వీడియో దృశ్యం
ఓ సారి పులి నోటికి చిక్కాక ప్రాణాలతో బయటపడటం అంత వీజీ కాదు. అదృష్టం జిడ్డు పట్టుకున్నట్లు పట్టుకుంటే తప్ప. ఈ వార్తలోని ఆవుదూడకు కూడా అదృష్టం ప్రజల రూపంలో జిడ్డులాగ పట్టుకుంది. అందుకే పులి నోట్లోంచి తప్పించుకుని బయటపడింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఎన్‌హెచ్ 7 పక్కన వెళుతున్న ఆవుదూడను అటవీ ప్రాంతంలోంచి వచ్చిన పులి నోట పట్టుకుంది. దాని మెడ భాగాన్ని కొరుకుతూ చంపటానికి ప్రయత్నించింది. ( ‘ఈ వెయ్యి కోట్ల ప్రశ్నకు సమాధానం తెలుసా?’
అయితే ఆ సమయంలో రోడ్డుకు అటువైపు ఉన్న జనం అదిచూసి అరవటం ప్రారంభించారు. దీంతో పులి భయపడి అక్కడినుంచి అడవిలోకి పారిపోయింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ దూడ అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సరోశ్ ఆదివారం ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. 22 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ( పులితో వాకింగ్.. ఏనుగు పిల్ల స్టెప్పులు )
Comments
Please login to add a commentAdd a comment