Tiger Survives Strong River Current.. దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వన్య ప్రాణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపుర్ఖేరీ ప్రాంతంలో ఓ పులి బ్యారేజ్‌నీటిలో తన ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. అయితే, కర్తానియాఘాట్ టైగర్ రిజర్వ్ దగ్గర వరద ధాటికి ఓ పులి కొట్టుకుపోయింది. గిరిజపురి బ్యారేజీ వద్ద ఘగ్రా నది ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల పులి వరదలో చిక్కుకుపోయి బ్యారేజ్ గేట్ల వరకు కొట్టుకొచ్చింది.
#Tiger caught in heavy currents in Sharda river in Katarniaghat.#UttarPradesh https://t.co/V2dTBPDzVh pic.twitter.com/te9vOxHoSM
— Arvind Chauhan अरविंद चौहान (@Arv_Ind_Chauhan) July 22, 2022
ఈ క్రమంలో బ్యారేజ్ గేట్ల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. మీదకు ఎక్కే ప్రయత్నం చేసిన వరద ధాటికి నీటిలో మునిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు స్థానికుల సాయంతో పులిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
However, tiger being a powerful and great swimmer, could cross the river against the current, and reached in jungles of Katerniaghat, part of Dudhwa Tiger Reserve. pic.twitter.com/cc6ak664dE
— Ramesh Pandey (@rameshpandeyifs) July 22, 2022
ఇది కూడా చదవండి: కోతి పగ పట్టిందా.. రక్తం వచ్చేలా తల్లి, చిన్నారిపై దాడి
Comments
Please login to add a commentAdd a comment