సిగరేట్‌ ముక్కతో 300 వాహనాలు దగ్ధం! | Major Fire At Air Show, Nearly 100 Cars Burnt | Sakshi
Sakshi News home page

సిగరేట్‌ ముక్కతో 300 వాహనాలు దగ్ధం!

Published Sat, Feb 23 2019 2:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్ లో జరుగుతున్న 'ఏరో ఇండియా 2019' లో అపశృతి చోటు చేసుకుంది. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు పార్క్ చేసిన వాహనాల వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో సుమారు 300 వాహనాలు వరకు దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాదానికి సిగరేటే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాల్చిపారేసిన సిగరేట్‌ ముక్క పార్కింగ్‌ సమీపంలోని ఎండుగడ్డికి అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 20న ప్రారంభమైన ఈ ఎయిర్‌ షో..24 వ తేదీ వరకు జరగనుంది. దీంతో ఎయిర్ ‌షోను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement