెనక్కు తిరిగి గట్టిగా అరుస్తూ తిరగబడుతుంది. ఊహించని ఈ పరిణామనికి ఖంగు తిన్నపెద్దపులి.. ప్రాణ భయంతో ఎలుగుబంటి నుంచి తప్పించుకోవాడనికి పరుగులు తీస్తుంది.
చదవండి: అమ్మ కళ్లల్లో ఆనందం: డీఎస్పీ కుమారుడికి సెల్యూట్ చేసిన ఏఎస్సై తల్లి
దీనికి సంబంధించిన వీడియోను సుశాంత నందా అనే ఐఎఫ్‌ఎస్ అధికారి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన మూడేళ్ల క్రితం జరిగింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘ పిల్లిలా వెనక నుంచి వచ్చిన పులి.. చివరకు పిల్లిలా పరుగులు తీసింది’.. ‘ఎలుగుబంటి కోపానికి పులి భయంతో పరుగో.. పరుగో..’ అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment