బెంగుళూరులో ల్యాండ్ అవుతోన్న రఫెల్ యుద్ధ విమానం
బెంగుళూరు: ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 20న జరగబోయే ఏరో ఇండియా షోలో పాల్గొనేందుకు బెంగుళూరులో ల్యాండ్ అయ్యాయి. ఈ రెండు కాకుండా మరో రాఫెల్ యుద్ధ విమానం బైన్నియల్ ఎయిర్ షో, ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనేందుకు వస్తోంది. ఈ యుద్ధ విమానాలను టాప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్‌లు నడపనున్నారు. ఈ యుద్ధవిమానాలను నడిపేవారి జాబితాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ వివేక్ చౌధరీ కూడా ఉన్నారు.
రానున్న ఎన్నికల్లో రాఫెల్ యుద్థ విమానాల అంశమే ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రం కావడంతో ప్రస్తుతం అందరి కళ్లు వాటిపైనే ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నప్పటికీ రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరడం దేశ భద్రతకు మరింత అవసరం. ఫిబ్రవరి 20 నుంచి జరగబోయే ఏరో ఇండియా షోలో విమానాలను చూసేందుకు ఒక్కొక్క టిక్కెట్‌కు రూ.2750(బిజినెస్ డేస్‌లో) చెల్లించాలి. మిగతా రోజుల్లో సాధారణ సందర్శకులకు రూ.1800, ఎయిర్ డిస్‌ప్లే కోసం రూ.600 చార్జి చేస్తారు. ముందుగా కాకుండా అక్కడికక్కడే టిక్కెట్లు తీసుకుంటే రూ. 250 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment