సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్, బెంగళూరు కాన్సుల్ జనరల్ థెయిరి బెర్తెలోట్ బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు కాన్సుల్ జనరల్ బెర్తెలోట్‌కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ మ్యాన్ పవర్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫ్రాన్స్ కాన్సులేట్ హైదరాబాద్ కార్యాలయాన్ని త్వరలోనే టీ హబ్‌లో ప్రారంభించనున్నట్టు బెర్తెలోట్ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ ఇండియా అంబాసిడర్ రానున్నట్టు తెలిపిన ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఆహా్వనించారు. భేటీలో ఐటీ, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు.
త్వరలోనే రాష్ట్రంలో టెలి పెర్ఫార్మన్స్ సంస్థల ఏర్పాటు
ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ సంస్థ టెలి పెర్ఫార్మన్స్ ప్రతినిధులు మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ సంస్థ ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐటీసీ కోహినూర్‌లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్ ఈవెంట్‌కు అతిథిగా రావాలని ఆహా్వనించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు 300 పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి తెలిపారు.
త్వరలోనే హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లంబ మంత్రి శ్రీధర్‌బాబుకి వివరించారు. టెలీ పెర్ఫార్మన్స్ సంస్థ పెట్టుబడులకు, సంస్థ కార్యకలాపాలకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ బాబు హామీనిచ్చారు. సమావేశంలో కంపెనీ ప్రతినిధులు శివ, ఫణింధర్ నల్లబెల్లి, స్వాతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment