
పులిని చూడగానే ఎవరైనా బెదిరిపోవాల్సిందే. దాని రూపం అంతటి గాంభీర్యంగా కనిపిస్తోంది. పులి కళ్ల ముందు కనిపిస్తే భయంతో గుండె జారిపోయినట్లు అనిపిస్తుంది. అయితే ఓ పులి కర్రతో ఆడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలవుతోంది. కర్రతో పులి ఆటను చూసిన నెటిజన్లు తమ నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ఎప్పుడూ సరదా, వింతైన వీడియోలను షేర్ చేసే భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నందా మరోసారి ఇలాంటి ఆసక్తికర వీడియోను మంగళవారం తన ట్విటర్‌లో పంచుకున్నారు. (ఆలుమగల గొడవ: యూట్యూబ్‌లో వీడియోలు డిలీట్)
‘ఉత్సుకతకు చికిత్స లేదు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో పులి దాని ముందు ఉన్న ఓ పొడవాటి కర్రతో ఆడుకుంటున్నట్లు కన్పిస్తోంది. ముందుగా దాని కాళ్లతో కర్రను తీయటానికి ప్రయత్నిస్తూ నెమ్మదిగా కర్రను లేపేందుకు తన నోటిని ఉపయోగిస్తుంది. కర్ర కింద పడిపోయిన ప్రతిసారీ మళ్లీ దాన్ని తీసేందుకు పులి తీవ్ర ప్రయాత్నాలు చేస్తుంది. 37 సెకన్ల నిడివి గల ఈ వీడియోను వీక్షించడానికి నెటిజన్లు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేగాక తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరి కొందరు పులి అసలు ఏమి చేయటానికి ప్రయత్నిస్తుందని ఆశ్చర్యపోతున్నారు. (వైరల్: రెండు ఏనుగులు ప్రేమతో సరదాగా..)
Comments
Please login to add a commentAdd a comment