దుబాయ్‌లో జరిగిన జెండర్ రీవిల్ పార్టీలో బెలూన్‌లు పగలకొడుతున్న పులి
దుబాయ్: మన దగ్గర లింగ నిర్థారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. కానీ కొన్ని దేశాల్లో ఇది చట్టబద్దం. డెలివరీకి ముందే పుట్టబోయేది ఆడ, మగ అనేది వెల్లడిస్తారు వైద్యులు. ఈ క్రమంలో విదేశాల్లో జెండర్ రీవిలింగ్ పార్టీలు జరుగుతుంటాయి. దీనిలో రెండు రంగులను వాడతారు. పింక్ ఆడపిల్లను సూచిస్తే.. బ్లూ.. మగపిల్లాడిని సూచిస్తుంది. సన్నిహితులు, స్నేహితులు మధ్య ఎంతో సంతోషంగా ఈ పార్టీని జరుపుకుంటారు.
జెండర్ రివీల్ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పుడు ఈ జెండర్ రివీల్ పార్టీ గురించి ఎందుకంటే.. తాజాగా దుబాయ్‌లో జరిగిన జెండర్ రివీల్ పార్టీ వివాదాస్పదంగా మారింది. ఈ పార్టీలో సదరు కుంటుంబం జెండర్‌ని వెల్లడించడం కోసం నిజమైన పులిని వాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
(చదవండి: ఆకాశాన్ని తాకే అద్భుతాలు.. ఇవి తెలుసా?)
జెండర్ రివీల్ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం)
దుబాయ్‌కు చెందిన ఓ జంట బుర్జ్ అల్ అరబ్ హోటల్‌లో జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సదరు జంట పార్టీకి పులిని తీసుకువచ్చారు. ఇక దాన్ని బంధించకుండా.. ఉరికే వదిలేశారు. ఇక ఆ దంపతులు తమకు పుట్టబోయే బిడ్డ ఆడో, మగో చెప్పడం కోసం గాల్లోకి బెలూన్‌లు ఎగరవేయసాగారు.
(చదవండి: పెగాసెస్: ప్రిన్సెస్ ఫోన్ హ్యాక్ చేసిన మాజీ భర్త)
జెండర్ రివీల్ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం)
వీరు బెలూన్‌లు ఎగరవేస్తుంటే.. పులి గాల్లోకి ఎగిరి వాటిని పగలకొడుతుంది. ఇది చూసి అక్కడ ఉన్న జనాలు సంతోషంగా గోలగోల చేయడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ సంగతి ఏమో కానీ నెటిజనులు ముఖ్యంగా జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జెండర్ రివీల్ పార్టీ (ప్రతీకాత్మక చిత్రం)
‘‘ఇది నిజంగా చాలా తప్పు. భూమ్మీద ఉన్న ఇలాంటి అద్భుత జీవులను మీ స్వార్థం కోసం ఇలా హింసించడం తగదు.. ఇది గర్వించదగ్గ విషయం కాదు’’.. ‘‘ఓ ఆంటీ అది ఏమైనా పెంపుడు జంతువు అనుకున్నావా.. పులితో ఆడుతున్నావ్.. దానికి చిర్రెత్తుకొస్తే.. వేటాడేస్తుంది’’ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment